అన్వేషించండి

Tasty Recipes: వంట చేసుకోవడానికి బద్ధకిస్తున్నారా? ఈ సింపుల్ టేస్టీ రెసిపీలు మీకోసమే

మీరు ఎక్కువగా శ్రమ పడకుండా సింపుల్ గా అయిపోయే టేస్టీ వంటకాలు ఇవి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.

ఆలస్యంగా, బద్ధకంగా నిద్రలేచే వారికి వంట చేసుకోవడం అంటే మహా చిరాకు. బెడ్ మీద గంటలు నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఆకలిగా అనిపిస్తే ఆన్ లైన్ లో ఎలాగూ స్విగ్గీ, జోమాటో ఉండనే ఉన్నాయి. వాటిలో ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ చేసేసుకుని లాగించేస్తారు. పొట్ట నింపుకుంటారు. మరి ఆరోగ్యం మాట ఏంటి? అవి మీ ఆరోగ్యాన్ని మొత్తంగా పాడు చేస్తాయి. అందుకే మీకు కష్టం లేకుండా సింపుల్ గా ఉండే ఈ రెసిపీలు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. కేవలం కొద్ది నిమిషాల్లోనే రుచికరమైన ఆహారం రెడీ అయిపోతుంది.

గుడ్లు

గుడ్లు గిలకొట్టేసుకుని హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లేదా చికెన్ సాసేజ్, రోటీతో జత చేసుకుని తినొచ్చు. హాఫ్ బాయిల్ మీద కాస్త ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లుకుని తింటే రుచి అదిరిపోతుంది.

రెసిపీ విధానం

ఒక గిన్నె తీసుకుని రెండు గుడ్లు పగలగొట్టి పాలు(ఆప్షనల్) జోడించుకుని బాగా గిలకొట్టాలి. అందులో కొద్దిగా మిరియాలు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మీకు ఇష్టం అనిపిస్తే టొమాటో, బెల్ పెప్పర్స్, బచ్చలికూర, క్యారెట్లు వంటివి రంగురంగుల కూరగాయలు జోడించుకోవచ్చు.

లెమన్ రైస్

దక్షిణ భారతీయ భాషలో చిత్రాన్నం అని పిలుస్తారు. దక్షిణ భారతీయ వంటకాలలో ఎంతోమందికి ఇష్టమైన ఫుడ్ ఇది. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులభం.

రెసిపీ

ఒక కప్పు బియ్యం రెండు సార్లు కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. కాస్త ఉప్పు వేసుకుని అన్నం వండుకోవాలి. మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసి ఒక టీ స్పూన్ పచ్చిపప్పు, పల్లీలు, మినపప్పు, ఆవాలు వేసుకుని గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అందులో కొన్ని కరివేపాకు, తరిగిన పచ్చి మిర్చి, 2 ఎండు మిరపకాయలు వేసుకోవాలి. కలర్ మారే వరకు మీడియం మంట మీద వేయించుకోవాలి. చివర్లో అర టీ స్పూన్ పసుపు పొడి, ఒక చిటికెడు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండుకోవాలి. ఈ మిశ్రమంలో అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది.

రవ్వ అప్పం

రవ్వతో ఉప్మా చేసుకుని తినాలంటే చాలా కష్టం. ఎవరికీ అది అంతగా ఇష్టం ఉండడు. కానీ దీనితో అప్పం చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది. లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది.

రెసిపీ

ఒక గిన్నెలో అర కప్పు బొంబాయి రవ్వ 2 కప్పుల పెరుగు కలుపుకోవాలి. క్యారెట్లు, క్యాప్సికమ్, పచ్చి మిర్చి, బీన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పావు కప్పు నీటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మూతపెట్టి 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక స్పూన్ నూనె వేడి చేసి అందులో ¼ టీ స్పూన్ ఆవాలు, 4-5 కరివేపాకులు వేసుకుని వేయించినవి పిండిలో కలుపుకోవాలి. పాన్ తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. దాని మీద అప్పం మాదిరిగా పిండి వేసుకోవాలి. క్యారెట్లు, పచ్చి బఠానీ వేసి గార్నిష్ చేసుకోవచ్చు. తక్కువ మంట మీద గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే రుచికరమైన అప్పం రెడీ అయిపోతుంది. కొత్తిమీర, కొబ్బరి చట్నీ, టొమాటో సాస్ తో వేడి వేడిగా లాగించేయొచ్చు.

సబుదానా ఖిచ్డీ

సగ్గుబియ్యంతో రుచికరమైన కిచిడీ చేసుకోవచ్చు. నవరాత్రి ఉపవాస కాలంలో ఈ శాఖాహార వంటకం ఎక్కువగా తీసుకుంటారు. గ్లూటెన్ రహితం.

రెసిపీ

1 కప్పు సగ్గు బియ్యం రెండు సార్లు బాగా కడిగి ¾ కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. 1/2 కప్పు వేరుశెనగలని వేయించి చల్లార్చిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. నానబెట్టిన సగ్గుబియ్యంలో ఒక టీ స్పూన్ పంచదార, ¾ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. పెద్ద బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 1 అంగుళం అల్లం ముక్క, 2 మిరపకాయలు, 1 బంగాళాదుంప వేసుకుని వేయించుకోవాలి.సగ్గుబియ్యం, వేరుశెనగ పొడి కలుపుకుని అందులో ఈ తాలింపు వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ½ టీ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకుని తినేయడమే.

చికెన్ సలాడ్

లీన్ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభించే భోజనం ఇది. సింపుల్ గా చేసుకునే ఈ చికెన్ సలాడ్ అల్పాహారంతో పాటు లంచ్ లేదా డిన్నర్ కు కూడా బాగుంటుంది.

రెసిపీ

చికెన్ బ్రెస్ట్ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, తేనె, మిరియాలు, ఉప్పు వేసి బాగా కాలూకవ్వాలి. 10 నిమిషాల పాటు మ్యారినేట్ అవడం కోసం పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడి చేసుకుని చికెన్ మిశ్రమం వేసి ఉడికించుకోవాలి. అందులో కాస్త కలర్ ఫుల్ గా ఉండేందుకు పెప్పర్, టొమాటో, దోసకాయ, ఉల్లిపాయ, పాలకూర, ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సలాడ్ మీద కొత్తిమీర ఆకులు, వైట్ వెనిగర్, ఉప్పు చల్లుకుని తింటే అదిరిపోతుంది.   

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మహిళలను స్ట్రాంగ్‌గా ఉంచే ప్రోటీన్ పొడి - ఉత్తమైనవి ఎలా ఎంచుకోవాలంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget