Memory Loss: గజినీలకు గుడ్ న్యూస్, ఆ క్యాప్ పెట్టుకుంటే మతిమరుపు పోతుందట!
మతిమరుపు వల్ల జీవితాలనే కోల్పోయే పరిస్థితి ఉంది. కానీ ఇలా చేస్తే మతిమరుపు పోగొట్టడం చాలా సులువని చెప్తున్నారు నిపుణులు
మతిమరుపు చాలా ప్రమాదకరం. వయస్సు పెరిగే కొద్ది జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఏం చేశామో, ఎప్పుడు చేశామనే విషయాలను మర్చిపోతారు. చిత్త వైకల్యం, అల్జీమర్స్ అటువంటివే. కొంతమంది తమ మతిమరుపు కారణంగా ఆర్థిక వివరాలు మర్చిపోయి దాచిన డబ్బు వివరాలు కూడా మర్చిపోయిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
20 నిమిషాల్లోనే అన్నీ గుర్తుకొచ్చేస్తాయట: మెదడులో కణాలు, నరాలు దెబ్బతినడం వల్ల మతిమరుపు వస్తుంది. మెదడు జాగ్రత్తగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలకి బలమైన దెబ్బ తగిలినప్పుడు, విటమిన్స్ లోపం, బ్రెయిన్ ట్యూమర్స్ వంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఒకసారి మర్చిపోతే దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం చాలా సులభమైన పని. కానీ అది ఇప్పుడు కాదని అంటున్నారు నిపుణులు. కేవలం 20 నిమిషాల చికిత్సతో మీ మతిమరుపుని మాయం చేయవచ్చని అంటున్నారు.
ఎలక్ట్రోడ్ క్యాప్‌తో..: బోస్టన్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఒక కొత్త నివేదిక రూపొందించారు. ఎలక్ట్రోడ్‌లతో కూడిన ఒక క్యాప్ ధరించడం వల్ల ఇది సాధ్యపడుతుందని అంటున్నారు. ఇది మెదడులోకి విద్యుత్ సంకేతాలను పంపిస్తుంది. దాని వల్ల జ్ఞాపకశక్తి పని తీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అద్భుతమైన ఫలితం: ఈ అధ్యయనంలో పాల్గొన్నవాళ్ళకి వరుసగా నాలుగు రోజుల పాటి 20 నిమిషాలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పెట్టారు. రోగులకి 20 పదాలు ఇచ్చి వాటిని గుర్తుంచుకోమని చెప్పారు. మళ్ళీ వాటిని వెంటనే పఠించాలని సూచించారు. మూడు నాలుగు రోజుల తర్వాత తక్కువ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్ కి పంపించారు. ఆ తర్వాత వారిలో మెరుగైన స్వల్ప కాలిక జ్ఞాపకశక్తి మెరుగుపడింది. హై-ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల సత్ఫలితాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వాళ్ళు దీని ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారని తెలిపారు.
ఇలా చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది: బ్రెయిన్ సరిగా పని చెయ్యాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార ప్రభావం మెదడు మీద చూపిస్తుంది. టీమ్ కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే వాటిని తీసుకోవడం పరిమితం చెయ్యాలి. ఒత్తిడి, ఆందోళన కూడా మెదడు పని తీరుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. పజిల్స్, సుడోకు వంటి మెదడుకు పదును పెట్టె గేమ్స్ ఆడటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు డైట్లో భాగం చేసుకోవాలి. ఇవే కాదు కంటి నిండా నిద్ర కూడా చాలా అవసరం. మెదడుకి విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడే అది చురుగ్గా పని చేయగలుగుతుంది.
Also Read: కాఫీ డికాషన్‌ను వేస్ట్‌గా పడేయొద్దు, దానితో అద్భుతాలు చేయొచ్చు - ఇవిగో చిట్కాలు
Also Read: పోషకాల పవర్ హౌస్ కివీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు