అన్వేషించండి

ఈ ఫుడ్స్​ తీసుకుంటే డెంగ్యూ నుంచి త్వరగా బయటపడతారు

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేందుకు మీరు మీ ఆహారంలో కొన్ని చేర్చుకోవచ్చు. అవి మీరు త్వరగా రికవరీ అయ్యేలా హెల్ప్ చేస్తాయి.

దేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇది సోకిందంటే మనలోని రోగనిరోధక శక్తి బలహీన పడిపోతుంది. రక్తనాళాలు దెబ్బతిని.. ప్లేట్​లెట్స్ సంఖ్య ఘోరంగా తగ్గిపోతుంది. ఈ జ్వరం వచ్చిన మూడు రోజుల తర్వాత దాని లక్షణాలు మనకి కనిపించడం ప్రారంభమవుతాయి. అవి వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి. అధిక జ్వరం.. భరించలేని తలనొప్పి, కళ్లు నొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వికారం, వాంతులు, అతిసారం, స్కిన్ అలెర్జీ వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తాయి. కొందరికి అతి తక్కువ జ్వరం, ఫ్లూవంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరికొందరికి స్ట్రోక్, ఇంటర్నల్ బ్లీడింగ్, కాలేయ సమస్యలు, అవయవ వైఫల్యం జరుగుతుంది. రక్తనాళాలు దెబ్బతిని భారీ రక్తస్రావమై.. వ్యక్తి మరిణించే అవకాశం కూడా ఉంది. దీనినే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. అయితే మీరు డెంగ్యూ వ్యాధి బారిన పడినా.. మీరు కొన్ని చిట్కాలు పాటించగలిగితే త్వరగా రికవరీ అవుతారు. ముందుగా వైద్యుని సంప్రదించాలి. వారు అందిచే కోర్సులు పాటించాలి. అంతేకాకుండా మీరు ఇంట్లో కూడా కొన్ని ఆహారాలు రెగ్యూలర్​గా తీసుకుంటే మీరు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు పూర్తిగా ఎలక్ట్రోలైట్​లతో నిండి ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్​ నుంచి కాపాడుతుంది. శరీరం కోల్పోయిన పోషకాలు, లవణాలను తిరిగి శరీరానికి అందిస్తుంది. కాబట్టి మీరు సిక్​ అయినా.. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశముంది. ఇది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. 

ఈ సమయంలో మీరు రోజుకు రెండు గ్లాసుల తాజా కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది మీ శరీరం నుంచి టాక్సిన్లను కూడా తొలగిస్తుంది. తద్వారా ఇన్​ఫెక్షన్​ త్వరగా బయటకు పోతుంది. 

బొప్పాయి ఆకులు..

డెంగ్యూతో బాధపడే వారు త్వరగా కోలుకోవడానికి బొప్పాయి ఆకులు తప్పనిసరిగా తమ డైట్​లో చేర్చుకోవాలి. సాధారణంగా బొప్పాయి జ్వర లక్షణాలు తగ్గిస్తుంది. అయితే డెంగ్యూలో మాత్రం పచ్చి బొప్పాయి, బొప్పాయి ఆకులు మరింత ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఎందుకంటే ఇవి శరీరంలో ప్లేట్​లెట్ కౌంట్​ను పెంచడంలో సహాయపడతాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి మీరు బొప్పాయిలను బాగా శుభ్రం చేసి.. తాజా రసాన్ని తయారు చేసి.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి. ఇది తాగేముందు మీరు వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోండి. 

తిప్ప తీగ రసం

తిప్ప తీగరసం పూర్తిగా యాంటీపైరేటిక్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఆ వ్యాధి లక్షణాలు తగ్గించి.. రోగనిరోధశక్తిని పెంచుతుంది. ఈ గ్రీన్ హెర్బల్ ప్లేట్​లెట్​ కౌంట్ పెంచడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ నుంచి కోలుకునే సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 

తిప్పతీగ రసం చేయడానికి.. రెండు తిప్పతీగలను తీసుకుని.. బాగా కడిగి నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ రసాన్ని ప్రతి రెండు రెండుసార్లు తాగాలి. గోరువెచ్చగా ఈ రసం తాగితే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. 

సిట్రస్ పండ్లు..

నారింజ, దానిమ్మ పండ్లు రెండూ పూర్తిగా అనేక విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. కాబట్టి ఇవి మీరు డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాయి. వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మిమ్మల్ని హైడ్రేట్​గా ఉంచడంలో సహాయం చేస్తుంది. 
ఈ పండ్లలోని విటమిన్ సి కంటెంట్.. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా దానిమ్మ మీ ప్లేట్​ లెట్​ కౌంట్​ను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ అలసటను తగ్గించి.. శరీరంలో ఆక్సీకరణను తగ్గిస్తాయి. 

హెర్బల్ టీ

హెర్బల్ టీ కూడా డెంగ్యూ వ్యాధి తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ.. పోషణ అందిస్తుంది. దీనికోసం మీరు పుదీనా ఆకులు, ఏలకులు, అల్లం, దాల్చిన చెక్క వేసి ఈ టీని తయారు చేసుకోవచ్చు. ఇవి గొంతునొప్పి, జలుబు, ముక్కు కారటం, జ్వరం లక్షణాలనుంచి ఉపశమనం అందిస్తాయి. అంతేకాకుండా మీరు బాగా నిద్రపోవడానికి సహాయం చేస్తాయి. 

ఇవన్నీ డెంగ్యూ నుంచి మీరు త్వరగా కోలుకునేలా చేస్తాయి. అయితే మీరు వీటిని వినియోగించే ముందు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. 

Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Entertainment Top Stories Today: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Embed widget