30 ఏళ్లకే ముడతలు వచ్చేస్తున్నాయా? ఇలా దూరం చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

వయస్సు కంటే పెద్దగా కనిపిస్తున్నారా?

ముప్పైలలో చాలామందికి సన్నని గీతలు, ముడతలు రావడం జరుగుతుంది. దీనివల్ల వారు వయస్సు కంటే చాలా పెద్దగా కనిపిస్తారు.

Image Source: Canva

ముడతలు వస్తుంటే..

ముడతలను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. దీనివల్ల మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. అందుకే అదనపు సంరక్షణ తీసుకోవాలి.

Image Source: Canva

ఇంటి చిట్కాలు

కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, ఇంటి నివారణలతో ముడతలను తగ్గించుకోవచ్చు. యవ్వన చర్మాన్ని తిరిగి పొందవచ్చు.

Image Source: pexels

ముడతలు ఎందుకు వస్తాయి

ఒత్తిడి, నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం వంటివి చిన్న వయస్సులోనే ముడతలు వచ్చేలా చేస్తాయి.

Image Source: pexels

అలోవెరా జెల్

ప్రతి రోజు రాత్రి 5 నిమిషాల పాటు కలబంద జెల్తో ముఖానికి మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మానికి తేమ అందుతుంది. రంధ్రాలు బిగుసుకుంటాయి. ముడతలు సహజంగా తగ్గుతాయి.

Image Source: Canva

తగినంత నీరు తీసుకోవాలి

ప్రతిరోజు తగినంత నీరు తాగాలి. దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. రంగు మెరుగుపడుతుంది. ఫైన్ లైన్స్ తగ్గుతాయి.

Image Source: Canva

అరటిపండు, బొప్పాయి ఫేస్ ప్యాక్

ముఖానికి అరటిపండు లేదా బొప్పాయి గుజ్జును రాసుకోవడం వల్ల చర్మం తేమగా మారుతుంది. లోపలి నుంచి పోషణ లభిస్తుంది. ముడతలు సమర్థవంతంగా తగ్గుతాయి.

Image Source: pexels

కొబ్బరి నూనెతో మెరుపు

పడుకునే ముందు కొబ్బరి నూనెతో ముఖానికి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.

Image Source: Canva

ఒత్తిడిని తగ్గించుకోండి

చర్మాన్ని వృద్ధాప్యంగా మార్చడంలో ఒత్తిడి కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి యోగా, ధ్యానం చేయాలి. మెరిసే, ముడతలు లేని చర్మం కోసం తగినంత నిద్ర అవసరం.

Image Source: pexels