Skin Cancer Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా? జాగ్రత్త, చర్మ క్యాన్సర్ కావచ్చు!
వేసవిలో మీకు తెలియకుండానే యూవీ కిరణాల ప్రభావానికి గురవ్వుతారు. దాని వల్ల మీరు చర్మ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
ఎండా కాలం అంత సేఫ్ కాదు. ముఖ్యంగా ఎండలో ఎక్కువ తిరిగేవారికి మరింత డేంజర్. సూర్యుడి నుంచి శరీరాన్ని తాకే అతినీలలోహిత కిరణాలు ప్రాణాంతక చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఎండ లేనప్పుడు కూడా ఈ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. కాబట్టి, ఎండ లేకున్నా సన్‌స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్‌ను తప్పకుండా రాసుకోవాలి. మెలనోమా వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చర్మ క్యాన్సర్‌కు గురవ్వుతున్నారు. సూర్యుడి నుంచి వెలువడే UVA, UVB కిరాణాలు నిరోధించడానికి కేవలం ఎండా కాలంలో సన్‌స్క్రీన్స్ ఉపయోగిస్తే సరిపోదు. ఏడాది పొడవునా వాడాలి. కాబట్టి, చర్మ క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన చర్మం కనిపించే కొన్ని లక్షణాలు క్యాన్సర్‌ను ముందే సూచిస్తాయి. అవేంటో చూసేయండి మరి.
1. గోళ్లలో తేడా: స్కిన్ క్యాన్సర్ మన శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందుతుంది. అది గోళ్లపై కూడా ఏర్పడుతుంది. మెలనోమాలు మీ గోళ్ల కింద నల్లటి మచ్చలు లేదా గీతలుగా కనిపిస్తాయి. గోరుపై గోధుమ రంగు గీతలా ఉంటాయి. గోరు చుట్టూ ఉన్న చర్మం కూడా ముదురు రంగులోకి మారవచ్చు. గోరు కింద బొడిపె ఏర్పడవచ్చు. గోరులో చీలిక కూడా ఏర్పడవచ్చు.
2. పుట్టుమచ్చల్లో మార్పులు: మనలో చాలామందికి పుట్టమచ్చలు ఏర్పడతాయి. కొందరిలో అవి చిన్నగా, మరికొందరిలో అవి పెద్దగా పెరుగుతాయి. సాధారణంగా పుట్టి మచ్చలు హానికరమైనవి కావు. కానీ, అవి మెలనోమాలు అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి. మీ పుట్టమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపిస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. సైజులో మార్పు, రంగు, వ్యాసం, విస్తరణ వంటివి కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
3. దురద: మీ చర్మం ఎక్కువగా దురద పెడుతున్నా చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి. ఈ దురద పెర్‌ప్యూమ్‌లు లేదా స్ట్రేలు, గవత జ్వరం వల్ల ఏర్పడవచ్చు. అయితే, అవి కొద్ది రోజులకే పరిమితం అవుతుంది. మీకు నిరంతరం దుర ఉన్నట్లయితే తప్పకుండా అది చర్మ క్యాన్సర్‌కు హెచ్చరిక కావచ్చు. కాబట్టి, డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించండి.
4. పొలుసుల మచ్చలు: చర్మం మీద పొడి పొలుసులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. తామర తరహాలో ఏర్పడే ఈ మచ్చలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఆ మచ్చలతోపాటు మీరు తరచు అనారోగ్యానికి గురవ్వుతున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. మాయిశ్చరైజర్ క్రీమ్‌లు ఉపయోగించినా ఆ పొడి మచ్చలు మాయం కాకపోతే తప్పకుండా చర్మ క్యాన్సర్‌గా అనుమానించాలి.
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!
5. బలహీనమైన దృష్టి: మెలనోమాలు చర్మంపైనే కాకుండా, కళ్ళల్లో కూడా అభివృద్ధి చెందుతాయి. అవి మన దృష్టిలో మార్పులను కలిగిస్తాయి. దీన్నే ఓక్యులర్ మెలనోమా అని అంటారు. దీన్ని ముదిరే వరకు గమనించడం కష్టం. అస్పష్టమైన దృష్టి, రంగు మారిన మచ్చలు వీటి లక్షణాలు. కంట్లో గీతల్లాంటి మచ్చలు కూడా కనిపిస్తాయి. కాబట్టి, మీ కళ్లు, చూపులో ఏదైనా తేడా కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
Also Read: గుడ్ న్యూస్, ‘బరువు’ తగ్గిస్తున్న డయాబెటిక్ మందు, వ్యాయామం అక్కర్లేదట!
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, వైద్య కథనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.