News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

మీ పక్కన నిద్రపోతున్న వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా అరిచి మిమ్మల్ని కొట్టారా? మీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమైన జబ్బో..!

FOLLOW US: 
Share:

నిద్రలో చాలా మంది గట్టిగా అరుస్తారు, కేకలు వేస్తారు. కలలో అలా చేస్తున్నారులే అని అనుకుంటారు. కానీ అది ఒక జబ్బు అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. నిద్ర రుగ్మతలు స్లీప్ అప్నియా, నిద్రలో నడవటం అనే అనుకుంటారు. కానీ అవే కాదు నిద్రలో కేకలు వేయడం, ఎవరినో తన్నినట్టుగా కల రావడం కూడా ఒక జబ్బే. ఇవన్నీ డిమెన్షియా(చిత్త వైకల్యం) ముందస్తు సంకేతాలు.  చిత్త వైకల్యం అనేది జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు పనితీరు మందగించడం వంటి పరిస్థితిని కలిగిస్తుంది. ఇక పార్కిన్సన్ వ్యాధి అనేది కదలికలను ప్రభావితం చేసే కేంద్ర నాడీ వ్యవస్థ రుగ్మత. డిమెన్షియా, పార్కిన్సన్ వ్యాధి వ్యాధులు వచ్చే ముందు కలిగే పరిస్థితి REM నిద్ర ప్రవర్తన రుగ్మత లేదా RBD అంటారు.

REM అంటే ఏంటి?

నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే దశ. దీన్ని రాపిడ్ ఐ మూమెంట్ అంటారు. నిద్ర చక్రం దశలలో ఒకటైన దీనిలోకి వెళ్తే కలలు కనడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల ప్రాసెసింగ్ వంటి చర్యలు అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దశలో శరీర కండరాలు వదులుగా మారతాయి. ఎవరికైనా REM స్లీప్ బిహేవియర్ డిజార్డర్ ఉంటే వాళ్ళు నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం, తన్నడం వంటివి చేస్తారు. కలలో వారిని ఎవరో వెంబడిస్తున్నట్టు దాడి చేసినట్టు చెప్తారు. నిద్రలో వాళ్ళు చేసే హింసాత్మక కదలికలు పక్కన ఉన్న వారికి ఒక్కోసారి హాని కలిగించవచ్చు.

ఈ రుగ్మతకు ఎవరు గురవుతారు?

REM అనేది ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ఇది సాధారణంగా 40 నుంచి 50 ఏళ్లలోపు వ్యక్తులకు వస్తుంది. యువకులు, యువతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని డేటా ప్రకారం 50 ఏళ్లు పైబడిన పురుషులు దీని వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

REM, పార్కిన్సన్స్ వ్యాధి

చిత్త వైకల్యం,  పార్కిన్సన్స్ వ్యాధి, లెవీ బాడీలతో(DLB)తో REM సంబంధం కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. DLB అనేది ఒక రకమైన చిత్త వైకల్యం. ఆలోచనా శక్తి తగ్గించి మెదడు పనితీరుని క్షీణతకు దారి తీస్తుంది. డేటా ప్రకారం పార్కిన్సన్స్ తో బాధపడుతున్న 25-58 శాతం మంది రోగులలో, లెవీ బాడీలతో చిత్త వైకల్యం కలిగి ఉన్న రోగులలో 70-80 శాతం మందికి REM కూడా ఉంటుంది.

న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్ ఇతర సంకేతాలు

REM కాకుండా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రోగాల ప్రమాదాన్ని పెంచే ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. అసాధారణ డోపమైన్ స్థాయిలు, వాసన కోల్పోవడం, అభిజ్ఞా క్షీణత, రంగులు గుర్తించలేకపోవడం, అంగస్తంభన లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

Published at : 01 Jun 2023 09:00 AM (IST) Tags: Dementia Sleep Disorder Dementia Symptoms Sleep Apnea Sleeping Disorder Symptoms REM

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్