అన్వేషించండి

Liver Cancer Risk Factors : కాలేయ క్యాన్సర్​కు ప్రధాన కారకాలు ఇవే.. మధుమేహమున్నవారు తస్మాత్ జాగ్రత్త

Liver Cancer Causes : క్యాన్సర్​లలో కాలేయ క్యాన్సర్ వేరనే చెప్పాలి. ఎందుకంటే కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. దానివల్ల సమస్యను ఆలస్యంగా గుర్తిస్తాము. కొన్నిసార్లు అది బయటపడేలోపు బాగా ఆలస్యమైపోతుంది.

Liver Cancer Symptoms : క్యాన్సర్ ప్రాణాంతకమైనదని అందరికీ తెలుసు. అయితే కాలేయ క్యాన్సర్​ కూడా ప్రాణాంతక పరిస్థితే. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్​లలో ఇది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఇది ఓ ప్రధాన కారణం. కాలేయ క్యాన్సర్ సాధారణంగా సిర్రోసిస్ లేదా హెపటైటిస్​ వంటి దీర్ఘకాలిక కాలేయ రుగ్మతల వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో వస్తుంది. అయితే ఇది అలాంటి వ్యాధులు లేనివారిలో కూడా వస్తుందంటున్నారు వైద్య నిపుణులు. 

కాలేయ క్యాన్సర్​లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ప్రాథమిక కాలేయ క్యాన్సర్ అనేది కాలేయ కణాలలో ఏర్పడే క్యాన్సర్. ఇది అత్యంత సాధారణ రకం. ఇది హెపటోసైట్​లో ప్రారంభమై.. ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. సెకండరీ లివర్ క్యాన్సర్ అనేది శరీరంలోని మరొక భాగం నుంచి కాలేయానికి వ్యాపిస్తుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడి నుండైనా కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. కాలేయానికి వ్యాప్తించే అత్యంత సాధారణ క్యాన్సర్లు.. పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. 

కాలేయ క్యాన్సర్​కు ప్రమాద కారకాలివే..

కాలేయ క్యాన్సర్​కు కచ్చితమైన కారణం చెప్పలేము కానీ.. అనేక ప్రమాద కారకాలున్నాయి. అవి వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశాలను మెరుగుపరుస్తాయి. క్రానిక్ హైపటైటిస్ బి లేదా సి ఇన్పెక్షన్ సమస్యను పెంచుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సిర్రోసిస్​ వల్ల కూడా కాలేయ క్యాన్సర్​కు ప్రధానకారణమవుతుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల సిర్రోసిస్ వస్తుంది. 
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డీసీజ్.. అనేది కాలేయంలోని అదనపు కొవ్వు వల్ల కలుగుతుంది.

ఊబకాయం, టైప్ 2 మధుమేహం వల్ల ఇది వచ్చే అవకాశముంది. మధుమేహం లేనివారికంటే.. మధుమేహం ఉన్న వ్యక్తులకు కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హీమోక్రోమాటోసిస్ అనే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది వస్తుంది. ఇది కాలేయ క్యాన్సర్​ ప్రమాదాన్ని మెరుగుపరుస్తుంది. విల్స్ వ్యాధి అనేది కూడా జన్యుపరమైన వ్యాధే. దీనివల్ల శరీరంలో కాపర్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కాలేయానికి హాని కలిగిస్తుంది. కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 

కాలేయ క్యాన్సర్ లక్షణాలు

కాలేయ క్యాన్సర్ లక్షణాలు.. క్యాన్సర్ కణితి పరిమాణం, స్థానంపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఏ స్టేజ్​లో ఉన్నారనేదానిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. చాలామందిలో ఎలాంటి సంకేతాలు ఉండవు. అలాంటి వారిలో పరిస్థితి విషమించిపోతుంది. కానీ కొన్ని సంకేతాలు గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఎగువ కుడి పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపులో ఉబ్బరం లేదా వాపు, కామెర్లు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, అలసట, వికారం, వాంతులు, జ్వరం, దురద, మూత్రంలో మార్పులు కాలేయం ఆరోగ్యం దెబ్బంతింటుందనడానికి సంకేతాలు. 

మీరు ఈ క్యాన్సర్​ను జయించాలనుకుంటే.. దానిని ముందుగా గుర్తించడం చాలా అవసరం. ఎలాంటి సంకేతాలు లేకపోయినా.. ఆరునెలలకోసారి ఫుడ్ బాడీ చెకప్ చేయించుకోండి. దీనివల్ల మీరు ఈ సమస్యను తర్వగా గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. శరీరంలో ఏ అవయవమైనా సమస్య వస్తే త్వరగా సంకేతాలు చూపిస్తుంది కానీ.. కాలేయం అలా కాదు. సమస్యను చాలా ఆలస్యం చేసి.. ప్రాణాల మీదకు తెస్తుంది. పైకి బాగానే ఉన్నట్లు అనిపించినా.. లోపలి నుంచి పరిస్థితిని దారుణంగా మార్చేస్తుంది.

Also Read : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్​లాంటిదేనా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Embed widget