Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
పిల్లలు సంతోషంగా ఉండాలంటే వారితో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలి. లేకపోతే వారిలో ఇలాంటి మార్పులు వస్తాయి.
పిల్లల్ని పెంచడం అంటే మాటలు కాదు. ప్రస్తుత రోజుల్లో భార్య, భర్త ఉద్యోగాలకు వెళ్తు పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల మీద తల్లిదండ్రుల శ్రద్ధ తగ్గిపోతుంది. దాని వల్ల ఆ పసి మనసులు ప్రేమ, ఆప్యాయత కోసం ఆరాటపడుతున్నారు. అది తల్లిదండ్రులు గమనించాలి. లేదంటే వాళ్ళు బయట చూపించే ప్రేమకు ఆకర్షితులై తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దాని వల్ల వాళ్ళు జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మీ పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు వాళ్ళకి దగ్గర అవడం కోసం పనులు చేస్తూ ఉంటారు. అరవడం, ప్రతి చిన్నదాని కోసం మీ దగ్గరకి రావడం వంటివి చేస్తున్నారంటే వాళ్ళు మీ ప్రేమని పొందటం కోసం ఆరాటపడుతున్నారని అర్థం చేసుకోవాలి.
మిమ్మల్ని అతుక్కుని ఉండటం
ఎప్పుడూ మీ పిల్లలు మిమ్మల్ని విడిచిపెట్టకుండా అతుక్కుని ఉంటే మీ నుంచి ప్రేమని ఆశిస్తున్నారని అర్థం. మీరు చేసిన పనులు వాళ్ళు చేయడం, మిమ్మల్ని అనుకరించడం చేస్తారు. మీ వెనుకాలే తిరుగుతూ ఉంటారు. అందుకు కారణాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుని వారిని దగ్గరకి తీసుకోవాలి.
కోపం చూపిస్తారు
కొన్ని సార్లు పిల్లలు అతిగా కోపం ప్రదర్తిస్తారు. కారణం లేకుండానే చిరాకుగా ఉండటం శ్రద్ధ లేకుండా పనులు చేయడం చేస్తారు. అరవడం, కేకలు వేయడం, ఏడవటం వంటివి చేస్తారు. అన్నం తినకుండా మారాం చేయడం వంటివి మీ ప్రేమ కోసం వాళ్ళు వ్యక్తపరిచే సంకేతాలు. మీ పిల్లలు కూడా ఇలా చేస్తుంటే వాళ్ళు మీ దగ్గర నుంచి మరింత ప్రేమని కోరుకుంటున్నారని తెలుసుకోండి.
దూకుడు ప్రవర్తన
తల్లిదండ్రుల అటెన్షన్ కోసం పిల్లలు దూకుడుగా వ్యవహరిస్తారు. బొమ్మలు విసిరేయడం, కొట్టడం, తమని తాము గాయపరుచుకోవడం, ఇతరులను ప్రమాదంలో పడే పనులు చేయడం వంటివి చేస్తారు. ఇది తల్లిదండ్రుల దృష్టిని తక్షణమే ఆకర్షించేందుకు పిల్లలు చేసే పనులు.
అవసరం లేకపోయిన సహాయం అడగటం
సొంతంగా పనులు చేసుకోగలిగినా కూడా పిల్లలు చిన్న చిన్న వాటికి కూడా తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు. ప్రతి అవసరం తీర్చమని మీ దగ్గరకి వస్తారు. ఇలా చేస్తున్నారంటే మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారాని అర్థం. మీ దృష్టిని ఆకర్షించడం కోసం ఇదొక వ్యూహం మాత్రమే.
పనులు నెమ్మదిగా చేయడం
పిల్లలు చిన్నవాళ్ళు అమాయకులు అని అనుకుంటారు. కానీ వాళ్ళు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. తల్లిదండ్రులని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం ఎంతో ఈజిగా ఉండే పనులు కూడా నెమ్మదిగా చేస్తారు. అలా చేస్తే పేరెంట్స్ వచ్చి సహాయం చేస్తారని వారి ఆలోచన. మరికొన్ని సార్లు ఇంట్లో పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తామని వస్తారు. అది పని నేర్చుకోవడం కోసం కాదు అలా తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించొచ్చు అని పిల్లల ప్లాన్. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వారితో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: జుట్టు రాలుతోందా, చుండ్రు వేధిస్తోందా? జస్ట్, ఈ టిప్స్ పాటిస్తే చాలు, అన్నీ మాయం!