Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
పండ్లు కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే కుళ్లిపోతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
కొంతమంది మార్కెట్ కి వెళ్తే మళ్ళీ దొరకవు ఏమో అన్నట్టు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పండ్లు తీసుకొస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది కానీ అవి రెండు, మూడు రోజులకి మించి నిల్వ ఉండవు. మెల్లగా రంగు మారిపోవడం, కుళ్ళిపోవడం జరుగుతుంది. మనం తినే దాని కంటే చెత్త బుట్టలో పడేసేవే ఎక్కువగా ఉంటాయి. మరి పండ్లు రంగు మారిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి.
Also Read: చనిపోయేప్పుడు వాళ్లు కనిపిస్తారా? గుండెపోటుతో చావును చూసి, తిరిగొచ్చిన రోగులు ఏం చెప్పారో తెలుసా?
పొడిగా ఉంచాలి
తాజా పండ్లు నిల్వ చేయడం కోసం వాటిని కాగితపు టవల్ లేదా మామూలు టవల్ తీసుకుని శుభ్రంగా తుడవాలి. తడిగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అవి రంగు మారిపోకుండా కుళ్లిపోకుండా ఉంటాయి. పండ్లు నిల్వ చేయడానికి వాటిని క్లాంగ్ ఫిల్మ్ లేదా పేపర్ బ్యాగ్ లో చుట్టడం మంచిది. అవి పండ్ల షెల్ఫ్ జీవితాన్ని పెంచుతాయి. కట్ చేసిన పండ్లు అలాగే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల రంగు మారిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయాలి. అది తేమని నిలుపుతుంది. కాలుష్యాన్ని నిరోధిస్తుంది. కట్ చేసిన పండ్లలో ఎంజైమాటిక్ చర్యలు నివారించడానికి వాటిని ఫ్రీజ్ చేయాలి. యాపిల్ పండు కట్ చేసిన కాసేపటికి బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. కట్ చేసిన పండ్లు రంగు మారకూడదంటే వాటి మీద తాజా నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదంటే ఆస్కార్బిక్ యాసిడ్ వేసుకోవచ్చు. ఇవి పండు తాజాదనాన్ని నిలపడంలో సహాయపడుతుంది.
ఎలా నిల్వ చేయాలి
చాలా పండ్లు ఫ్రిజ్ లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వేడి, సూర్యకాంతి తగలకుండా ఉంచుకోవాలి. కొన్ని పండ్లు మాత్రం శీతలీకరణ చేస్తేనే మంచిది. బెర్రీలు, ద్రాక్ష, సిట్రస్ పండ్లు వంటి వాటి తాజాదనం పొడిగించుకోవడం కోసం రిఫ్రిజిరేటర్ లో ఉంచుకోవాలి. తేమ లేకుండా ఉండటం కోసం గాలి చొరబడని కంటైనర్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ వేసి నిల్వ చేసుకోవాలి.
Also Read: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!
ఫ్రీజింగ్
పండ్లు గోధుమ రంగులోకి మారడానికి ముందు వాటిని ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. పండ్లు ముక్కలుగా చేసి బేకింగ్ షీట్లో వేసుకొని ఫ్రీజింగ్ చేయవచ్చు. ఆ తర్వాత వాటిని ఫ్రీజర్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. ఫ్రీజ్ చేసిన పండ్లు స్మూతీస్, బేకింగ్ లో ఉపయోగించుకోవచ్చు.
వేరువేరుగా నిల్వ చేయాలి
పండ్లు అన్నింటినీ ఒకే కవర్ లో పెట్టి నిల్వ చేయడం అసలు మంచి అలవాటు కాదు. ఇథిలీన్ గ్యాస్ వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించడానికి పండ్లు ప్రత్యేక సంచులు లేదా కంటైనర్లో ఉంచాలి. కొన్ని పండ్లు సహజంగానే ఇథిలీన్ వాయువు కలిగి ఉంటాయి. అవి ఇతర వాటికి వ్యాపిస్తాయి. యాపిల్స్, అరటిపండ్లు, అవకాడోలు ఇథిలీన్ వాయువుని విడుదల చేస్తాయి. అందుకే ఇవి త్వరగా కుళ్లిపోకుండా ఉండాలంటే వేర్వేరుగా నిల్వ చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.