By: Haritha | Updated at : 21 Aug 2023 07:33 AM (IST)
(Image credit: Pixabay)
రోజూ వ్యాయామాలు చేసేవారు, ప్రోటీన్ లోపంతో ఇబ్బంది పడేవారు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ ఉంటారు. సప్లిమెంట్లను తీసుకునేవారు, ప్రోటీన్ పౌడర్‌ను ద్రవ రూపంలో తీసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రోటీన్ పౌడర్‌ను పాల ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. అయితే ప్రోటీన్ పౌడర్ రోజూ తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యకరమే కానీ, ప్రతిరోజూ అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం పెరుగుతుంది. హానికరమైన ప్రభావాలు శరీరంపై కనపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
ప్రోటీన్ పౌడర్‌ను తీసుకునే వారిలో టీనేజర్లు, యువతే అధికంగా ఉంటారు. ఆ వయసులో మొటిమలు వచ్చే అవకాశం అధికంగానే ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చే ఛాన్సులు మరింత పెరుగుతాయి. ఇలాంటి పొడులలో హార్మోన్లు, బయో యాక్టివ్ పెప్టైడ్లు ఉంటాయి. ఇవి చర్మంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
శరీరంలో పోషకాలన్నీ సమతుల్యంగా ఉండాలి. ప్రతి రోజూ ప్రోటీన్ పౌడర్‌ను తీసుకోవడం వల్ల దాని పరిమాణం శరీరంలో పెరిగిపోతుంది. ఇది పోషకాల అసమతుల్యతకు కారణం అవుతుంది. ప్రోటీన్ల కోసం పాలు, మాంసం, గుడ్లు వంటి వాటిపైన ఆధారపడితే మంచిది. ప్రోటీన్ పౌడర్‌ను తక్కువ మొత్తంలోనే తాగితే ఉత్తమం. లేకుంటే శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుందని అందరికీ తెలిసిందే. వాటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ప్రోటీన్ పౌడర్‌ను అధికంగా తీసుకుంటారో మంచి బాక్టీరియాలలో అసమతుల్యత రావచ్చు. గ్యాస్, అజీర్ణం, పొట్టనొప్పి వంటివి వస్తాయి. ప్రోటీన్ పౌడర్లో కొన్ని రకాల విషపూరిత లోహాలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల శరీరానికి ఎంతో హాని. తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు అది మంచిదో కాదో వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మధుమేహం ఉన్నవారు ఇలాంటి ప్రోటీన్ పౌడర్లకు దూరంగా ఉండాలి. అంతే కాదు ప్రోటీన్ పౌడర్ రోజూ తీసుకుంటే దీర్ఘకాలంలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ స్థాయిల్లో మార్పు వస్తుంది. వ్యాయామం చేశాక చాలామంది ప్రోటీన్ పౌడర్ కలిపిన ద్రవ పదార్థాలను తాగుతారు. ఇది హఠాత్తుగా ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల భవిష్యత్తులో ఇన్సులిన్ ఉత్పత్తిలో ఎన్నో మార్పులు రావచ్చు.
Also read: వెల్లుల్లి కారంతో ఇలా చికెన్ వేపుడు చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Using Phone At Bathroom: టాయిలెట్లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!
రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం
Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
/body>