అన్వేషించండి

Weight Loss: పోషకాలు నిండిన ఈ బ్రేక్ ఫాస్ట్ తిన్నారంటే సులువుగా బరువు తగ్గుతారు

బరువు తగ్గించుకోవడం కోసం బ్రేక్ ఫాస్ట్ మానేసి ఒక అరటి పండుతో పొట్ట నింపేసుకుంటున్నారా? అలా చేస్తే మీరు బరువు తగ్గకపోగా పెరిగిపోతారు.

ప్రతి ఇద్దరిలో ఒకరు స్థూలకాయానికి గురవుతున్నారు. అందుకు కారణం అనారోగ్యకరపు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం. ఊబకాయం నుంచి బయట పడేందుకు చాలా మంది డైటింగ్ తో పాటు వ్యాయామశాలలో గంటల తరబడి గడుపుతున్నారు. అల్పాహారం స్కిప్ చేయడం చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు పెరుగుతారని ఎక్కువ మందికి తెలియదు. అల్పాహారం రోజులోని ముఖ్యమైన భోజనాలలో ఒకటి. దానిని నివారించడానికి బదులుగా తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. రోజంతా యాక్టివ్ గా ఉండేందుకు శక్తిని ఇస్తుంది. ఇది చేయకపోవడం వల్ల అతిగా తినాలనే కోరికలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గేందుకు చూస్తున్న వాళ్లయితే మీ అల్పాహారంలో వీటిని చేర్చుకోండి. సులభంగా తగ్గిపోతారు.

గ్రామ్ పిండి లేదా మూంగ్ దాల్ చీలా

చీలా తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి తింటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీని వల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. ఇందులో గరం మసాలా, ఉప్పు, మసాలా దినుసులు కొద్దిగా నీటిని జోడించుకుని ఒక సిరప్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్ మీద కొంచెం పిండిని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

గుడ్డు

ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తినొచ్చు. ఆమలీట, ఎగ్ బుజ్జి కూడా తినొచ్చు. కానీ ఇందులో ఎక్కువ నూనె ఉపయోగించుకోకూడదు. శాండ్ విచ్ లేదా సలాడ్ ని తయారు చేసుకుని అందులో ఉడికించిన గుడ్డు పెట్టుకుని అల్పాహారంగా తినవచ్చు.

కాటేజ్ చీజ్

చీజ్ లో ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే చీజ్ ను అల్పాహారంలో అనేక రకాలుగా తినొచ్చు. పనీర్ శాండ్ విచ్, రొటీలో చీజ్ తీసుకోవచ్చు. ఉప్పు, నల్ల మిరియాలతో చేసిన పదార్థాలతో చీజ్ కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు శరీరానికి శక్తిని ఇస్తుంది.

ఓట్మీల్

ఓట్మీల్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తీపి లేదా ఉప్పగా చేసుకోవచ్చు. ఇందులో కూరగాయల ముక్కలు కూడా కలుపుకుని తింటే దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.

ఇడ్లీ సాంబార్

ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇడ్లీ కూడా తేలికగా జీర్ణం అవుతుంది. తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. సాంబార్ ని ఆరోగ్యకరమైందిగా చేయడానికి అందులో రంగు రంగుల కూరగాయలు జోడించుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మార్నింగ్ టీలో వీటిని కలిపి తీసుకున్నారంటే రుచి అద్భుతం, ఆరోగ్యం పుష్కలం

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget