By: ABP Desam | Updated at : 21 Sep 2023 09:15 AM (IST)
Image Credit: Pixabay
Mineral Water: నీరు మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. మనిషి మనుగడకి జీవనాధారం. సంపుల్లో వచ్చే నీరు పరిశుభ్రంగా ఉండటం లేదని చాలా మంది మినరల్ వాటర్ తెచ్చుకుంటారు. ప్రయాణాల్లో కూడా మినరల్ వాటర్ బాటిల్స్ మాత్రమే తాగేందుకు ఎంచుకుంటారు. వాటికి అంత అధిక ప్రాధాన్యత ఇస్తారు. మినరల్ వాటర్ స్వచ్చమైనవని భావిస్తారు. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్ముతారు. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతని సమం చేస్తుంది. బయటకి వెళ్ళి డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొనుగోలు చేసే బదులు మీరే ఇంట్లోనే సింపుల్ గా వాటిని తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఈ సులభమైన మార్గం ఉంది.
Also Read: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
మినరల్ వాటర్ తయారీ విధానం
ఇంట్లోనే మినరల్ వాటర్ చేసుకునేందుకు శుభ్రమైన గాజు లేదా కంటైనర్ తీసుకోవాలి. దాన్ని బాగా కడిగి ఎలాంటి మాలినాలు లేకుండా చూసుకోవాలి. కంటైనర్ ని క్రిమిరహితం చేయాలి. అందులో ఒక లీటర్ ఫిల్టర్ చేసిన నీటిని కంటైనర్ లో నింపాలి. అది నీటి రుచిని మారుస్తుంది. అందులో 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా ఫిల్టర్ చేసిన నీటిలో కలపాలి. శుద్ది చేసిన నీటిలో 1/8 టీ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, 1/8 టీ స్పూన్ పొటాషియం బైకార్బోనేట్ కలపాలి. చివర్లో సోడా సిఫోన్ కలుపుకోవాలి. అంతే బయట కొనుగోలు చేసినట్టుగా ఉండే మినరల్ వాటర్ సిద్ధంగా ఉంటుంది. అంతే బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా సింపుల్ గా ఇంట్లోనే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మినరల్ వాటర్ సిద్ధం చేసుకోవచ్చు.
మినరల్ వాటర్ ప్రయోజనాలు
ఇది ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని మెరుగుపరుస్తుంది. హైడ్రేట్ కాకుండా చూస్తుంది. పొటాషియం, ఎప్సమ్ సాల్ట్ వంటి పదార్థాలు జోడించడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, విరోచనాలు, గుండెల్లో మంట, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయని కొందరు వాదిస్తారు. మినరల్ వాటర్ అధికంగా తాగడం వల్ల కీళ్ల ఎముకలు అరిగిపోవడం జరుగుతుందని కొందరు చెప్తూ ఉంటారు. వాటికి బదులుగా ఫిల్టర్ వాటర్ మంచిదని అంటారు.
Also Read: జాగ్రత్త, నారింజ రసం ఎక్కువగా తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు
ఈ పద్ధతి మరింత ప్రయోజనం
ఇప్పుడు వాటర్ ఫిల్టర్స్ వచ్చాయి కానీ పూర్వం రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసుకుని తాగేవారు. మరికొందరు నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తీసుకునే వాళ్ళు. కాచి చల్లార్చిన నీటిని తాగడం అన్నింటికంటే అత్యుత్తమ మార్గం. నీటిలో ఉండే కలుషితాలు, బ్యాక్టీరియా మొత్తం నశించిపోతాయి. స్వచ్చమైన నీరు అందుతుంది. అందుకే వర్షాకాలం సమయంలో నీరు కలుషితం అవుతుందని రోగాల బారిన పడకుండా ఉండటం కోసం నీటిని కాచి వడకట్టుకుని తాగమని వైద్య నిపుణులు సలహా ఇస్తారు. నిజానికి ఇవి ఆరోగ్యకరం కూడా.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Christmas 2023 gift ideas : క్రిస్మస్ రోజు మీ పిల్లలకు ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ట్రై చెయ్యండి
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>