Chicken Tikka Roll : సండే స్పెషల్ చికెన్ టిక్కా రోల్.. రెస్టారెంట్ స్టైల్ టేస్టీ రెసిపీ ఇదే
Tasty Snack : సండే స్పెషల్‌గా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మీరు ఇంట్లోనే చికెన్ టిక్కా రోల్ చేసుకోవచ్చు. దీనిని మీరు ఇంట్లోనే టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు.
Sunday Special Recipes : మీరు నాన్‌వెజ్ తింటారా? అయితే మీకు చికెన్ అంటే కచ్చితంగా ఇష్టముంటుంది. పిల్లలు కూడా చికెన్‌ను బాగా ఇష్టపడతారు. అయితే సండే సాయంత్రం స్నాక్‌గా పిల్లల కోసం మీరు ఏదైనా కొత్తగా వండాలి అనుకుంటే మీరు చికెన్ టిక్కా రోల్ ట్రై చేయవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే దీనిని మీరు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ టేస్టీ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకేజి (బోన్ లెస్)
కారం - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 స్పూన్
టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 1 గుప్పెడు
పుదీనా - 10 ఆకులు
నిమ్మకాయ - సగం
రెడ్ చిల్లీ ఫ్లైక్స్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత
పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
ఆల్ మిక్స్డ్ ఫ్లోరో - 2 కప్పులు
గోధుమ పిండి - 2 కప్పులు
పంచదార - ఒకటిన్నర స్పూన్
పాలు - అరకప్పు
పచ్చిమిర్చి - 3
పెరుగు - అర కప్పు
యౌగర్ట్ - 1 కప్పు
చాట్ మసాలా - 1 స్పూన్
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
మయోన్నైస్ - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా బోన్స్ లేని చికెన్‌ను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, టమాటో కెచప్, కొత్తిమీర, పుదీనా, నాలు టేబుల్ స్పూన్ల పెరుగు, నిమ్మరసం, 4 టేబుల్ స్పూన్ల నూనె, కారం, ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేయండి. దానిని కొంచెం సేపు మారినేట్ చేయండి. కుదిరితే మీరు ఓ గంట ముందు దీనిని తయారు చేసి పెట్టకోవచ్చు. వీటిని మీరు ఎయిర్ ఫ్రయర్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో ఆల్ మిక్స్డ్ ఫ్లోర్, గోధుమపిండి, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు, అర టీస్పూన్ పంచదార, పాలు వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. మెత్తని పిండిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్‌లో అరకప్పు పుదీనా, పచ్చిమిర్చి, పెరుగు, పంచదార వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో యోగర్ట్ తీసుకుని దానిలో రెడీ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి.
ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని దానిని చపాతీలుగా ఒత్తుకోవాలి. లేయర్స్ వచ్చేలా మడిచి తయారు చేసుకున్న చపాతీలను.. పెనంపై వేసి రోస్ట్ చేయాలి. రెండు వైపులా రోస్ట్ అయిన తర్వాత పుదీనా, యోగర్ట్ మిశ్రమాన్ని ఈ చపాతీలపై అప్లై చేయాలి. అనంతరం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైను దీని మీద ప్లేస్ చేసి.. మయోన్నైస్, క్యాప్సికమ్, ఉల్లిపాయలతో గార్నిష్ చేసి రోల్ చేయాలి. వీటిని సిల్వర్ ఫాయిల్‌తో చుట్టేస్తే సరి. టేస్టీ టేస్టీ చికెన్ టిక్కా రోల్ రెడీ.
Also Read : శరీరంలో రక్తాన్ని పెంచే హెల్తీ హల్వా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే