డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన సూక్తులు ఇవే
అపరిమితమైన దానికి.. అంతులేనితనానికి.. మనస్సు ఇచ్చే గౌరవమే సహనం.
జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ప్రేమ మనకు పరిపూర్ణతను ఇస్తుంది.
పుస్తకాలనేవి సంస్కృతుల మధ్య వారధులు.
దేవుడు మనలో ప్రతి ఒక్కరిలోనూ జీవిస్తాడు. అనుభూతి చెందుతాడు. బాధపడతాడు. కాలక్రమేణా ఆయన లక్షణాలు, జ్ఞానం, అందం, ప్రేమ మనలోని ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతాయి.
నిజమైన మతం ఒక విప్లవాత్మక శక్తినిస్తుంది. అణచివేత, ప్రత్యేక హక్కులు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే శత్రువు ఇది.
ఆనందం, సంతోషం కలిగిన జీవితమనేది.. జ్ఞానం, విజ్ఞానం ఆధారంగానే సాధ్యమవుతుంది.
నిజమైన గురువులు మనల్ని మనమే ఆలోచించుకునేలా చేసేవారు.
దేవుడు మనలోనే ఉంటాడు. ఆయన లక్షణాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఇదే నిజమైన ఆధ్యాత్మికం.
నా పుట్టినరోజులా కాకుండా.. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడమే నాకెంతో గర్వకారణం.