No Shave November : అబ్బాయిలు మీరు క్లీన్ షేవ్‌తోనే కాదు, గడ్డంతోనూ అందంగా కనిపించొచ్చు
మీరు కూడా నో షేవ్ నవంబర్ ఫాలో అవుతున్నారా? అయితే ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయిపోండి.
No Shave November : నో షేవ్ నవంబర్. దీనిని చాలామంది మగవారు దీనిని ఫాలో అవుతుంటారు. అసలు నో షేవ్ నవంబర్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు పాటిస్తారో మీకు తెలుసా? నో షేవ్ నవంబర్ అంటే పురుషులు గడ్డం, మీసాలు, జుట్టును 30 రోజులు క్లీన్ షేవ్ చేయకుండా ఉండడం. కొందరు గడ్డం పెంచుకుంటారు కానీ.. వారి వారి వృత్తులు, అవసరాల మేరకు కొంచెం ట్రిమ్ చేస్తారు. మగవారిలో వచ్చే అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు దీనిని ఫాలో అవుతున్నారు. దీనిలో భాగంగా.. ఈ నెలలో రేజర్లు, షేవింగ్, బార్బర్ షాపులకోసం పెట్టే ఖర్చును.. స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు.
నో షేవ్ నవంబర్ ఫాలో అవ్వడం బాగానే ఉంది. కానీ మరి ఈ సమయంలో మీ గడ్డం మీ లుక్‌ని డిస్టర్బ్ చేస్తుందేమో? ఈ ప్రశ్న మీలో ఉంటే.. దానికి సమాధానం ఇక్కడే ఉంది. అవును మీరు క్లీన్ షేవ్‌తోనే కాదు.. గడ్డంతో కూడా హాట్, ప్రొఫెషనల్ లుక్ మెయింటైన్ చేయవచ్చు. గడ్డంపైన జుట్టు కాస్త గరుకుగా ఉంటుంది. ఇది తల వెంట్రుకలతో పోలిస్తే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి దీనిని మెయింటైన్ చేయడం కాస్త కష్టమే అయినా.. మీరు కొన్ని చిట్కాలతో దీనిని హ్యాండిల్ చేయవచ్చు.
లోపల నుంచి పోషణ
మీ గడ్డాన్ని బయటి నుంచి కంటే ముందు.. లోపలి నుంచి పోషణ ఇవ్వాలి. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే గడ్డాన్ని పెంచుకోవడానికి, పెరుగుదలకు పోషణ అవసరం. కాబట్టి ముందు మీ శరీరంపై శ్రద్ధ వహించండి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ.. హైడేటెడ్గా ఉండండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇవి మీకు మంచి బియర్డ్ లుక్‌ని అందిస్తాయి. ఈ నో షేవ్ నవంబర్ థీమ్‌నే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే ఉద్దేశం కాబట్టి వీటిని ఫాలో అవ్వండి.
క్లీన్‌గా చూసుకోండి..
క్లీన్ షేవ్‌తో ఉన్నప్పుడు ఫేస్ అంతా క్లీన్ చేసే వీలుంటుంది. అయితే గడ్డం ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. క్రమం తప్పకుండా మీ గడ్డాన్ని కడగండి. మార్కెట్లలో బియర్డ్ షాంపూలు మీకు అందుబాటులో ఉంటాయి. లేదంటే మీరు మైల్డ్ షాంపూలు ఉపయోగించవచ్చు. ఇవి గడ్డాన్ని ప్రభావవంతంగా శుభ్రం చేస్తాయి. మురికి, నూనె, డస్ట్ వంటివాటిని ఇది తొలగిస్తుంది. ఇది మీ గడ్డం హెల్తీగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మురికిగా ఉన్నప్పుడు మీ గడ్డం మీ మాట వినడం కాస్త కష్టమే. కాబట్టి మీ లుక్ బాగుండాలంటే దీనిని కచ్చితంగా ఫాలో అవ్వాలి.
గడ్డాన్ని దువ్వండి..
మీరు కొన్ని రోజులు జుట్టును దువ్వడం ఆపేస్తే.. మీకు ఎంత చిరాకుగా ఉంటుంది. జుట్టుకూడా రాలిపోతూ.. పొడిబారి పోతుంది. మీ గడ్డం కూడా అంతే. కాబట్టి రోజూ గడ్డాన్ని బ్రష్ చేయండి. ఇది మీ గ్రూమింగ్ కేర్‌లో ఓ భాగమే. ఇది గడ్డాన్ని అదుపులో ఉంచడమే కాకుండా.. సహజమైన నూనెల పంపిణీని ప్రోత్సాహిస్తుంది. అవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ట్రిమ్ చేయండి..
నో షేవ్ నవంబర్‌లో ట్రిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ తమ వృత్తి దృష్ట్యా రఫ్ లుక్‌లో కనిపించలేరు. కానీ గడ్డంతోనే ప్రొఫెషనల్ లుక్ కోసం ట్రిమ్ చేసుకోవచ్చు. అడ్డందిడ్డంగా పెరిగే మీ గడ్డం, మీసాలకు ఇది ఒక మంచిరూపు ఇస్తుంది. కాబట్టి కత్తెర లేదా ట్రిమర్తో మీరు గడ్డాన్ని, మీసాలను ట్రిమ్ చేయవచ్చు. ఇది మీకు మంచి లుక్‌ని ఇవ్వడమే కాకుండా.. గడ్డం పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
జెల్ అప్లై చేయవచ్చు..
మీ గడ్డాన్ని అందంగా కనిపించేందుకు.. మీరు బియర్డ్ ఆయిల్స్ లేదా జెల్స్ ఉపయోగించవచ్చు. ఆయిల్ అయితే కొన్ని డ్రాప్స్ తీసుకుని.. చేతులతో బాగా రబ్ చేసి బియర్డ్కి అప్లై చేయండి. ఇది మీ గడ్డాన్ని హైడ్రేట్, కండిషన్ చేస్తుంది. ఇది మీకు మంచి లుక్‌ని కూడా ఇస్తుంది. కేవలం ఈ చిట్కాలు నో షేవ్ నవంబర్ సమయంలోనే కాదు.. మీకు గడ్డం పెంచుకునే అలవాటు ఉంటే.. మీరు వీటిని మంచిగా ఫాలో అవ్వొచ్చు.
Also Read : మీకు మధుమేహం ఉందా? అయితే ఈ స్మూతీ రెసిపీ మీకోసమే