చాలా మందికి తెలియకుండా నోరు తెరుచుకుని నిద్రపోతు ఉంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల లాలాజల గ్రంథులు ఎండిపోయి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువసేపు నోరు తెరిచి ఉండటం వల్ల పెదవుల పగుళ్ళకి దారి తీస్తుంది. నోరు తెరిచి నిద్రపోతే చిగుళ్ళ వ్యాధులకు కారణమవుతుంది. నోటితో శ్వాస తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. నోరు దుర్వాసన వస్తుంది. బ్యాక్టీరియా సులభంగా నోట్లోకి ప్రవేశిస్తుంది. చిగుళ్ళ రంగు మారిపోయి రక్తస్రావం జరగవచ్చు. లాలాజలం తగ్గిపోయి దంతాల ఎనామెల్ ని పోగొడుతుంది. పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. నోటితో శ్వాస తీసుకోవడం వల్ల నోటి pH స్థాయి తగ్గిపోతుంది. దంతాలు సున్నితత్వం ఏర్పడతాయి. నోరు తెరిచి నిద్రపోతే గురక కూడా వస్తుంది. గొంతు పొడి బారిపోతుంది. గద్గద స్వరాన్ని ఇస్తుంది. Images Credit: Pexels