రెండోరోజు - చితిర (Chithira)
ఓనం రెండవ రోజును 'చితిర' అంటారు. చితర రోజు మహాబలి రాజును ఘనంగా ఆహ్వానిస్తారు. సంప్రదాయ కార్యక్రమాలు చేస్తూ ఆచారాలు పాటిస్తారు. అలాగే పూకలం మరింత పెద్దదిగా చేస్తారు. ఇది రాజు వస్తున్నాడనే సంతోషాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని సూచిస్తుంది. మహబలి ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.
మూడవరోజు - చోధి(Chodi)
ఓనం మూడవ రోజును 'చోధి' అంటారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరూ ఓ చోట చేరి నృత్యం చేయడం, నాటకాలు, సంగీతంతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడోరోజున కూడా 'పూకలం' మరింత పెద్దదిగా చేస్తారు.
నాల్గవరోజు - విశాఖం (Vishakam)
'విశాఖం' నాల్గవ రోజు. పూకలం మరింత పెద్దదిగా చేస్తారు. మహాబలి మహారాజు, వామన మహారాజు మట్టి విగ్రహాలను ప్రాంగణంలో ఉంచుతారు. ప్రతి కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. సాంప్రదాయ ఆచారాలు ఫాలో అవుతారు. పురాణాల ప్రకారం దాతృత్వానికి పేరుగాంచిన మహాబలి మహారాజు ఆత్మను ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐదవరోజు - అనిజం (Anizham)
ఐదవరోజును 'అనిజం' అంటారు. అళప్పుజాలో జరిగే అందమైన పడవ పోటీలకు ఇది ప్రసిద్ధి చెందింది. పడవ పోటీలలో అద్భుతమైన రీతిలో జరుగుతాయి. ఇవి వేగం, పనితీరును సూచిస్తాయి. ఇది ఓనం పండుగకు ముఖ్యాంశంగా చెప్తారు.
ఆరవరోజు - త్రికేట (Thriketa)
'త్రికేట' రోజు పూకలం అలంకరించడంతో పాటు గొప్ప 'ఓనం విందు'కు సిద్ధమవడంపై దృష్టి పెడతారు. సంప్రదాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. సామాజికంగా సమావేశాలు నిర్వహిస్తారు. ఇవి మొత్తం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయి.
ఏడవరోజు - మూలం (Moolam)
7వ రోజును 'మూలం' అంటారు. పూకలానికి కొత్త డిజైన్‌లను జోడించి.. మరింత పెద్దదిగా చేస్తారు. ప్రత్యేక పూజలు చేసి వేడుకలు నిర్వహిస్తారు.
ఎనిమిదవ రోజు - పూరాడం (Pooradam)

ఓనం ఎనిమిదవ రోజు 'పూరాడం' అని పిలుస్తారు. పూకలాన్ని డిజైన్‌లతో నింపుతారు. 'ఓనత్తప్పన్' అనే మహాబలి మహారాజు మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఓనం విందుకు సిద్ధమవుతారు. పండుగ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.
































