News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tulsi Leaves Tea: ప్రతిరోజూ తులసి ఆకుల టీ తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం

తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరంలోని అనేక రోగాలని దూరం పెట్టవచ్చు.

FOLLOW US: 
Share:

టీ భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మిల్క్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ అంటూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమకి నచ్చిన టేస్ట్, ఆరోగ్యపరంగా టీ తీసుకుంటూ ఉంటారు. వీటన్నింటి కంటే తులసి టీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. తులసి ఆకులని భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. దీని శక్తివంతమైన ప్రయోజనాల వల్ల పురాతన కాలం నుంచి తులసి ఆకులు అన్ని విధాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆకులతో చేసిన టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక సమస్యల్ని నివారించవచ్చు.

ఒత్తిడి తగ్గిస్తుంది

తులసి ఒక అడాప్టోజెనిక్. ఇది సరేరామ్ ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనసుకి ప్రశాంతత ఇస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది.

శ్వాసకోశ ఆరోగ్యం

తులసిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఉబ్బసం, బ్రోన్స్కైటీస్, అలర్జీలు వంటి పరిస్థితులు ఉన్న వారికి గొప్ప ఔషధం లాంటిది.

దీర్ఘకాలిక వ్యాధులు నయం

తులసిలో ఫ్లేవనాయిదలు, పాలీఫేనాల్స్ తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలని రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణ ఆరోగ్యం

తులసి టీ అజీర్ణం, ఉబ్బసం, గ్యాస్ వంటి పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియని పెంచుతుంది. పేగు కదలికలు నియంత్రిస్తుంది.

శోధ నిరోధక గుణాలు

తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలిక మంటని తగ్గిస్తాయి. వాపుని నయం చేస్తుంది.

గుండె ఆరోగ్యం

తులసి రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి గుండెని పదిలంగా ఉంచుతుంది. హృదయ సంబంధ వ్యాధులని దూరం చేస్తుంది.

బరువు నియంత్రణ

బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి తులసి టీ ఉత్తమ ఎంపిక. జీవక్రియని పెంచుతుంది. బరువు తగ్గించేందుకు పరోక్షంగా సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం

తులసిలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు  మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది.

షుగర్ లెవల్స్ అదుపులో

తులసి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. మధుమేహం ఉన్న వ్యక్తులు దీన్ని తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.

మానసిక స్థితి మెరుగు

తులసి అభిజ్ఞా పనితీరుని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ప్రతిరోజూ తులసి ఆకులు నమలడం వల్ల కూడా ఇవే ప్రయోజనాలు పొందుతారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని తాజా తులసి ఆకులు లేదా తులసి పొడిని ఒక కూజా నీటిలో వేసి రాత్రాంతా మూత పెట్టి ఉంచెయ్యాలి. తెల్లవారి రోజంతా కూడా ఆ నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది.     

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఈ పాత్రల్లో వంట చేస్తే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే!

Published at : 19 Sep 2023 08:00 AM (IST) Tags: Holy Basil Tulsi Leaves Tea Tulasi Leaves Tea Skin Benefits Benefits Of Tulsi Leaves

ఇవి కూడా చూడండి

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

Green Banana: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

Mehendi: మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్