అన్వేషించండి

Endurance Ship: మంచులో మాయమైన ఆ నౌక 107 ఏళ్ల తర్వాత సముద్రం అడుగున ప్రత్యక్ష్యం, ఇదిగో వీడియో

107 ఏళ్ల కిందట గడ్డకట్టిన సముద్రంలో చిక్కుకున్న ఆ నౌక ఇప్పుడు ప్రత్యక్షమైంది. నీటిలో మునిగిన ఆ నౌక ఇప్పటికీ చెక్కు చెదరకుండా అంతే దృఢంగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.

 Shackleton’s Iconic Ship Endurance | టైటానిక్’ షిప్ గురించి మన అందరికీ తెలిసిందే. 1912 సంవత్సరంలో 2,224 మంది ప్రయాణికులతో వెళ్తున్న ‘టైటానిక్’ ఐస్‌బర్గ్ (మంచు కొండ)ను ఢీకొని మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 1500 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఆ విషాద ఘటన చోటుచేసుకున్న దాదాపు మూడేళ్ల తర్వాత మరో నౌక ప్రమాదం చర్చనీయమైంది. అదే ‘ఎండ్యూరెన్స్’ (Endurance). 

అంటార్కిటిక్ అన్వేషకుడు సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్‌కు చెందిన నౌకే ఈ ‘ఎండ్యూరెన్స్’. 1915 సంవత్సరంలో అంటార్కిటిక్‌లో గడ్డ కట్టిన సముద్రంలో చిక్కుకున్న ఈ నౌక నెమ్మదిగా నెమ్మదిగా మునిగిపోయింది. అప్పటి నుంచి మళ్లీ దాని ఆచూకీ లభించలేదు. ఆ ప్రమాదం జరిగిన రోజున షాకిల్టన్, అతడి సిబ్బంది చిన్న పడవల ద్వారా తప్పించుకున్నారు. 

ఎట్టకేలకు ఆ నౌకను సముద్రం అడుగున కనుగొన్నారు. ఈ నౌక మునిగి 107 ఏళ్లు కావస్తున్నా.. ఎక్కడా చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సముద్రంలో 10 వేల అడుగులో ఉన్న ఈ నౌకపై ఉన్న పేర్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఈ నౌకను కనుగొనేందుకు పరిశోధకులు పడిన కష్టాలను త్వరలోనే ‘నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ సిరీస్‌’లో ప్రసారం చేయనున్నారు. 

మెరైన్ ఆర్కియాలజిస్ట్, మిషన్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ డైరెక్టర్ మెన్సన్ బౌండ్ దీని గురించి  ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘అది సముద్రంలో మునిగిపోయినా ఎంతో ఠీవిగా.. గర్వంగా నిలబడి ఉంది. చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉంది’’ అని తెలిపారు. అంటార్కిటిక్ పరిశోధన, లాజిస్టిక్స్ నౌక, S.A. అగుల్హాస్ II సహకారంతో ఈ ‘ఎండ్యూరెన్స్’ నౌకను కనుగొన్నారు.  

సబ్‌సీ ప్రాజెక్ట్ మేనేజర్, ఈ మిషన్‌కు నాయకత్వం వహించిన డాక్టర్ జాన్ షియర్స్‌ మాట్లాడుతూ.. ‘‘మేం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన నౌకాయాన పరిశోదనను విజయవంతంగా పూర్తి చేశాం. గట్టకట్టిన సముద్రంలో మంచు తుఫానులు, -18C వరకు పడిపోయిన ఉష్ణోగ్రతలు తదితర సవాళ్లను ఎదుర్కొంటూ ఈ పనిలో పాల్గొన్నాం. చాలా మంది ఇది అసాధ్యమని చెప్పినా, సాధించి చూపించాం’’ అని తెలిపారు.

Also Read: టమోటాలతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రేయిన్ మహిళ, ఇదే కదా స్త్రీ శక్తి అంటే!

అంటార్కిటికాలోని వాయువ్య తీరంలో వెడ్డెల్ సముద్రంలో 3,008 మీటర్ల లోతులో ఈ నౌకను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ నౌకను బయటకు తీసే అవకాశాలు లేవని తెలుస్తోంది. అంతర్జాతీయ అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం ఈ నౌకను ఒక స్మారక చిహ్నంగా పరిగణిస్తున్నారు. కాబట్టి దాన్ని అక్కడి నుంచి కదపకూడదు. అలాగే అందులోని వస్తువుల, కళాఖండాలను తాకరాదు. వాటిని సైతం పైకి కూడా తీసుకురాకూడదు. కేవలం ఆ నౌకను వెలుపల నుంచి మాత్రమే చిత్రీకరించాలి. ప్రస్తుతం నీటిలో మునిగి ఉన్న ఈ నౌక బయటి చిత్రాలను మాత్రమే విడుదల చేశారు. ఫొటోలు, వీడియోలను ఇక్కడ చూడండి. 

 (Image Credit: Falklands Maritime Heritage Trust/National Geographic & Frank Hurley)

Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Gems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABPLoksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP DesamHappy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABPAsaduddin Owaisi vs Raja singh | బీఫ్ షాపు జిందాబాద్ అన్న ఓవైసీ.. ఫైర్ అవుతున్న రాజాసింగ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Embed widget