Plastic Water Bottle Safety Concerns :ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా? న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
Drinking water from plastic bottle : ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? అయితే జాగ్రత్త. తాజాగా జరిగిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవేంటంటే..
Plastic Particles in Water Bottle : పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ నీళ్లు తాగుతున్నారా లేదా అని చూసుకుంటాము కానీ.. దేనిలో తాగుతున్నామనే దానిపై పెద్దగా అవగాహన ఉండదు. నాన్న ఇంటికి వచ్చేసరికి బాటిల్లో నీళ్లు అన్ని తాగేయ్ అని తల్లి.. పిల్లలకు చెప్తుంది. కానీ ఆ నీళ్లు పోసే బాటిల్ ఏమో ప్లాస్టిక్‌ది అయిపాయే. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగితే.. పలు ఆరోగ్య సమస్యలు తప్పవంటోంది తాజా అధ్యయనం. ఇది ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తుందో.. న్యూ స్టడీలో తేలిన విషయాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
శరీరంలోకి ప్రవేశిస్తున్న మైక్రోప్లాస్టిక్స్
ప్లాస్టిక్‌పై ఎంత అవగాహన కల్పించినా.. బాటిల్స్ విషయంలో మాత్రం ఇది ఏమాత్రం తగ్గట్లేదు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ వీటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ బాటిల్స్‌లో నీరు తాగడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయని తాజా అధ్యాయనంలో తేలింది. వేలకొద్ది ప్లాస్టిక్ రేణువులు నీటి ద్వారా శరీరంలోకి వెళ్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. కణజాలాలో ప్రవేశించి.. ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయని గుర్తించారు.
లీటర్ బాటిల్లో లక్షల్లో ప్లాస్టిక్ కణాలు
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీళ్లు తాగడంపై కొలంబియా యూనివర్సిటికీ చెందిన పరిశోధనా బృందం తాజా అధ్యయనం చేసింది. పరిశోధకులు బాటిల్ వాటర్‌లోని కణాలను గుర్తించడానికి న్యూ ఇమేజింగ్ టెక్నిక్‌ను వారు ఉపయోగించారు. దీనిలో షాకింగ్ విషయాలను వాళ్లు గుర్తించారు. సగటున లీటర్ వాటర్‌కు 2,40,000 ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వాటిలో 90 శాతం నానో ప్లాస్టిక్లేనట. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు. ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమేనని.. ఎందుకంటే ఇవి శరీరంలోకి ప్రవేశించి.. కణాలు, కణాజాలలోకి వెళ్లి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయట.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోతున్న కణాలు
ఈ కణాలు రక్తంలో, ఊపిరితిత్తుల్లో, గట్, మలంతో పాటు మగవారి వృషణాల్లో కూడా పేరుకుపోతున్నాయని గుర్తించారు. వీటివల్ల లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అంతేకాకుండా పునరుత్పత్తి కణజాలాలపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు. మరికొందరిలో బ్లడ్ ప్లెజర్ సమస్యలు కూడా తీవ్రమయ్యే అవకాశముందని వెల్లడించారు. ఈ అధ్యయనంకి సంబంధించిన విషయాలను నేషనల్ అకడామీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో నివేదించారు. కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు.
వాటిని రిప్లేస్ చేయండి..
గాజు బాటిల్స్, మట్టి బాటిల్స్ లేదంటే ఇతర మెటల్ బాటిల్స్‌ని ప్లాస్టిక్ బాటిళ్లతో రిప్లేస్ చేయాలంటున్నారు. హెల్తీగా ఉండేందుకు బాటిల్స్ విషయంలో కచ్చితంగా మార్పు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగిస్తుంటే.. కచ్చితంగా వాటి వినియోగం ఆపేసి.. ఇతర బాటిల్స్‌కి షిఫ్ట్ అయిపోండి. ఇంట్లో ఉండేప్పుడు గ్లాసులను కూడా ఉపయోగించవచ్చు.
Also Read : మధుమేహం, కొలెస్ట్రాల్ ఉంటే గుడ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలట.. రోజుకి ఎన్ని తినొచ్చంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.