అన్వేషించండి

మీకు మధుమేహం ఉందా? అయితే ఈ స్మూతీ రెసిపీ మీకోసమే

మధుమేహంతో ఇబ్బందిపడే వారికి ఉదయాన్నే ఈ స్మూతీ చేసి ఇవ్వండి. అది వారికి మంచి టేస్ట్ అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

Diabetes Diet : మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. వాటిని విస్మరిస్తే.. బ్లడ్​ షుగర్​ లెవెల్స్​ అమాంతం పెరిగిపోతాయి. అంతేకాదు త్వరగా సిక్ అయిపోతారు. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు కష్టమైన.. కొన్ని కఠినమైన డైట్​లను పాటించాల్సి ఉంటుంది. అయితే దీనికోసం స్వీట్స్ పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. కొన్నిసార్లు నోటికి కనీసం రుచిలేని ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్మూతీలు కూడా తీసుకోరు. ఎందుకంటే ఇవి శరీరంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి కాబట్టి. అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్న స్మూతీ.. మీ షుగర్​ను అదుపులో ఉంచడమే కాకుండా మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

అవును మీరు వింటున్నది నిజమే. మీరు స్మూతీని మీ ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే దేనిని పడితే దానిని తీసుకోకూడదు. డయాబెటిస్ ఫ్రెండ్లీ స్మూతీలు కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇవి మీ నోటికి రుచిని అందిచడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి.. మెరుగైన ఆరోగ్యం అందిస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కష్టం అనుకుంటున్నారేమో.. కానీ ఈ రెసిపీని తయారు చేయడం చాలా తేలిక. దీనిని బొప్పాయి, అరటిపండుతో తయారు చేస్తారు. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో..? దానిని ఎలా తయారు చేయాలో.. దీని వల్ల కలిగే లాభాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బొప్పాయి ముక్కలు - 1 కప్పు

అరటిపండు - 1

పెరుగు - 1 కప్పు

చియా సీడ్స్ - 1 టీస్పూన్ (నానబెట్టుకోవాలి)

తయారీ విధానం..

ఈ స్మూతీ తయారు చేసుకోవడం చాలా తేలిక. బొప్పాయి, అరటిపండు, పెరుగు, చియాసీడ్స్​ను స్మూతీ జార్​లో వేసి.. బాగా మిక్స్ చేయాలి. దీనిని ఓ గ్లాస్​లోకి తీసుకోవాలి. బొప్పాయి ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకోవాలి. మరింత శక్తికోసం నాన బెట్టిన బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్​తో గార్నీష్ చేసుకోవచ్చు. అంతే టేస్టీ, హెల్తీ స్మూతీ రెడీ. బొప్పాయి, అరటిపండు రెండూ డైటరీ ఫైబర్​ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలెట్​లు ఆరోగ్యానికి అవసరమైనవి. పెరుగు ప్రోటీన్​, ప్రోబయోటిక్స్​ కలిగి ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడమే కాకుండా.. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్​ పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. 

కేవలం పండ్లతోనే కాదు.. మీరు మధుమేహం కలిగి ఉంటే.. కూరగాయలతో కూడా స్మూతీలు తయారు చేసుకోవచ్చు. పాలకూర, దోసకాయ, బీట్​రూట్​, క్యారెట్​లు ఫైబర్​, పోషకాలను నిండుగా కలిగి ఉంటాయి. వీటికి లో ఫ్యాట్​ మిల్క్ జోడించి.. ప్రోటీన్​ను పొందవచ్చు. ఇలాంటి రెసిపీలు కేవలం మధుమేహ వ్యాధిగ్రస్తులకే అంటే పొరపాటే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు, జిమ్​కి వెళ్లే ప్రతి ఒక్కరూ దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మీ స్కీన్​కు, జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 

 Also Read : బరువును వేగంగా తగ్గించి.. డయాబెటిస్​ను కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
Pineapple Tea : సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
సమ్మర్ స్పెషల్ పైనాపిల్ టీ.. వేసవిలో తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Grow Coriander in Water : 15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా
Fenugreek Water : మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?
మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ నానబెట్టి తాగితే మంచిదా? లేదా మరిగించి తాగాలా?

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
Vehicle Maintenance Guide: మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
Embed widget