Tips to Quit Smoke : స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి
Quit Smoking with Food :ధూమపానం చేసేవారికి స్మోక్ చేయడం మానేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే మీరు నిజంగా మానేయాలనుకుంటే.. మీ డైట్లో కొన్ని ఫుడ్స్ తీసుకోమంటున్నారున నిపుణులు.
No Smoking Day 2024 : స్మోకింగ్ చేసేవారి మైండ్ ఎలా ఉంటుందంటే.. బ్రేక్‌ఫాస్ట్ తిన్నామా? అయితే సిగరెట్ తాగాలి. టీతో పాటు సిగరెట్ తాగితేనే హాయిగా ఉంటుంది. లంచ్ తర్వాత ఒక పఫ్ తీసుకోకపోతే తిన్నది అరగదు అన్నట్లు బిహేవ్ చేస్తారు. చివరికి స్మోకింగ్ చేయకపోతే.. షివరింగ్ మొదలైపోతుంటుంది. ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అనుకుంటే మీరు మీ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటి స్మోకింగ్ మానేయాలనుకుంటే డైట్ అంటున్నారు అనుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని స్మోకింగ్కి దూరం చేసే హెల్తీ ఫుడ్స్ ఇక్కడున్నాయి.
పొగాకు వల్ల ఏటా 8 మిలియన్ల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. హైలెట్ ఏంటంటే స్మోకింగ్ చేస్తూ ఏటా 7 మిలియన్ల మంది చనిపోతుంటే.. స్మోకింగ్ చేయకుండా.. పొగాకు ప్రభావం వల్ల 1 మిలియన్ మంది ప్రాణాలు విడిచిపెడుతున్నారు. మీరు, మీ ఫ్యామిలీ ఈ లిస్ట్‌లో చేరకూడదని మీరు అనుకుంటే.. పొగాకును విడిచిపెట్టగలిగే పద్ధతులను ఎంచుకోవాలి. ఒకేసారి మానేయడం కష్టంగా ఉంటే.. వాటి సంఖ్యను తగ్గిస్తూ.. వివిధ పద్ధతుల్లో స్మోకింగ్‌ను మానేయవచ్చు. అయితే కొన్ని ఫుడ్స్ మీరు స్మోకింగ్‌ను మానేయడంలో బాగా హెల్ప్ చేస్తాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ
రోజూ మీరు తాగే టీని గ్రీన్ టీతో రిప్లేస్ చేయండి. ఎందుకంటే ఇది మీరు స్మోకింగ్కి దూరంగా ఉండడంలో అత్యంత ప్రభావవంతంగా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని సమ్మేళనాలు నికోటిన్ కోరికను తగ్గిస్తాయి. ధూమపానం చేయాలనే కోరికను తగ్గించి.. విశ్రాంతిని అందిస్తుంది. కాబట్టి మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటే గ్రీన్ టీ రెగ్యూలర్‌గా తీసుకోవాలి.
ఫ్రూట్స్, వెజిటేబుల్స్
పండ్లు, కూరగాయలతో మీ డైట్‌ను నింపేసుకుంటే చాలా మంచిది. ఇది కేవలం స్మోకింగ్ మానేయడానికే కాదు.. మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు స్మోకింగ్ చేయాలనే కోరికను కంట్రోల్ చేస్తాయి. క్యారెట్ వంటి క్రంచీ వెజిటేబుల్స్ స్మోకింగ్ కోరికను సంతృప్తి చేస్తాయి. కాబట్టి మీరు యాపిల్స్, క్యారెట్ వంటి క్రంచీ వెజిటేబుల్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇవి స్మోక్ చేయడాన్ని కంట్రోల్ చేసి ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
విటమిన్ సి ఫుడ్
ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్ సి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దానిలో స్మోకింగ్ మానేయడం కూడా ఒకటి. విటమిని సి శరీరంలోని నికోటిన్‌ను గ్రహించి.. సమర్థవంతంగా మీరు స్మోకింగ్ నుంచి బయటపడేలా చేస్తుంది. అంతేకాకుండా స్మోకింగ్ వల్ల బలహీన పడ్డ మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్‌తో పాటు.. క్యారెట్, క్యాప్సికమ్ వంటి ఫుడ్స్‌లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ బి12 కూడా మీకు మంచి ఎంపిక అవుతాయి.
పాల ఉత్పత్తులు
పాలతో చేసుకోనే టీలు కాకుండా.. నేరుగా పాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. పాలు, వెన్న, క్రీమ్, పెరుగు వంటివి నికోటిన్ కోరికను తగ్గిస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు స్మోకింగ్ రుచిని మార్చి.. అవి క్రమంగా స్మోకింగ్ చేయాలనే కోరికను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.
చూయింగ్ గమ్స్
పనివేళల్లో చాలామంది చూయింగ్ గమ్స్ తింటారు. మీరు కూడా స్మోకింగ్ చేయాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ తినండి. ఇది మిమ్మల్ని చూయింగ్ గమ్ కోరికల నుంచి బయటపడేస్తుంది. నెమ్మదిగా స్మోకింగ్ చేయాలనే కోరికను తగ్గిస్తుంది. అంతేకాకుండా కేలరీలను తగ్గించుకోవడం కోసం.. చూయింగ్ గమ్ తీసుకోవచ్చు. ఇవి శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడానికి, ధూమపానం చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి.
Also Read : స్మోక్ చేయని వారిలో కూడా నికోటిన్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.