Drone Downed With Tomatoes: టమోటాలతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రేయిన్ మహిళ, ఇదే కదా స్త్రీ శక్తి అంటే!
ఉక్రేయిన్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. చివరికి టమోటలను సైతం ఆయుధాలుగా చేసుకుని రష్యా డ్రోన్లను కూల్చేస్తున్నారు. భలే ఉందిగా ఈ మగువ తెగువ!
Russia Ukraine War | ఉక్రేయిన్(Ukraine)లోకి చొరబడిన రష్యా(Russia).. ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో అనే భయం అక్కడి ప్రజలను వెంటాడుతోంది. అయితే, ఆ నేలను విడిచి వెళ్లేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. చావైనా, బతుకైనా ఉక్రేయిన్‌లోనే అంటూ తమకు తోచిన విధంగా పోరాడుతున్నారు. రష్యా సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఓ ఉక్రేయిన్(Ukraine) మహిళ బాల్కానీలో కూర్చొని రష్యాకు చెందిన డ్రోన్‌పై టమోటాలతో దాడి చేసి కూల్చేసింది. ఈ విషయాన్ని ఉక్రేయిన్ ప్రభుత్వ సలహాదారుడే స్వయంగా ప్రకటించడం విశేషం. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉక్రేయిన్ మహిళ దోసకాయలతో డ్రోన్‌ను కూల్చేసింది’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో Liga.net అనే వార్త సంస్థ కీవ్‌లో నివసిస్తున్న ఆ మహిళను కలిసి వివరాలు సేకరించింది.
ఈ సందర్భంగా ఆమె తన పేరు ఒలెనా అని చెప్పింది. తాను డ్రోన్‌ను కూల్చేసిన సంగతి నిజమేనని, ప్రభుత్వ ప్రకటనలో చిన్న పొరపాటు ఉందని తెలిపింది. ‘‘నేను డ్రోన్‌ను కూల్చింది టమోటాలతో, మధ్యలో ఈ దోసకాయలు ఎక్కడి నుంచి వచ్చాయో’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఆ రోజు నేను కివ్‌లోని నా అపార్ట్‌మెంట్ బాల్కానీలో కూర్చొని స్మోకింగ్ చేస్తున్నా. ఆ సమయంలో శబ్దం చేసుకుంటూ ఏదో ఎగురుతూ అపార్ట్‌మెంట్ మీదకు వచ్చినట్లు అనిపించింది. అది రష్యా సైనికుల డ్రోన్ అని తెలియగానే కంగారు పడ్డాను. దగ్గర్లో ఉన్న వస్తువులు దానిపైకి విసరాలని అనుకున్నా. ఆ సమయంలో అక్కడ టమోటాలు (Tomatoes) ఉన్నాయి. అంతే, ఆలస్యం చేయకుండా టమోటాలను డ్రోన్ మీదకు గురిచేసి కొట్టాను. అంతే దెబ్బకు డ్రోన్ అదుపుతప్పి కిందపడి ముక్కలైంది’’ అని తెలిపింది.
Also Read: టాయిలెట్‌లో పుతిన్ ఫొటో, మూత్రం పోస్తూ ప్రతీకారం, రష్యాపై ఇదేం రివేంజ్‌రా అయ్యా!
‘‘ఇదంతా నేను భయంతోనే చేశాను. ఆ డ్రోన్ నన్ను షూట్ చేస్తుందేమోనని భయపడ్డాను. బాంబులు వదులుతుందేమోనని కంగారు పడ్డాను. అందుకే, అప్పటికప్పుడు దానిపై దాడి చేశాను. ఆ డ్రోన్ కిందపడిన వెంటనే నేను, నా భర్త అక్కడికి దాన్ని ముక్కలుగా ముక్కలు చేసేశాం. ఆ తర్వాత వాటిని వేర్వేరు చెత్త బుట్టల్లో వేశాం. నాకు ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి పెద్దగా తెలీదు. అవి నేను ఉండే లొకేషన్‌ను గుర్తుపడతాయనే భయం కూడా ఉంది’’ అని తెలిపింది. అయితే, ఆమె కూల్చేసినది బాంబులు వేసే డ్రోన్ కాదని, డ్రోన్ కెమేరా అని తెలిసింది. రష్యాదు దాడులకు భయపడేది లేదని ఒలెనా తెలిపింది. తమ నేలను, నగరాన్ని ఎందుకు వీడాలని, చివరికి వరకు పోరాడతామే గానీ, పారిపోమని ఆమె పేర్కొంది.
Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?
రష్యా సైనికులు ఇప్పుడు తగిన ఆహారం అందంగా అల్లాడుతున్నారు. దీంతో వారు ఖాళీగా ఉంటున్న ఇళ్లలోకి వెళ్లి ఆహారాన్ని దొంగిలిస్తున్నారు. ఉక్రేయిన్ ప్రజలు వారి దాడి చేస్తారనే భయంతో ముందుగా డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లను పరిశీలిస్తున్నారు. ఉక్రేయిన్‌కు చెందిన ‘ది పనీషర్’ (The Punisher) అనే డ్రోన్.. రష్యా నుంచి తమ సైనికులకు ఆహారాన్ని తీసుకొస్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. The Punisher Drones ఒకేసారి మూడు బాంబులను మోసుకెళ్లగలవు. అలాగే ఒకేసారి మూడు వేర్వేరు లక్ష్యాలపై దాడి కూడా చేయగలవు. చాలా నిశబ్దంగా, ఎవరికీ కనిపించకుండ ప్రయాణించడం ఈ డ్రోన్ల ప్రత్యేకత.
Os dois lados da #UkraineRussianWar começaram a empregar em maior número nos últimos dias diferentes tipos de drone tanto para reconhecimento e vigilância como para ataque (UCAV). À esq do mosaico aparecem o Bayraktar TB2 e o Punisher da 🇺🇦 e à dir os 🇷🇺 Orlan-10 e Orion pic.twitter.com/bxLqbL8ayb
— Glício Fonseca 🚁✈️🌎 (@gliciofonseca) March 6, 2022