అన్వేషించండి

Spong Dosa : మీకు దోశలు మెత్తగా ఉంటే ఇష్టమా? అయితే టేస్టీ, సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి

South Indian Breakfast : దోశలు కొందరికి కరకరలాడితే ఇష్టం. మరికొందరికి మెత్తగా ఉంటే ఇష్టం. మీకు కూడా మెత్తని దోశలు అంటే ఇష్టమైతే.. ఈ టేస్టీ రెసిపీని ఫాలో అయిపోండి.

Tasty Dosa Recipe : దోశలను ఎలా చేసుకున్నా బాగుంటాయి. అందుకే వివిధ రకాల దోశలు మనకి అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని టేస్ట్​లు మాత్రం చాలా యూనిక్​గా మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. అలాంటి వాటిలో మెత్తని దోశలు కూడా ఒకటి. కొందరు దోశలు కరకరలాడితే బాగుంటుంది అనుకుంటారు. మరికొందరు మెత్తగా తింటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి మెత్తటి దోశలను ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఏ టిప్స్​ని ఫాలో అయితే రుచి మరింత బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

సగ్గు బియ్యం - 1 కప్పు 

బియ్యం - రెండు కప్పులు

పెరుగు - పావు కప్పు

బేకింగ్ సోడా - పావు టీస్పూన్ 

ఉప్పు - రుచికి తగినంత

పచ్చిమిర్చి - 2

అల్లం - అర అంగుళం

నూనె - దోశలు వేసుకునేందుకు 

తయారీ విధానం

ఉదయాన్నే తినాలనుకుంటే ముందురోజు రాత్రి.. నైట్ తినాలనుకుంటే ఓ మూడు గంటల ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా బాగా కడిగి వేరుగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని.. మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. దానిలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఎంత మిక్సీ చేసినా.. సగ్గుబియ్యంలో కొంత గరుకు ఉండిపోతుంది. 

ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్​ తీసుకుని.. దానిపై జల్లెడ లేదా పెద్ద టీ గరిట పెట్టి మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం పిండిని వేసి గరిటతో తిప్పాలి. ఇలా చేయడం వల్ల గరుకు పైన ఉండిపోతుంది. మెత్తని పిండి బౌల్​లోకి వెళ్లిపోతుంది. ఇలా తీసుకున్న పిండిలో పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిక్సీ జార్​లోకి బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని మెత్తని పేస్ట్​గా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిక్సింగ్​ బౌల్​లో ఈ బియ్యం పిండిని వేయాలి. 

బియ్యం పిండి, సగ్గుబియ్యం పిండిని బాగా మిక్స్ చేయాలి. దానిలో ఉప్పు, బేకింగ్ సోడా కూడా వేసుకుని.. అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఓ పదినిమిషాలు పక్కన పెట్టాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల పిండి కాస్త పొంగుతుంది. అందుకే దానిని మరోసారి కలుపుకోవాలి. ఈ బ్యాటర్ దోశలు వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్​ పెట్టాలి. 

తయారు చేసుకున్న పిండిని దోశలుగా వేసుకోవాలి. బాగా పలుచగా చేయకూడదు. చుట్టూ అంచుల, మధ్యలో కాస్త నూనె వేసి.. ఉడకనివ్వాలి. సగ్గుబియ్యంతో చేశాము కాబట్టి ఈ దోశ తయారవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కాస్త నిదానంగా దోశలు వేసుకోవాలి. ఒకవైపు దోశ ఉడికిన తర్వాత.. మరోవైపు తిప్పి దోశను కాల్చుకోవాలి. రెండువైపులా దోశ ఉడికితే తినడానికి సిద్ధం. ఇవి మెత్తగా నోటికి చాలా రుచిగా ఉంటాయి. వీటిని పల్లీ చట్నీతో తీసుకుంటే ఆ రుచిని వర్ణించడం కష్టమే. అంత అద్భుతంగా ఉంటాయి.

Also Read : క్రిస్పీ పెసర పునుగులు.. చాలా సింపుల్​గా ఈవెనింగ్ స్నాక్స్​ని చేసేయండిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget