ఓనం 2025

'ఓనం సాధ్య' చరిత్ర, ప్రాముఖ్యతలు తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest/ Munnamidam

ఆహార ఉత్సవం

ఓనం వేడుకల్లో పదవ రోజున 'ఓనం సాధ్య' నిర్వహిస్తారు. ఇది ఆహార ఉత్సవాన్ని సూచించే గొప్ప విందుగా చెప్తారు.

Image Source: Pinterest/ Diya

ఓనం సాధ్య ప్రాముఖ్యత

ఓనం సాధ్య అంటే అరటి ఆకుపై వడ్డించే రంగు రంగుల రుచికరమైన భోజనం. పురాణాల, సామాజిక బంధం, సంప్రదాయ పరిరక్షణను ఇది సూచిస్తుంది.

Image Source: Canva

26 వంటకాలు

ఈ ట్రెడీషనల్ శాఖాహార విందులో దాదాపు 26 వంటకాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తయారు చేసి అరటి ఆకుపై వడ్డిస్తారు.

Image Source: Pinterest/ Culinary Delights by Pratham

ఆచారం, రుచి కలయిక

ఓనం సాధ్య కేవలం రుచిని హైలెట్ చేయడమే కాదు.. సామూహికంగా సమాజాలను ఏకం చేయడాన్ని సూచిస్తుంది.

Image Source: Pinterest/ alex_an_riya_

ఓనమ్ చరిత్ర

ఓనం సాధ్య కేరళ గొప్ప పురాణాల నుంచి, చరిత్ర నుంచి ఉద్భవించింది. ఈ విందు మహబలి రాజు కథతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. అతని దయాపూర్వక పాలన, దైవిక దృష్టిని చాటి చెప్తోంది ఓనమ్.

Image Source: Pinterest/ Pgangwani

విష్ణుమూర్తి 'వామన' అవతారం

విష్ణువు వామన రూపంలో ఒక పొట్టి బ్రాహ్మణుడిగా అవతరించాడని.. మహాబలి వినయాన్ని పరీక్షించడానికి.. వామన రూపంలో వచ్చాడని చెప్తారు.

Image Source: Pinterest/ Meena Gupta

మహాబలి వార్షిక రాక

ఓనం మహాబలి తన ప్రజల దగ్గరకు ప్రతి ఏడాది తిరిగి రావడాన్ని సూచిస్తుంది. ఇది కేరళ సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుంది.

Image Source: Canva

సంప్రదాయాలు, ఆచారాలు

ఓనం వేడుకల్లో భాగంగా పుష్పాలతో రంగుల ముగ్గులు, ఆటలు, పడవ పోటీలు, పులికలి, విలువిద్య వంటి ఆచారాలు ఫాలో అవుతారు.

Image Source: Pinterest/ Sreejith S

సాంస్కృతిక సంపద

అరటి ఆకుల్లో వడ్డించి చేతులతో తినడం ద్వారా అందరూ సమానమేనని సూచిస్తూ.. సమానత్వాన్ని చాటి చెప్తుంది.

Image Source: Canva