అన్వేషించండి

బరువును వేగంగా తగ్గించి.. డయాబెటిస్​ను కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే

బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి మీరు వ్యాయామాలతో పాటు కొన్ని ఫుడ్స్ మీ డైట్​లో చేర్చుకోవాలి. 

మధుమేహం, గుండె సమస్యలు, బరువు పెరిగిపోవడం. ఈ మూడు ప్రస్తుత కాలంలో చాలా కామన్ అయిపోతున్నాయి. సరైన జీవన శైలి లేనప్పుడు, ఫుడ్​ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించనప్పుడు.. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ మూడు సమస్యలు ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా ఈ మూడు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఎలాగంటే.. ఊబకాయం ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే గుండె జబ్బులు కూడా వెంటాడుతూ ఉంటాయి. చాలా పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. 

ఈ ఆరోగ్య సమస్యలు చాలా క్లిషమైనవి. అయితే వీటిని కంట్రోల్ చేయడంలో, లేదా నియంత్రించడంలో కొన్ని ఆహారాలు మనకి సపోర్ట్ చేస్తాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. కాబట్టి మీరు ఈ సూపర్​ఫుడ్స్​ని మీ డైట్​లో చేర్చుకుని.. హెల్తీగా ఉండొచ్చు. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటి? వాటిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

బాదం..

బరువు తగ్గాలని చాలామంది ఉదయాన్నే బాదం తింటారు. ఇదే కాకుండా వివిధ కారణాలతో కొందరు మార్నింగ్ బాదం తింటారు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు దరిచేరనీయకుండా బాదం చాలా సహాయం చేస్తుంది. దీనిలోని మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మాంసకృతులు సమృద్ధిగా ఉండటం వల్ల ఆకలిని కంట్రోల్ చేసి.. కడుపు నిండిన ఫీల్ తీసుకొస్తుంది.

బాదంలోని పైబర్ బరువు, మధుమేహం నిర్వహణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని బాదం పప్పులు తినడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మంచి రుచిని ఇస్తుంది కాబట్టి.. మీరు దీనిని ఏ ఆహారంతోనైనా కలిపి తీసుకోవచ్చు. స్నాక్స్, సూప్స్, డ్రింక్, స్మూతీలు.. ఇలా వేటితోనైనా దీనిని తీసుకోవచ్చు. నానబెట్టిన బాదంలు వినియోగిస్తే మంచిది. 

ఓట్స్..

డైట్ చేయాలనుకునే ప్రతివారి లిస్ట్​లో ఓట్స్ ఉంటాయి. వీటిలో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది బీటా గ్లూకాన్​ను, కరిగే ఫైబర్​ను కలిగి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. వీటిలోని పోషకాలు మీకు తక్షణమే శక్తిని అందిస్తాయి. బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. అయితే మీరు ఓట్స్​ను కేవలం సూప్​ల్లానే కాదు.. దోశలు, వడలు వంటి హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ల రూపంలో తీసుకోవచ్చు. 

ఆకుకూరలు

మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. లేకపోయినా.. మీ డైట్​లో ఆకు కూరలు కచ్చితంగా చేర్చుకోండి. వీటిలో ముఖ్యంగా పాలకూర ఉండేలా చూసుకోండి. దీనిలో వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు.. మీ శరీరానికి అద్భుతాలు చేసే అనేక సమ్మేళనాలున్నాయి. అంతేకాకుండా ఇది అధికమొత్తంలో ఫైబర్, నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడంలో, డయాబెటిస్​ను దూరం చేయడంలో సహాయం చేస్తుంది. దీనిలోని నైట్రేట్లు రక్తపోటును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీరు దీనిని సూప్​లలో, సలాడ్​లలో, పప్పుతో లేదా ఫ్రై చేసి.. లేదంటే స్నాక్స్​లలో దీనిని ఉపయోగించవచ్చు. 

పెసలు

చాలామంది పెసలను స్ప్రౌట్స్​ రూపంలో తీసుకుంటారు. ఇవి చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. ఫ్రీ రాడికల్ డ్యామేజ్​తో పోరాడటానికి సహాయం చేస్తాయి. ఇవి మీ హృదయ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి.. ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కడుపును నిండుగా చేయడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా షుగర్​ స్పైక్స్​ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహాన్ని కంట్రోల్ చేయాలనుకునేవారు వీటిని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అయితే వీటిని మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. 

రాగులు

రాగుల్లో మెగ్నీషియం, పోటాషియం, ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఫైటోన్యూట్రియెంట్లకు మంచి మూలం. దీనిలో ట్రైగ్లిజరైడ్స్, ఎల్​డిఎల్​ కొలెస్ట్రాల్​, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం, గుండెజబ్బులతో బాధపడే వారికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా రాగుల్లో ఉంటాయి. ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ బరువును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. సూప్​ల రూపంలో.. సంగటి చేసుకుని.. దోశలు.. ఇలా పలు రకాలుగా వీటిని మీ డైట్​లో చేర్చుకోవచ్చు. 

Also Read : ఈ ఫుడ్స్​ తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా బయటపడతారు

గమనిక:పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget