News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!

కరోనా నుంచి బయట పడకముందే శాస్త్రవేత్తలు మరొక కొత్త వైరస్ దాడి చేయబోతుందని హెచ్చరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఏదో ఒక మూలన కొత్త వేరియంట్లతో ప్రజల ముందుకు వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచానికి మరొక వైరస్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కోవిడ్ కంటే ఘోరంగా ఉండబోతోందని అంటున్నారు. గతంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ మాదిరిగా ఈ కొత్త వైరస్ 50 మిలియన్ల మంది ప్రాణాలని తీసేస్తుందని అంచనా వేస్తున్నారు. మన కంటికి కనిపించకపోయినా అనేక రకాల వైరస్ లు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ తిరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మానవులకు ముప్పు కలిగించవు. కానీ కొన్ని మహమ్మారిని ప్రేరేపించే వేలాది రకాల వైరస్ లు పరిణామం చెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త మహమ్మారి..?

ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 25 రకాల వైరస్ కుటుంబాల గురించి తెలుసుకున్నారు. వాటిలో ప్రతి ఒక్కటి వందలు లేదా వేల మ్యూటేషన్ ని కలిగి ఉన్నాయి. వీటిలో ఏదైనా కూడా మహమ్మారిని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మందిని చంపింది. అదృష్టవశాత్తు వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకోగలిగారు. ఎబోలా మరణాల రేటు 67 శాతంగా ఉంది. తర్వాత బర్డ్ ఫ్లూ 60 శాతం వచ్చింది. మెర్స్ కూడా 34 శాతం వరకి ప్రజలకి సోకింది. అందుకే కొత్తగా వచ్చే తదుపరి మహమ్మారి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు తెలిపారు. అయితే డబ్యూహెచ్ఓ కి చెందిన నిపుణులు మెక్ కాలీ మాట్లాడుతూ తదుపరి మహమ్మారికి కారణమయ్యేది భయంకరమైన స్పానిష్ ఫ్లూ లాంటిది కావచ్చని హెచ్చరించారు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి శాస్త్రవేత్తలు తదుపరి మహమ్మారికీ కారణమయ్యే ఇతర ప్రమాదకరమైన వైరస్ కోసం శోధిస్తున్నారు. ఇది స్పానిష్ ఫ్లూ మాదిరిగా కేసుల పెరుగుదల, మరణాల సంఖ్య ఉండవచ్చని భావిస్తున్నారు.

అసలు ఏంటి ఈ స్పానిష్ ఫ్లూ?

స్పానిష్ ఫ్లూ అనేది 1918 లో వచ్చింది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి సోకింది. పక్షుల నుంచి వచ్చిందని అంటారు. 1918 నుంచి 1919 వరకు 50 మిలియన్ల  మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఈ వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళే సంఖ్య రెండు రేట్లు ఎక్కువ. అడవి, పెంపుడు పక్షుల నుంచి ఉద్భవించిందని కొందరు వాదిస్తారు. మరికొందరు పందుల నుంచి వచ్చిందని చెప్తారు. చైనా, ఫ్రాన్స్, యూఎస్, బ్రిటన్ సహ అన్నీ ప్రాంతాలని ఇది కబళించింది.

కరోనా వైరస్ మాదిరిగా కాకుండా స్పానిష్ ఫ్లూ యువతలో ముఖ్యంగా ఐదు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో, 20-40 సంవత్సరాల వయసు వారికి సోకింది. ఇది అత్యంత శక్తివంతమైనది. వ్యాధి లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపే ఆరోగ్యంగా ఉన్న రోగి ప్రాణాలు కూడా తీసేస్తుంది. న్యుమోనియా, శరీరం మీద బొబ్బలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోతుంది. 

నివారణ లేదా?

ఇందుకు తగిన నివారణ మన చేతుల్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ బయటకి వెళ్లొచ్చిన ప్రతి సారి ముక్కు, కళ్ళు, నోరు తాకకుండా చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Published at : 25 Sep 2023 04:15 PM (IST) Tags: new virus Covid Corona Virus Spanish Flu Spanish Flu Symptoms

ఇవి కూడా చూడండి

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

Plum Pudding Recipe : పిల్లలకు నచ్చే ప్లమ్ పుడ్డింగ్.. ఇంట్లోనే సింపుల్​గా ఇలా చేసేయండి

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

Earwax : చెవిలో గులిమిని క్లీన్ చేయకపోతే ప్రమాదమా? మీరు ఇలా చేస్తుంటే జాగ్రత్త!

No sugar Vegetarian meals : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

No sugar Vegetarian meals : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త

Anti-Ageing Superfood : నిత్య యవ్వనం కావాలా? ఈ ఆహారాన్ని ఫుడ్‌లో చేర్చండి, ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు!

Anti-Ageing Superfood : నిత్య యవ్వనం కావాలా? ఈ ఆహారాన్ని ఫుడ్‌లో చేర్చండి, ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు!

టాప్ స్టోరీస్

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
×