అన్వేషించండి

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ఎక్కువ మంది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ మీద పడిపోతుంటారు. కానీ అవి కాదు, చల్లదనాన్ని ఇచ్చేవి.. అసలైన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

సూర్యుడి నెత్తి మీదకు చేరి చెమటగా మారి నాట్యమాడేస్తున్నాడు. వేసవి ఉక్కపోత నుంచి బయట పడటం చాలా కష్టం. కొంతమందికి అయితే చెమటలు కారుతూనే ఉంటాయి. ఫ్యాన్, ఏసీ, కూలర్ ముందే కూర్చుని సేద తీరతారు. చల్లని ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ తాగితే పొట్ట కూడా హాయిగా ఉంటుంది. ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చేయాల్సింది ఇవి కాదు తీసుకునే ఆహారం. కూలింగ్ ఫుడ్స్ తినడం, ఆల్కహాల్ వంటి వాటి వల్ల బరువు పెరగడం ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడం తప్ప శరీరాన్ని చల్లగా ఉంచలేవు.

హైడ్రేటింగ్ ఆహారాలు తీసుకోకపోవడం, తక్కువగా నీరు తాగడం, నూనెలో బాగా వేయించిన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో అధిక స్థాయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ వేసవిలో శరీరానికి సరిపోకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం శరీరాన్ని చల్లగా ఉంచుతాయై. వేడిని సహజంగా తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ ఇవే. వీటిని తీసుకుంటే మండే ఎండలో కూడా చల్లగా ఉండవచ్చు.

⦿ ఖుస్ గడ్డి నుంచి తయారు చేసేది ఖుస్ షర్బత్. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక వేడి వల్ల కళలు ఎర్రగా మంటలు అనిపిస్తాయి. ఆ ఫీలింగ్ తగ్గాలంటే ఖుస్ షర్బత్ తాగాల్సిందే.

⦿ శరీరాన్ని చల్లబరిచే మరొక అద్భుతమైన పదార్థం సబ్జా. ఒక బాటిల్ నీళ్ళలో సబ్జా గింజలు వేసుకుని తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది.

⦿ కోకుమ్ జ్యూస్ తాగితే శరీరంలోని వేడి, మంట తగ్గించడానికి ఇదొక గొప్ప మార్గం. శరీరాన్ని చల్లబరుస్తుంది. నిర్జలీకరణాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షణగా నిలుస్తుంది.

⦿ బార్లీ నీరు నిర్జలీకరణాన్ని నివారించడంలో సహాయపడుతాయి. పుదీనా, కొత్తిమీర ఆకులు శరీరంలోని వేడిని తొలగిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించేస్తాయి.

ఇవి మీకు చల్లదనాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వేసవిలో ఈ ఉత్తమమైన ఆహారాలు చాలా తేలికగా ఉంటాయి. మిమ్మల్ని రిఫ్రెష్ గా ఉంచుతాయి. వేడిని దూరం చేస్తాయి. ఇవే కాదు కాలానుగుణమైన పండ్లు, కూరగాయలు తీసుకుంటే దాహాన్ని తీర్చేస్తాయి. ఇవే కాదు కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ, మజ్జిగ, కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు, కీరదోస తీసుకున్నా మంచిది. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ని తిరిగి భర్తీ చేస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.

పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరే ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఈ పండ్లు దర్శనమిస్తాయి. పుచ్చకాయ తింటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దాని సహజమైన తీపి రుచికి అందరూ ఫిదా అయిపోతారు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో కలిగిన పుచ్చకాయ తీసుకుంటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చల్లటి మజ్జిగ తాగితే శరీరానికి ఎనర్జీ వస్తుంది. ప్రతిరోజు వీటిని తప్పకుండా తీసుకునేలా ప్రయత్నించి మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోండి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: సబ్బుతో పదేపదే మొహం శుభ్రం చేసుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget