X

Sweets After Meals: భోజనం తర్వాత స్వీట్ ఎందుకు తినాలనిపిస్తుంది..? ఆరోగ్యానికి మంచిదేనా?

భోజనం తర్వాత స్వీట్ తినొచ్చా? కడుపు నిండిన తర్వాత కూడా తీపి ఎందుకు తినాలనిపిస్తుంది?

FOLLOW US: 

విందు భోజనాలు ఆరగించేప్పుడు ఆకు మీద తప్పకుండా స్వీట్ పెడతారు. భోజనం తర్వాత నోరు తీపి చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో తీపి పెట్టడం సాంప్రదాయంగా మారింది. అలాగే, కొంతమందికి భోజనం తిన్న తర్వాత నోట్లో ఏదో ఒకటి వేసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలను తినాలనే కోరిక పుడుతుంది. మీకు కూడా ఆ అలవాటు ఉందా? అయితే, భోజనానికి - తీపి తినాలనే కోరికకు మధ్య ఉన్న సంబంధం, దాని వల్ల లాభం ఏమిటనేది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 

⦿ సాధారణంగా మనం భోజనంగా తీసుకొనే ఆహారంలో ఎక్కువగా ఉప్పే ఉంటుంది. దానివల్ల ఆహారం తిన్న తర్వాత నోటిలో అదే రుచి ఉంటుంది. దీంతో నోరు కాస్త తీపి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. దానివల్ల అనుకోకుండానే చేతులు స్వీట్ వైపుకు వెళ్లిపోతాయి.
⦿ భోజనం చేసిన తర్వాత నీళ్లు తప్పకుండా తాగాలి. అప్పుడే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత నీరు తాగకపోతే మనసు దానికదే స్వీట్ తినాలనే కోరిక పుట్టిస్తుంది. 
⦿ మనం తినే ఆహారంలో పిండి పదార్థాల శాతం కూడా ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే సమయంలో నోరు తీపి చేసుకోవాలని కోరిక పుడుతుంది. అంటే మనసు మనకు తెలియకుండానే స్వీటు తినేలా ప్రేరేపిస్తుందన్నమాట. 
⦿ సాధారణంగా చాలామందికి బిర్యానీతోపాటు థమ్స్ అప్ తాగాలనే కోరిక కలుగుతుంది. మసాలా - తీపి కాంబినేషన్‌ చాలా రుచిగా అనిపిస్తుంది. ఇది కూడా ఒకరకంగా భోజనం తర్వాత స్వీటు తినడంతోనే సమానం. ఇందుకు కారణం.. ‘సెరటోనిన్’ అనే రసాయనం. 
⦿ ఔనండి.. కడుపునిండా భోజనం చేసినప్పుడు మెదడులో విడుదలయ్యే రసాయనమే సెరటోనిన్. దీనివల్లే భోజనం చేసిన తర్వాత హాయిగా, తృప్తి కలిగిన అనుభవాన్ని ఇస్తుంది. ఇది మనల్ని స్వీట్లు తినేందుకు కూడా ప్రేరేపిస్తుంది. 
⦿ భోజనం చేసిన తర్వాత కొంతమందికి మూడ్ డల్‌గా అనిపిస్తుంది. దీంతో వారి మెదడులోని సెరటోనిన్ రసాయనం స్వీట్ తినేందుకు ప్రేరేపించి సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. 
⦿ కొంతమంది భోజనం చేసిన తర్వాత స్వీటు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందనో లేదా ఆహారం త్వరగా అరుగుతుందనో భావిస్తారు. అందుకే, చాలామంది ఆహారం తిన్న తర్వాత స్వీట్ కిళ్లిని నమలుతారు. కొందరికి అదే అలవాటుగా కూడా మారుతుంది.

ఆరోగ్యానికి మంచిదేనా?: స్వీట్లు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు అది తాత్కాలికంగా పనిచేయొచ్చు. కానీ, అది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. డయాబెటిస్‌కు దారి తీయోచ్చు. ఆహారం తిన్న తర్వాత స్వీటు తినాలనిపించడం ఒక మానసిక సమస్య. సాధారణంగా భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి.. ఈ అలవాటును మానుకోవడమే బెటర్. ఒకవేళ భోజనం తర్వాత స్వీటు తినాలనే కోరిక తగ్గకపోతే డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. లేదా చిన్న బెల్లం ముక్క తిన్నా పర్వాలేదు. వీటిలో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే స్వీట్ తినాలనే ఆలోచన నుంచి డైవర్ట్ కావచ్చు. భోజనం తర్వాత బ్రష్ చేయడం, లేదా మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకుంటే తిపి తినాలనే కోరిక పుట్టదు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా భోజన తర్వాత తీపి తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు. 

Tags: Sweets after Meals Sweet Crving after food Sweet eating food Sweets after food Meals and sweet భోజనం తర్వాత స్వీట్

సంబంధిత కథనాలు

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Sesame Seed Powder: నువ్వుల పొడి ... రోజుకో  స్పూను తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం, తయారీ ఇలా

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Groom As Minnal Murali: ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో వరుడు.. ఆ పరుగులేంది.. ఆ ఎగురుడేంది?!

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Weird: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ

Father Love : నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

Father Love :  నాన్నంటే ధైర్యం.. నాన్నంటే బలం  ! బిడ్డ కళ్లలో ధైర్యం కోసం ఆ నాన్న ఏం చేశారంటే..?

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ