By: ABP Desam | Updated at : 04 Feb 2022 08:32 PM (IST)
Representational Image/Pexels
సంసారం సాఫీగా సాగాలంటే.. ఒక్క ప్రేమ మాత్రమే సరిపోదు. పడక గదిలో ఇద్దరూ సుఖపడాలి. వీరిలో ఏ ఒక్కరు చేతులెత్తేసిన స్పర్థలు వస్తాయి. అయితే.. జీవితమంటే అదొక్కటే కాదని బయటకు చెప్పుకోవచ్చు. కానీ, ఆలుమగల్లో ఎవరో ఒకరికి ఆ సుఖం కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు.. ఇరువురు పరస్పరం సహకరించుకోవాలి. అప్పుడు సంసారం సాఫీగా సాగుతుంది. పురుషులతో పోల్చితే.. మహిళలే ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారట. మగాళ్ల అహాన్ని సంతృప్తి పరిచేందుకు.. తాము భావప్రాప్తి పొందినట్లుగా నటిస్తారట. దీనివల్ల పురుషులు.. తాము ఇంకా లైంగిక సామర్థ్యంతోనే ఉన్నామనే సంతోషంతో ఉంటారట. లేకపోతే.. తన పార్టనర్‌కు తనతో కలిసే ఉద్దేశం లేదనో.. తమలో సామర్థ్యం తగ్గిందనో కుమిలిపోతారట. ఈ అంశం మీద ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. కానీ, కలయిక సమయంలో మహిళల అరుపుల్లో చాలావరకు ఫేక్ అనే భావన ఉంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది.
మహిళలు తమ జీవిత భాగస్వామి సంతృప్తి కోసం ఆ సమయంలో తమ సొంత ఆనందాన్ని కూడా కూడా త్యాగం చేస్తారట. పురుషుల్లో చాలామంది తమ పనితీరు ఎలా ఉందో తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తారట. వారి అహాన్ని సంతోషపెట్టేందుకు మహిళలు తాము తృప్తి పొందినట్లుగా నటిస్తారట. దాని వల్ల పురుషులు తామలో మగతనం సంపూర్ణంగా ఉందని భావిస్తారట.
సోషల్ సైకలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్‌లో ప్రచురించబడిన ఈ తాజా పరిశోధనలో.. స్త్రీలు తమ భాగస్వాముల్లో మగతనం నమ్మకం కలిగించేందుకు అలా నటిస్తారట. ముఖ్యంగా చాలామంది పురుషుల్లో తమ మగతనంపై కొద్దిపాటి అనుమానం ఉంటుంది. దాని వల్ల వారు మానసికంగా కూడా కుంగిపోతుంటారు. అయితే, మహిళలు ఆ సమయంలో తృప్తి పొందినట్లు నటిస్తే.. పురుషుల్లో ధైర్యం పెరుగుతుందట. దానివల్ల వారు ఉత్సాహంగా ఉండటమే కాకుండా.. తమ భాగస్వామిని ప్రేమగా చూసుకుంటారట.
ఈ పరిశోధన కోసం నిపుణులు 283 మంది స్త్రీలపై సర్వే నిర్వహించారు. తమ భాగస్వామిలో ఆ సామర్థ్యం తగ్గిపోతుందని భావించినప్పుడు.. అలా నటిస్తుంటారని తేలింది. అంతేగాక.. వారి ముందు ఆ సమస్య గురించి కూడా ప్రస్తావించరట. ఇదే అధ్యయనంలో పేర్కొన్న మరో సర్వే వివరాల ప్రకారం.. తమ భాగస్వాములు కంటే ఎక్కువ డబ్బు సంపాదించే మహిళలు ఇతరులతో పోల్చితే రెండింతలు ఎక్కువ నకిలీ భావప్రాప్తికి గురవుతారట. భార్య కంటే తక్కువ సంపాదన కలిగిన భర్తలు ఎక్కువగా తమ భార్య తమని తక్కువ చూస్తుందని భావిస్తారు. పడగదిలో తృప్తి పొందినట్లు నటించకపోతే.. వారిని తక్కువ చేస్తుందని అనుకుంటారట. అందుకే, వారు అలా నటించాల్సి వస్తుందని సర్వేలో వెల్లడించారు.
సౌత్ ఫ్లొరిడా విశ్వవిద్యాలయానికి చెందిన రచయిత్రి జెస్సికా జోర్డాన్ మాట్లాడుతూ.. ‘‘స్త్రీలు తమ సొంత లైంగిక అవసరాలను, సంతృప్తి గురించి ఆలోచించకుండా తమ భాగస్వామి గురించి ఆలోచిస్తారు. కానీ, పురుషుల్లో కొందరు అలాంటి స్త్రీలను అర్థం చేసుకోవారు. తమలో మగతనం ఉందనే భావనతో వారిని చిన్నచూపు చూస్తారు’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో పడక గదిలో పడతులు పడే ఈ పాట్లను పురుష సమాజం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఒక వేళ అర్థం చేసుకున్నా.. అది వేరే ఆలోచనలకు దారితీయొచ్చు. అందుకే.. మహిళలు తమ ఫేక్ భావప్రాప్తిని ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతున్నారని అనుకోవాలి.
Protein Laddu: పిల్లలకు రోజూ ఒక ప్రొటీన్ లడ్డూ, ఎలా చేయాలంటే
Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ
Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?
Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి
Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?