By: ABP Desam | Updated at : 21 Mar 2022 04:10 PM (IST)
Edited By: harithac
(Image credit: spiceupthecurry.com)
సగ్గుబియ్యం కొనేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. వాటితో ఏం చేసుకోవాలో తెలియకే సగం మంది వాటిని కొనడం తగ్గించుకున్నారు. నిజానికి సగ్గుబియ్యంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. అలాంటి వంటకమే సగ్గుబియ్యం దోశెలు. పిల్లలు,పెద్దలు ఇద్దరికీ నచ్చే వంటకం ఇది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇది పిల్లలకు బాక్సుల్లో కూడా పెట్టొచ్చు. మిగతా దోశెలతో పోలిస్తే సగ్గుబియ్యంతో చేసే దోశెలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యం కూడా. అందులోనూ సగ్గుబియ్యం శరీరానికి ఎంతో చలువ చేస్తాయి. కాబట్టి వేసవిలో సగ్గుబియ్యంతో చేసే వంటకాలు అధికంగా వండుకుని తినాలి.
సగ్గుబియ్యంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ సగ్గుబియ్యంలో పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడే ఎలక్ట్రోలైట్స్ ఇందులో ఉన్నాయి. వ్యాయామం చేశాక సగ్గుబియ్యంతో చేసిన జావను తాగితే చాలా మంచిది. వెంటనే శక్తి అంది అలసట తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా అవసరం. పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ, విరేచనాలు వంటివి ఇట్టే తగ్గుతాయి.
సగ్గుబియ్యం దోశెలు
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
బొంబాయి రవ్వ - అరకప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పెరుగు - మూడు టీస్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - రెండ స్పూనులు
జీలకర్ర - అర టీస్పూను
కరివేపాకు తరుగు - రెండు స్పూనులు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. సగ్గుబియ్యాన్ని బాగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టాలి.
2. నానిన సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
3. సగ్గుబియ్యం రుబ్బులో బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి.
4. పెరుగు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే నీళ్లు కలుపుకోవచ్చు. ఒక 20 నిమిషాలు పక్కన వదిలేయాలి.
5. మళ్లీ ఆ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలపాలి. అందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఉల్లి తరుగు, జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి.
6. పిండి మరీ గట్టిగా ఉంటే నీళ్లు కలిపి పలుచటి దోశెలు వేసేలా రెడీ చేసుకోవాలి.
7. పెనంపై సన్నని దోశెలు వేసుకోవాలి. చిన్న మంటపైనే దోశెలు వేయాలి.
8. ఈ దోశెలను కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.
Also read: ఘుమఘుమలాడే కసూరీ మేతీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Also read: మధుమేహుల కోసం కాకరకాయ పొడి, రుచికి రుచి ఎంతో ఆరోగ్యం
Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు
GT vs RCB: అడకత్తెరలో ఆర్సీబీ! GTపై గెలిచినా దిల్లీ ఓడాలని ప్రార్థించక తప్పదు!
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!