Psoriasis : చర్మంపై ఎర్రటి పొలుసులా? సోరియాసిస్ లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
Psoriasis Causes : సోరియాసిస్ అనేది ఓ చర్మ వ్యాధి. ఇది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వస్తుంది. చర్మంపై ఎర్రటి పొలుసులు ఏర్పడతాయి. మరి దీనిని ఎలా నివారించాలో చూసేద్దాం.

Psoriasis Prevention Tips : సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించిన ఒక వ్యాధి. ఈ వ్యాధి మన చర్మంపై ఎర్రటి, పొలుసులుగా మారే పొరను ఏర్పరుస్తుంది. ఇది శరీరంలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల వచ్చే తీవ్రమైన చర్మ సమస్యగా చెప్తారు. ఈ వ్యాధి వస్తే మన శరీరంలోని చర్మ కణాలు అసాధారణంగా పెరిగి.. చర్మంపై ఎర్రటి పొలుసులుగా మారతాయి. దీనివల్ల బాధిత రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ వ్యాధి శరీరంలో ఎక్కడెక్కడ ప్రభావితం చేస్తుందో.. ఆ భాగాలలో దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తీవ్రమైన చర్మ వ్యాధి నుంచి బయటపడటానికి సమర్థవంతమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోరయాసిస్ ఎందుకు వస్తుంది?
సోరయాసిస్ అనేది చర్మ వ్యాధి. దీనిని సాధారణంగా చర్మ వ్యాధి అని కూడా అంటారు. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధికి ప్రధాన కారణం మన కణాలు చర్మంలో అసాధారణంగా పెరగడమే. చర్మ కణాలు ఏర్పడటానికి, రాలిపోవడానికి సుమారు ఒక నెల సమయం పడుతుంది. కానీ మన చర్మానికి సోరయాసిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు.. కణాలు వేగంగా పెరిగి, చర్మం పైపొరపై పేరుకుపోయి పొలుసులుగా మారతాయి.
ఈ వ్యాధి తల, మోకాళ్లు, మోచేతులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి కారణమయ్యే అంశాల నుంచి తమను తాము రక్షించుకుంటే.. ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశించదట. ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేనప్పటికీ.. చర్మంపై వ్యాధి చేసే ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. మీకు కూడా ఈ వ్యాధి ఉంటే కొన్ని సులభమైన మార్గాల ద్వారా దీనిని నివారించవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం.
సోరయాసిస్ నుంచి బయటపడే మార్గాలు
- సోరయాసిస్ రావడానికి అతి పెద్ద కారణం మన శరీరంలోని రోగనిరోధక శక్తి (ఇమ్యూన్ సిస్టమ్) బలహీనపడటం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి.. సోరయాసిస్తో బాధపడుతున్నవారు తప్పనిసరిగా ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. బ్రోకలీ, క్యాబేజీ వంటి కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
- సోరయాసిస్తో బాధపడుతున్నవారు ప్రతిరోజూ వ్యాయామం, యోగాను తమ దినచర్యలో చేర్చుకోవాలి. దీనివల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
- పసుపు సోరయాసిస్ రోగులకు ఒక అద్భుతమైన సహజ ఔషధం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే ఔషధ గుణం శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. సోరియాసిస్ ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ అసాధారణంగా చురుకుగా ఉంటుంది. దీనిని శాంతపరచడంలో పసుపు సహాయపడుతుంది.
వీటితో పాటు రెగ్యులర్గా వైద్యుని సూచనలు తీసుకోవాలి. ఇవి సొరియాస్ ఎక్కువ కాకుండా.. మరింత సోకకుండా.. చర్మంపై వాటి ప్రభావం తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















