Optical Illusion: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఆసక్తి ఉందా? అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే.
Optical Illusion: కళ్లకు, మెదడుకు పెట్టే చిన్న పరీక్ష ‘ఆప్టికల్ ఇల్యూషన్’. ఇవి కాసేపు కాలక్షేపంలా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ కూడా అలాంటిదే. ఇందులో మీకు ఇద్దరు అమ్మాయిలు ముచ్చట్లాడుతూ కనిపిస్తున్నారు. అలాగే ఓ అమ్మాయి పక్కన ఒక శునకం కూడా ఉంది. అయితే ఈ బొమ్మలో రెండు శునకాలు ఉన్నాయి. ఒకటి ఎలాగూ కనిపిస్తోంది, ఇక రెండోది ఎక్కడుందో వెతికి పట్టుకోండి. కాసేపు చిత్రాన్ని తీక్షణంగా చూస్తే రెండో కుక్కని కనిపెట్టేయచ్చు.
హింట్...
నేలపైనే కుక్క కోసం వెతక్కుండా ఆ ఇద్దరి అమ్మాయిల్లో వెతికేందుకు ప్రయత్నించండి. వారి దుస్తుల్లోనే ఓ కుక్క దాక్కుని ఉంది. మీరు ఈ శునకాన్ని తక్కువ సమయంలో కనిపెడితే మీరు జీనియస్ అనే లెక్క.
జవాబు
ఈపాటికే జవాబు పట్టేసి ఉంటారు. ఇంకా దొరకని వాళ్ల కోసమే ఈ జవాబు. ఫోటోలో ఎరుపు రంగులో గౌనులో బొద్దుగా ఉన్న అమ్మాయిని చూశారా... ఆ అమ్మాయి చేతి పై డ్రెస్ డిజైన్ చూడండి. కుక్క ముఖం కనిపిస్తుంది. ఫోటోను తిరగేసి చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. మీరెవరూ అక్కడ కుక్క ముఖం ఉంటుందని ఊహించి ఉండరు.
ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు. విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి.
ఇలాంటి మరికొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ల కోసం ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెతకండి.
View this post on Instagram
Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?
Also read: ఒంటరితనం డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?