అన్వేషించండి

Spinach Soup: పాలకూర సూప్... వారానికోసారి తాగండి చాలు

పాలకూర పోషకాల గని, దానితో సూప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.

పాలకూర గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు, పెద్దలకు కూడా చాలా అవసరమైన పోషకాలెన్నో దాని నిండుగా ఉంటాయి. ఒక కప్పు పాలకూర సూప్ చేసుకుని వారానికోసారి తిన్నా చాలు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు రోగనిరోధక శక్తికి, చర్మ సంరక్షణకు చాలా అవసరం. చర్మం పై ఉన్న మచ్చలు పోయి, కాంతిమంతంగా మారుతుంది. చర్మక్యాన్సర్ ను అడ్డుకునే శక్తి పాలకూరకు ఉంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గింస్తుంది. కాబట్టి హైబీపీ సమస్య ఉన్నవారు దీన్ని తరచూ తినాలి. అధిక బరువును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మలబధ్దకం ఉండదు. ఆకలి నియంత్రించి అమితంగా తినకుండా అడ్డుకుంటుంది. పాలకూరలో లుటీన్, జియాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలకూరలో విటమిన్ కె లభిస్తుంది. నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పాలకూరలో ఇనుము స‌మృద్ధిగా ఉంటుంది. దీన్ని తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.

కావాల్సిన పదార్ధాలు
పాలకూర తరుగు – రెండు కప్పులు
బంగాళదుంప – ఒకటి
క్యారెట్‌ – ఒకటి
మిరియాల పొడి – టీస్పూను
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
ఆయిల్‌ – రెండు టీస్పూన్లు
వెజిటేబుల్‌ స్టాక్‌ (రెడీమేడ్‌గా దొరుకుతుంది) – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ – ఒకటి
పంచదార – టీస్పూను

తయారీ ఇలా...
1. పాలకూర తరుగును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 
2. క్యారెట్, బంగాళాదుంపలను పొట్టుతీసేసి, సన్నగా తరగాలి.
3. కళాయిలో నీళ్లు వేసి క్యారెట్, బంగాళాదుంప తరుగు వేసి బాగా ఉడికించాలి. 
4. ఉడికిన తరుగును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేడినీటిలో పాలకూర ఆకులు వేసి ఉడికించాలి. 
5. పాలకూర మెత్తగా ఉడికాక చల్లరనివ్వాలి. 
6. క్యారెట్, బంగాళాదుంపలు, పాలకూర కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. 
7. అందులో వెజిటబుల్ స్టాక్ కూడా వేసి కలపాలి. 
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. 
9. అవి వేగాక పాలకూర, క్యారెట్, బంగాళదుంప మిశ్రమం, మిరియాల పొడి వేసి వేయించాలి. 
10.  రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. 

వేడివేడి సూప్‌ను సర్వ్ చేయాలి. చల్లని సాయంకాలం ఈ సూప్ తింటే భలే రుచిగా ఉంటుంది. 

Also Read: గోనెసంచి నిండా కాయిన్స్ ఇచ్చి స్కూటర్ కొన్నాడు, వీడియో చూడండి

Also Read: ఈ తీగ పేరేంటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా దాని ఆకులు తినాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
Nani: నాని సినిమాలో మరో హీరో... 'హిట్ 3'లోకి పోలీస్‌గా ఖైదీ వస్తాడా?
నాని సినిమాలో మరో హీరో... 'హిట్ 3'లోకి పోలీస్‌గా ఖైదీ వస్తాడా?
Cheapest Data Plans: ఎయిర్‌టెల్‌, జియో, BSNLలో ఈ డేటా ప్లాన్స్‌ బహు చవక! హ్యాపీగా IPL చూడండి
ఎయిర్‌టెల్‌, జియో, BSNLలో ఈ డేటా ప్లాన్స్‌ బహు చవక! హ్యాపీగా IPL చూడండి
Shree Siddhivinayak Bhagyalakshmi: ఈ ఆలయంలో వినాయకుడి ఆదాయం రూ.133 కోట్లు -  ఆడపిల్లల తల్లుల అకౌంట్లో ఎంత పడుతుందో తెలుసా !
ఈ ఆలయంలో వినాయకుడి ఆదాయం రూ.133 కోట్లు - ఆడపిల్లల తల్లుల అకౌంట్లో ఎంత పడుతుందో తెలుసా !
ETV Win OTT Release: 4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
4 సినిమాలు, 3 వెబ్ సిరీస్‌లు, సర్‌ప్రైజ్‌లు ఎన్నో - ఏప్రిల్‌ 2025లో 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవే
Embed widget