నిద్రపోయే ముందు తినకూడని ఆహారాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

నిద్ర

ఆరోగ్యకరమైన శరీరానికి, మనసుకు మంచి నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. శక్తి తగ్గుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది.

Image Source: pexels

ఆరోగ్యానికి ముప్పు

నిద్ర లేకపోవడం ఒత్తిడి, ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట తినే ఫుడ్స్ ఈ సమస్యలను పెంచుతాయి.

Image Source: pexels

ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిద్ర బాగా రావాలంటే సమయానికి పడుకోవడమే కాదు. సరైన ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఇది విశ్రాంతిని పెంచుతుంది.

Image Source: pexels

స్పైసీ ఫుడ్స్

రాత్రి సమయంలో మసాలా, ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. దీనివల్ల ఎసిడిటీ పెరుగుతుంది. గుండెల్లో మంట, అజీర్తి పెరుగుతాయి. దీనివల్ల నిద్ర సరిగ్గా రాదు.

Image Source: Canva

ప్రాసెస్ చేసిన ఫుడ్స్

చిప్స్, ఇన్స్టంట్ నూడుల్స్, ఇతర ప్రాసెస్ చేసిన స్నాక్స్​లలో అధికంగా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను కష్టతరం చేస్తాయి.

Image Source: Canva

ఐస్ క్రీమ్

ఐస్ క్రీమ్ లాంటి చల్లని డెజర్ట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇవి ఎనర్జీని పెంచుతాయి. ఇవి మీ స్లీపింగ్ సైకిల్​కి ఆటంకాన్ని కలిగిస్తాయి. దీనివల్ల మీరు ఎక్కువసేపు మేల్కొని ఉంటారు.

Image Source: pexels

కాఫీ, కెఫిన్

నిద్రపోయే ముందు కాఫీ, టీ లేదా ఇతర కెఫిన్ కలిగిన పానీయాలు తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కెఫిన్ మెదడును ఉత్తేజితం చేస్తుంది.గాఢ నిద్రను దూరం చేస్తుంది.

Image Source: pexels

మద్యం

మద్యం నిద్రను ఇవ్వొచ్చు. కానీ కాలక్రమేణా ఇది నిద్రను దూరం చేస్తుంది. దీనివల్ల విశ్రాంతి దూరమవుతుంది.

Image Source: Canva

రెడ్ మీట్

నిద్రపోయే ముందు రెడ్ మీట్ తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది మీ శరీరానికి విశ్రాంతిని దూరం చేస్తుంది.

Image Source: Canva