Ukraine Women Dating: రణరంగంలో రొమాన్స్, ఉక్రెయిన్ మహిళలకు రష్యా జవాన్లు వింత రిక్వెస్టులు, ఇదిగో ఇలా..
రష్యా సైనికులు కేవలం యుద్ధం మాత్రమే చేయడం లేదు. ఉక్రేయిన్‌లో ఉన్న మహిళలతో శరీరక సంబంధాలు పెట్టుకోడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఉక్రేయిన్ మహిళల సమాధానం ఇదే.
Ukraine Women Dating | ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రష్యాను ఎదిరించి, ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు ఏ దేశం ముందుకు రావడం లేదు. దీంతో ఆ దేశం ఒంటరిగానే పోరాడుతోంది. దీనిపై ప్రపంచ దేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా.. ప్రజలు మాత్రం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. రష్యా దురాక్రమణ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పుతున్నారని, ఇకనైనా యుద్ధం ఆపాలని కోరుతున్నారు. ఇప్పుడు రష్యా బలగాలు ఉక్రేయిన్ రాజధాని కీవ్(Kyiv)ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ ఉక్రేయిన్‌లోని మెలిటోపోల్ (Melitopol) నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఎట్టి పరిస్థితిలో దేశాన్ని వదిలి పారిపోయేది లేదని, చివరికి వరకు పోరాడతామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రష్యా సైనికులు యుద్ధంలో ఉంటూనే తమ ఒత్తిడిని దూరం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉక్రేయిన్‌లోకి ప్రవేశించిన జవాన్లలో కొందరు స్థానిక మహిళలతో శరీరక సంబంధాలు పెట్టుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉక్రేయిన్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు స్థానికంగా ఉన్న మహిళలతో రొమాన్స్ కోసం ‘టిండర్’ డేటింగ్ యాప్ ద్వారా రిక్వెస్టులు పంపుతున్నారు. తమతో రొమాన్స్ చేయడానికి సిద్ధమేనా అంటూ మెసేజులు పంపుతున్నారు. అయితే, ఉక్రేయిన్ మహిళలు ఇందుకు ధీటుగా స్పందిస్తున్నారు. ‘The Sun’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఉక్రేయిన్‌లోని కీవ్ నగరంలో నివసిస్తున్న దశ సైనెల్నికోవా అనే 33 ఏళ్ల మహిళకు టిండర్ ద్వారా రష్యా సైనికుల నుంచి డేటింగ్ రిక్వెస్టులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కీవ్ నుంచి వెళ్లిపోయి తూర్పు ఉక్రేయిన్‌లో తలదాచుకుంటోంది.
ఉక్రేయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సైనికులు తమ ఫొటోలను పోస్ట్ చేసి డేటింగ్ కోసం రిక్వెస్ట్ చేస్తు్న్నారని ఆమె తెలిపింది. ‘‘కండలు తిరిగిన ఓ సైనికుడు బెడ్ మీద పడుకుని పిస్తోల్ పట్టుకుని పోజిలిస్తున్న ఫొటోను పంపాడు. మరొకరు పూర్తిగా రష్యా సైనికుడి దుస్తుల్లో ఉన్న ఫొటోను పెట్టాడు. మరికొందరు లో దుస్తులతో ఉన్న ఫొటోలను పెడుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో రష్యా సైనికుల ఫొటోలు టిండర్ ద్వారా వస్తున్నాయి. అయితే, వారు అంత ఆకట్టుకొనేలా లేరు. శత్రువులతో పడుకొనే ఆలోచన నాకు లేదు. అందుకే, ఆ రిక్వెస్టులను తిరస్కరిస్తున్నా. అయితే, వారు నాతో మాట్లాడేందుకు మెసేజులు చేస్తున్నారు. కానీ, నేను పట్టించుకోవడం లేదు’’ అని తెలిపింది. అయితే, ఈమెకు మాత్రమే కాదు, ఉక్రేయిన్‌లోని టిండర్ యాప్ వినియోగిస్తున్న అమ్మాయిలందరికీ రష్యా సైన్యం నుంచి ఈ రిక్వెస్టులు అందుతున్నాయట. అయితే, ప్రతి ఒక్కరి నుంచి ఒకే జవాబు.. ‘‘మేం శత్రువులతో పడుకోం’’.
Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?