(Source: ECI/ABP News/ABP Majha)
Diabetic Patients : మధుమేహమున్నవారు కాస్త బరువు పెరిగితే ఆయుష్షు కూడా పెరుగుతుందట.. కానీ కండీషన్స్ అప్లై..
Weight Gain : టైప్ 2 డయాబెటిస్తో ఉన్నవారు కొంత బరువు పెరగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే దానికి కండీషన్స్ కూడా ఉన్నాయని తేల్చింది.
Death Risk for Diabetes Patients : బరువు పెరగడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ సమస్యలు వస్తాయి. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదు అంటుంది తాజా అధ్యయనం. టైప్ 2 మధుమేహం అనేది పూర్తిగా బాడీ మాస్ ఇండెక్స్పై ఆధారపడి ఉంటుంది. న్యూ స్టడీ ప్రకారం ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారితో పోలిస్తే.. ఊబకాయం ఉన్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఏడు రెట్లు ఎక్కువని తేలింది. అంతేకాకుండా 65 ఏళ్లు పైబడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు కొంత బరువు పెరిగితే ప్రాణాంతక సమస్యలను తగ్గించుకోవచ్చని వెల్లడించింది.
వాళ్లు బరువు పెరిగితే మంచిదట
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యకరమైన శరీరం బరువు కోసం బరువు తగ్గుతారు. మరికొందరు అనుకున్న దానికంటే ఎక్కువ బరువు తగ్గిపోతారు. దానినే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ అంశాన్ని ప్రభావితం చేస్తూ.. తాజాగా అధ్యయనం పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన మధుమేహం ఉన్న వ్యక్తులు కొంత బరువు పెరగడం వల్ల మరణించే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. మధుమేహం, హృదయనాళ ఆరోగ్యాన్ని నిర్వహించడంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
మధుమేహం సమస్య ఉన్నవారిలో బరువు తగ్గాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన బరువును కూడా కొందరు కోల్పోతూ ఉంటారు. యూకే బయో బ్యాంక్ ఇచ్చిన డేటా ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవారిలో ఆరోగ్యకరమైన బరువు ఉండాలని చూపిస్తుంది తాజా అధ్యయనం. బరువు తగ్గిపోవాలనే ధోరణికి వ్యతిరేకంగా.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు మరణాలు, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే.. మధ్యస్థమైన, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలంటున్నారు. అనుకున్న దానికంటే బరువు తక్కువగా ఉంటే కాస్త బరువు పెరిగితే మంచి ప్రయోజనం పొందవచ్చని చెప్తున్నారు.
వయసుని బట్టి మారుతుంది..
చైనాలోని జియాంగ్ యాంగ్ సెంట్రల్ హస్పిటల్కు చెందిన డాక్టర్ షాయోంగ్ జు నేతృత్వంలో టైప్ 2 డయాబెటిస్ బరువుపై అధ్యయనం చేశారు. సాధారణంగా (23-25)BMIని కలిగిన ఉన్న 64 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్నవారిపై గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 26-28 BMIతో ఉంటే మితమైన అధిక బరువుగా పరిగణిస్తారు. కానీ ఇది గుండె జబ్బుల నుంచి మరణించే సమస్యను మరింత దూరం చేస్తుందని అధ్యయనం తెలిపింది. టైప్ 2 డయాబెటిస్ రోగుల BMI వయసుని బట్టి మారుతుందని తెలిపారు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి సరైన BMI అనేది ఆ రోగి వయసు, కార్డియో మెటబాలిక్ ప్రమాద కారకాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కాబట్టి వృద్ధులు బరువు తగ్గడం గురించి కాకుండా.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటే మంచిదని గుర్తించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read : నోటి బ్యాక్టీరియాతో పెరుగుతున్న పెద్దపేగు క్యాన్సర్.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.