Heart Attack: వ్యాయామం చేసినా, ఫిట్‌గా ఉన్నా గుండె నొప్పి వస్తుందా? ఇండియాలోనే టాప్ సర్జన్ ఏం చెప్పారో చూడండి
ఫిట్‌గా ఉన్నా గుండె నొప్పి వస్తుందా? ఇండియాలోనే టాప్ సర్జన్ ఏం చెప్పారో చూడండి
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కుప్పకూలిన సంగతి తెలిసిందే. హాస్పిటల్‌కు వెళ్లేలోపే పున్నీత్ కన్నుమూశారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె నొప్పి వల్లే చనిపోయానరి నిర్ధరించారు. అదేంటీ? ఆయనకు కేవలం 46 ఏళ్లు మాత్రమే. గతంలో కూడా ఆయనకు ఎలాంటి గుండె సమస్యలు లేవు. పైగా నిత్యం వ్యాయమం, డ్యాన్సులు చేస్తూ తనని తాను ఫిట్‌గా ఉంచుకోడానికి పరితపించే పునీత్ చనిపోవడం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. కేవలం పునీత్ మాత్రమే కాదు.. ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా(42), కన్నడ నటుడు చిరంజీవి సర్జా(36) కూడా గుండోపోటుతోనే చనిపోయారు. ఎప్పుడో వయస్సు మీరిన తర్వాత వచ్చే గుండెపోటు యుక్తవయస్సులోనే ఎందుకు వస్తుందని ప్రశ్నలు చాలామంది లేవనెత్తారు. అలాగే.. జిమ్‌లో అతిగా వ్యాయమం చేయడం వల్ల కూడా గుండె నొప్పి వస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆసియా హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత్ పాండా ఇలా చెప్పారు.
రమాకాంత్ పాండా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘20-25 ఏళ్ల క్రితం.. 6 నెలలకు ఒకసారి 30 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు గుండెపోటుకు గురయ్యేవారు. ఇటీవల ప్రతి వారానికి ఒక గుండెపోటు కేసు నమోదవుతోంది’’ అని తెలిపారు. వ్యాయమం చేయడం వల్ల మంచితోపాటు చెడు ప్రభావాలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. అయితే, అది ఆ వ్యక్తి వ్యాయమం చేసే తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు.
Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?
వ్యాయామ సమయంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే:
రమకాంత తెలిపిన వివరాలు ప్రకారం.. శరీరానికి మితమైన వ్యాయమమే మేలు చేస్తుంది. పూర్తిగా వ్యాయమం చేయకపోవడం కూడా ప్రమాదమేనని తెలిపారు. అలాగే అతిగా వ్యాయమం చేయడం వల్ల కలిగే శారీరక శ్రమ.. ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. అది గుండెపోటుకు దారితీయవచ్చని తెలిపారు. కాబట్టి.. మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా వ్యాయామం చేయాలన్నారు.
❤ వ్యాయామానికి ముందు 5 నుంచి10 నిమిషాలు వార్మప్ చేయాలి.
❤ 20-30 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేయాలి.
❤ శరీరం సాధారణ స్థితికి చేరడానికి 5-10 నిమిషాలు విశ్రాంతి నివ్వాలి.
❤ ఛాతికి ఎడమ వైపున నొప్పి వచ్చినా, కీళ్లలో నొప్పులు వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు.
❤ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి