అన్వేషించండి

Cardiac Arrest: చనిపోయేప్పుడు వాళ్లు కనిపిస్తారా? గుండెపోటుతో చావును చూసి, తిరిగొచ్చిన రోగులు ఏం చెప్పారో తెలుసా?

గుండె ఆగిపోయిన గంట వరకు కూడా మెదడు పని చేస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.

మరణం సమీపిస్తున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందని దాని మీద విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది. ఒక వెలుగు కనిపిస్తుందని కొందరు చెప్పారు. మరికొందరు తమ శరీరం నుంచి ఆత్మ వేరు అవుతునట్టుగా అనిపించదని చెప్పారు. దీని మీద చేసిన తాజా పరిశోధన మరికొన్ని విషయాలు వెల్లడించింది. గుండె ఆగిపోయిన వ్యక్తులని బతికించేందుకు సీపీఆర్ చేస్తారు. కార్డియాక్ అరెస్ట్ తర్వాత సీపీఆర్ చేయించుకున్న వ్యక్తుల మీద ఈ పరిశోధన సాగింది. మరణం అంచు వరకు వెళ్ళి వచ్చిన వారి అభిప్రాయాలు గురినహకి అడిగి తెలుసుకున్నారు.

ఎలక్ట్రోఎన్సేఫలోగ్రామ్(EEG) స్కాన్ ప్రకారం గుండె ఆగిపోయిన ఒక గంట తర్వాత వైద్యులు సీపీఆర్ నిర్వహిస్తారు. అటువంటి సమయంలో మెదడు కార్యకపాల సంకేతాలని గుర్తించారు. గుండెకి ఆక్సిజన్ సరఫరా చేయడం ఆగిపోయిన 10 నిమిషాల తర్వాత మెదడు శాశ్వతంగా దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ అది అవాస్తవమని పరిశోధకులు కనుగొన్నారు. సీపీఆర్ చేసిన సమయంలో విద్యుత్ సంకేతాలు మెదడుకి పంపిస్తాయి. ఈ అధ్యయనంలో మే 2017 నుంచి మార్చి 2020 మధ్య గుండె ఆగిపోయిన తర్వాత సీపీఆర్ చికిత్స తీసుకుని బతికిన యూఎస్ కి చెందిన 25 మందిని, యూకేకి చెందిన 567 మంది రోగులని పరీక్షించారు. ప్రాణాలతో బయట పడిన 53 మందిలో 28 మందిని ఇంటర్వ్యూ చేసి పలు విషయాలు తెలుసుకున్నారు.

కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాళ్ళకి మనసులో ఏం కనిపించింది అనేది అడిగి తెలుసుకున్నారు. “నా ఛాతీపై ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపించింది. ఆ కుదుపులు భరించలేకపోయాను. ఎవరో గట్టిగా రుద్దుతున్నట్టు అనిపించింది. అది చాలా బాధకరమైన పరిస్థితి” అని ప్రాణాలతో బయట పడిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఒక మత్స్యకారుడు వర్షం పడుతుంటే సముద్రం దగ్గర నిలబడి పాట పాడుతున్నట్టుగా తనకి కనిపించిందని మరొకరు చెప్పారు. “నేను నా శరీరంలో లేను. బరువు లేకుండా భౌతికంగా తేలుతున్నాను. చికిత్స చేస్తున్న ఇంటెన్సివ్ థెరపీ గదిలో ఉన్నాను. నాకు ఏం చేస్తున్నారో అదంతా నేను చూడగలగుతున్నాను” అని మరొకరు వెల్లడించారు. గుండె ఆగిపోయిన గంట తర్వాత కూడా వాళ్ళు స్పృహలోనే ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.

“నా జీవితంలో జరిగిన విషయాలు మొత్తం ఒక్కసారిగా కళ్ల ముందుకు వచ్చాయి. ప్రేమ, ఆనందం, బాధ అంతా కలిగింది. నేను మాట్లాడిన ఎంతో మంది వ్యక్తులు కనిపించారు” అని ఇంకొకరు చెప్పుకొచ్చారు. మరికొంతమంది మాత్రం తాము ప్రేమించిన వ్యక్తులు కళ్ల ముందు కనిపించినట్టు గుర్తు చేసుకున్నారు. సీపీఆర్ చేస్తున్న సమయంలో కనిపించిన దృశ్యాలు, శబ్దాలు గుర్తు తెచ్చుకోగలరా లేదా అనేది కూడా పరిశోధకులు పరీక్షించారు. అందుకోసం వారికి హెడ్ ఫోన్స్ పెట్టి 10 చిత్రాలు చూపించారు. ఆపిల్, పియర్, అరటి పండు అనే మూడు పదాలు ప్లే చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 28 మందిలో ఒకరు మాత్రమే పదాల క్రమాన్ని సరిగ్గా గుర్తుంచుకున్నారు కానీ చిత్రాలు మాత్రం గుర్తు పట్టలేకపోయారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయట పడిన వ్యక్తుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే దాని మీద మరింత విస్తృతంగా పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు భావించారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ప్రతిరోజూ తులసి ఆకుల టీ తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Embed widget