News
News
X

Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు

ఇప్పటి రెస్టారెంట్ లో ఫుడ్ తక్కువ బిల్లు ఎక్కువ. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ బరువు ఆధారంగా మాత్రమే బిల్లు వేస్తారండోయ్.

FOLLOW US: 
Share:

ప్రపంచంలో కేవలం మాంసాహారాన్ని ఇష్టపడేవారే కాదు.. శాఖాహారాన్ని కూడా బాగా ఇష్టపడే ఆహార ప్రియులు ఎక్కువ మందే ఉన్నారు. అయితే, కేవలం శాఖాహారుల కోసమే ఏర్పాటు చేసే రెస్టారెంట్లు ఎక్కువ కాలం నడుస్తాయనే గ్యారంటీ లేదు. కానీ, ఓ శాఖాహార రెస్టారెంట్ మాత్రం శతాబ్దాలుగా నడుస్తూనే ఉంది. ప్రపంచంలోనే పురాతన శాఖాహార రెస్టారెంట్‌గా పేరుగాంచింది. ప్రకృతి అందాలకు నెలవైన స్విట్జర్లాండ్ లో ఇది ఉంది. హౌస్ హిల్ట్ రెస్టారెంట్ గా ఇది ప్రసిద్ధి గాంచింది. అత్యధిక కాలం పాటు శాఖాహార వంటకాలను అందించినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా నమోదు చేసుకుంది.

ఎలా ప్రారంభించారు?

మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడే స్విట్జర్లాండ్ లో శాఖాహార రెస్టారెంట్ అంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని వెనుక ఒక ఆసక్తి కరమైన కథ ఉంది. 1890వ సంవత్సరంలో జ్యూరిచ్ నగరంలో హిల్ట్ కుటుంబం నివసించేది. ఆయన చాలా సంపన్నుడు. ఆ కుటుంబానికి అధిపతైన అంబ్రోసియస్ హిల్ట్ కీళ్లనొప్పులతో బాధపడుతూ ఉండేవాడు. ఆ టైమ్ లో ఆర్థరైటిస్ సమస్య తగ్గించేందుకు సరైన మందులు అందుబాటులో లేవు. నొప్పులు తట్టుకోలేక అతను ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపాడు. అక్కడ మాక్సిమిలియన్ బర్చర్ బ్యానర్ అనే వైద్యుడిని కలిశాడు. ఆయన మాంసాహారం మానేయడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చాడట. దీంతో హిల్ట్ ఆయన సలహా పాటించాడు. అలా అక్కడ శాఖాహారం అలవాటు అయ్యిందని చెప్తారు.

ఆ నగరంలో వెజిటేరియన్ కేఫ్ ఒకటి మాత్రమే ఉండేది. దానిలో కొన్ని శాఖాహార పదార్థాలు అందుబాటులో ఉండేవి. అంబ్రోసియస్ ఆ రెస్టారెంట్ కొనుగోలు చేసి పూర్తిగా మార్చేశాడు. శాఖాహారం తీసుకోవడం వల్ల అతని నొప్పులు కూడా తగ్గిపోయాయి.

మాంసం మానేయడం అంత సులభమేమి కాదు

ఒకసారి మాంసాహారానికి అలవాటు పడిన వాళ్ళు శాఖాహారులుగా మారడం అంటే అంత సులభమేమి కాదు. మాంసం తప్ప వేరే ప్రత్యామ్నాయాలు అక్కడ లభించవు. దీంతో అంబ్రోసియస్ తన ఆలోచనలతో ఉన్న ఆహార పదార్థాలతోనే ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అనేక రెస్టారెంట్లు తిరిగి వంటలు రుచి చూశాడు. తర్వాత తను రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. అయితే, చాలామంది మాంసాహారం వదిలి శాఖాహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టం చూపించేవారు కాదు. దీంతో రెస్టారెంట్ లో వండిన పదార్థాలు పడేసే పరిస్థితికి వచ్చింది. కానీ హిల్ట్ మాత్రం ఆ రెస్టారెంట్ మూయలేదు. ఆహార ప్రియులకు తన రెస్టారెంట్‌లోని శాఖాహార వంటకాల రుచిని చూపించాడు. శాఖాహారానికి అలవాటుపడేలా చేశాడు. చివరికి తన హోటల్‌ను శాఖాహారానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నాడు. అలా ఏళ్లతరబడి ఆ రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహించాడు. ఫలితంగా 2012, జూన్ 28న ప్రపంచంలోని అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ గా గిన్నిస్  వరల్డ్ రికార్స్ కి ఎక్కింది.

మొత్తం శాఖాహార వంటలే

భారతదేశానికి వచ్చి ఇక్కడ నుంచి ఎన్నో వస్తువులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఇక్కడి ప్లేట్లు కూడా కొనుక్కుని వెళ్లారు. అందుకే జ్యూరిచ్ లోని ఈ రెస్టారెంట్ లో మీకు భారతీయులు భోజనం చేసే ప్లేట్స్ కనిపిస్తాయి. దక్షిణ భారతీయ వంటకాలతో పాటు ఉత్తర భారతీయ థాలీ కూడా లభిస్తుంది. ఈ రెస్టారెంట్ ‘Greentopf' అనే పేరుతో ఒక వంటల పుస్తకాన్ని కూడా ప్రచురించింది. దీన్లో కొన్ని లక్షల శాఖాహార వంటకాలు ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకోవచ్చు కూడ.

ఆహారం ఎంత బరువుంటే.. అంత రేటు

ఈ రెస్టారెంట్ కి ఉన్న మరొక ప్రత్యేకత లైబ్రరీ కూడా ఉంది. శాఖాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అనేక పుస్తకాలు అక్కడ మీకు దర్శనమిస్తాయి. మరొక విశేషం ఏమిటంటే బరువు ఆధారంగా ఇక్కడ ఆహారం తీసుకోవచ్చు. మీరు ఎంత ఆహారం తిన్నారో దాని బరువు ప్రకారం చెల్లించవచ్చు. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే దాని బరువు ఎంత ఉంటుందో అంతే  చెల్లించవచ్చు. రాజ్మా చావల్ ఆర్డర్ చేసిన ఇస్తారు. ఇది ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో అత్యంత పురాతన రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది. ఎంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం

Published at : 08 Feb 2023 03:29 PM (IST) Tags: Switzerland World’s Oldest Vegetarian Restaurant Famous Restaurant

సంబంధిత కథనాలు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్‌- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

టాప్ స్టోరీస్

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ -  కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్ 

Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్ 

LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!

LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు