News
News
X

Fish Fry: చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే టేస్టు మామూలుగా ఉండదు

చేపల వేపుడండే ఇష్టపడే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువే.

FOLLOW US: 

చేప ముక్కల్ని వేయించుకుంటే ఒక టేస్టు ఉంటుంది, అదే చేపకి చేప వేయిస్తే ఆ రుచే వేరు. చేపల్లో చిన్న చేపలు ఉంటాయి. వాటిని ముక్కలు కోయకుండా అలాగే వేయించుకుని తింటే రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి ఇలా వేయించుకుని తింటే ఆ రుచిని మీరు మర్చిపోలేరు. వారానికోసారైనా మీకు తినాలనిపిస్తుంది. 

కావాల్సిన పదార్థాలు
చిన్న చేపలు - పది
పసుపు - పావు టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - ఒక టీస్పూను
ధనియాల పొడి - ఒక టీస్పూను
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
బియ్యంపిండి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - నాలుగు

తయారీ ఇలా
1. ముందుగా చేపలను బాగా కడగాలి. పసుపు, ఉప్పు వేసి కడిగితే పచ్చి వాసన పోతుంది. 
2. ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.మరీ పొడిపొడిగా ఉంటే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు.  
3. చిన్న చేపలకు కత్తితో చిన్న గాట్లు పెట్టాలి. పై మిశ్రమాన్ని చేప మొత్తానికి పట్టేలా రాయాలి. అలా ఓ పావుగంటసేపు వదిలేయాలి. 
4. ఇప్పుడ స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 
5. నూనె వేడెక్కాక ఒక్కో చేపని అందులో వేయాలి. మంట మాత్రం తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే చేప అడుగున మాడిపోతుంది. 
6. అన్ని చేపలు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. 
7. ఇప్పుడు కళాయిలో ఉన్న నూనె ఎక్కువగా ఉంటే కొంత తీసి పక్కన పెట్టుకోండి. తక్కువే ఉంటే అందులో కరివేపాకులు, నిలువుగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. చేపలు కూడా అందులో వేసేయాలి. అంతే టేస్టీ చిన్న చేపల వేపుడు రెడీ అయినట్టే. 

తింటే చేపల కూరే తినాలని అనుకుంటారు నాన్ వెజ్ ప్రియులు. చేపల వేపుడైనా, పులుసైన ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అందులోనూ చేపలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు. చేపలను తరచూ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మెదడు కూడా బాగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఒత్తిడికి గురయ్యే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే చేపలు తినడం వల్ల సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలై డిప్రెషన్ రాకుండా అడ్డుకుంటాయి. 

Also read: గర్భం ధరించలేకపోతున్నారా? ఈ అయిదింటిలో ఏదో ఒకటి కారణం కావచ్చు

Also read: యాంటీబయోటిక్ మందులు తీసుకునేటప్పుడు చేయకూడని పనులు ఇవే

Published at : 16 Jul 2022 03:42 PM (IST) Tags: Telugu recipes Fish Fry Recipe in Telugu Fish Fry Recipe Small Fish Fry Recipe Telugu Vatalu

సంబంధిత కథనాలు

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

Banana Flower: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే

Banana Flower: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే

కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

కన్నీళ్ల సాయంతో క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్సులు, శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ

ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు

ఈ ఆహారాలు మీ ఆకలిని సహజంగానే అణిచేస్తాయి, అలా కూడా బరువు తగ్గొచ్చు

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

టాప్ స్టోరీస్

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!

IND vs ZIM 2022 Squad: టీమ్‌ఇండియాలో మరో మార్పు! సుందర్‌ స్థానంలో వచ్చేది అతడే!