అన్వేషించండి

Mediterranean Diet : బరువు తగ్గడానికి మెడిటరేనియన్ డైట్ బెస్ట్.. ఈజీగా ఫాలో అవుతూ ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చట

weight Loss Tips : బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్​లు ట్రై చేస్తున్నారా? అయితే మెడిటరేనియన్ డైట్ బెస్ట్ అంటోన్నాయి పలు అధ్యయనాలు. రీజన్స్ ఇప్పుడు చూసేద్దాం. 

Mediterranean Diet for Weight Loss : బరువు తగ్గేందుకు వ్యాయామంతో పాటు డైట్ చాలా ముఖ్యం. తీసుకునే ఆహారం వల్లే చాలామంది బరువు తగ్గుతారు. సరైన ఫుడ్స్ తీసుకుంటూ.. అవసరం లేని ఫుడ్స్​కి దూరంగా ఉంటే బరువు తగ్గుతారనేది నిజం. అందుకే మార్కెట్​లో వివిధ రకాల డైట్స్ ప్రాచూర్యం పొందుతున్నాయి. అయితే మీరు కూడా ఇలాంటి డైట్లు ట్రై చేస్తున్నవారే అయితే బరువు తగ్గడానికి మెడిటరేనియన్ డైట్ బెస్ట్ ఆప్షన్ అంటోన్నారు నిపుణులు. అసలు ఈ డైట్ ఏంటో.. దీనివల్ల కలిగే లాభాలా ఏంటో చూసేద్దాం. 

టేస్టీగా, ఫాలో అవ్వడానికి వీలుగా, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది మెడిటరేనియన్ డైట్. యూఎస్​ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ డైట్​ ఉత్తమ ఆహారాల జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ డైట్​ ఫాలో అవ్వడం బరువు తగ్గడానికి హెల్ప్ చేసిందని గణనీయమైన ఆధారాలు ఉన్నాయి. న్యూట్రిషన్ అండ్ డయాబెటిస్​లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. 32వేలమంది 12 సంవత్సరాల పాటు మెడిటరేనియన్ డైట్​ ఫాలో అవ్వగా.. వారిలో అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గినట్లు కనుగొన్నారు. 

ది అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసన్, ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్​​లో కూడా ఈ మెడిటరేనియన్ డైట్​ గురించి ప్రస్తావించారు. లోకార్బ్ డైట్ వంటి వాటితో పోల్చినప్పుడు ఈ డైట్​ ఫాలో అయిన వారిలో రెండు రెట్లు ఎక్కువగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ డైట్​లో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మెడిటరేనియన్ డైట్

ఈ డైట్​లో తాజా, రుచికరమైన ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటారు. ప్రోటీన్, ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్ ఈ డైట్​లో భాగమవుతాయి. కొవ్వు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి అనువైనవి.

డైట్​లో భాగంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

మెడిటరేనియన్ డైట్​లో భాగంగా.. బాదం, పిస్తాపప్పులు, వాల్​నట్స్, అవిసెగింజలు, అంజీర్, ఖర్జూరం, చియాసీడ్స్ చేర్చుకోవాలి. సాల్మన్, ట్యూనా, మాకేరల్, రొయ్యలు, పీత, ఆక్టోపస్, చేపలు, సీ ఫుడ్, చికెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరలు, టమోటాలు, దోసకాయలు, బ్రోకలీ, బీన్స్, చిక్కుళ్లు వంటి కూరగాయలు తినొచ్చు. సిట్రస్, బెర్రీలు, ఆపిల్, ద్రాక్ష పండ్లు తినాలి. మిల్లెట్స్, క్వినోవా, ఓట్స్ కూడా చేర్చుకోవచ్చు. మొక్కల ఆధారిత నూనెలు, ఆలివ్​నూనెతో వంట చేసుకుంటే మంచిది. పాల ఉత్పత్తులు లిమిటెడ్​గా తీసుకోవచ్చు. 

తినకూడని ఫుడ్స్ ఇవే

మెడిటరేనియన్ డైట్​లో బరువు పెరగడానికి కారణమయ్యే ఆహారాలు తీసుకోకూడదు. ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ధాన్యాలు, మైదా పిండి, రైస్, వైట్ పాస్తా తినకూడదు. అలాగే వెన్న, రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు ఉండే ఫుడ్స్ తీసుకోకూడదు. 

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ డైట్​ని ఫాలో అవ్వొచ్చు. యూఎస్​లో వైద్యులు దీనిని ఆమోదిస్తున్నారు. డాక్టర్ వాలెస్ ప్రకారం ఇతర డైట్​ల మాదిరిగా వీటిలో ఫుడ్ రిస్ట్రక్షన్ ఉండదు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందించగలుగుతారు. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుంది.. అని చెప్పారు. 

పేగు సంబంధిత వ్యాధులు, మూత్రపిండి వ్యాధులు, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొందరికి ఇబ్బంది ఉండొచ్చని.. అలాగే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు పరిమితం చేయాలని.. కొన్నిరకాల పండ్లు, కూరగాయలు కొందరికి ఇబ్బందిని కలిగిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అయితే మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. వైద్యులు లేదా నిపుణుల సూచనలు తీసుకుని ఈ డైట్ స్టార్ట్ చేయవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Roasted Flaxseeds : వేయించిన అవిసెగింజలు రెండు వారాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. ట్రై చేసేయండి
వేయించిన అవిసెగింజలు రెండు వారాలు తింటే కలిగే ప్రయోజనాలివే.. ట్రై చేసేయండి
Chest Pain : ఛాతీలో నొప్పి వస్తుందా? అయితే అది గుండెపోటు కాకపోవచ్చు.. తేడాలు ఇలా గుర్తించండి
ఛాతీలో నొప్పి వస్తుందా? అయితే అది గుండెపోటు కాకపోవచ్చు.. తేడాలు ఇలా గుర్తించండి
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
Study Table Mistakes : పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే
పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalapathy Vijay Net Worth: రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
రూ.624.74 కోట్ల ఆస్తులు, 1.20 కోట్ల విలువైన ఆభరణాలు, BMW i7 వంటి లగ్జరీ కార్లు! టీవీకే అధినేత విజయ్ నెట్‌వర్త్ ఇదే!
IPL 2026 RR VS CSK Result Update: వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
వైభ‌వ్ 15 బాల్స్ ఫిఫ్టీ.. చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో రాణించిన రాయ‌ల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Embed widget