Diabetes: డయాబెటిస్ ఉందా? మీ గుండె జాగ్రత్త, నిశబ్దంగా చంపేస్తుందట!
గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్నవారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించేవారు. అందరిలోనూ లక్షణాలు కనిపించకపోవచ్చని నిశ్శబ్ధంగా గుండె జబ్బు ప్రాణాలకు మీదకు రావచ్చని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
డయాబెటిస్ తో బాధపడే వారిలో దుష్ప్రభావాలుగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. కంటి నుంచి కిడ్నీ వరకు ప్రతి ఒక్క అవయవం డయాబెటిస్ వల్ల ప్రమాదంలో పడవచ్చు. న్యూరో పతి నుంచి స్ట్రోక్ వరకు, రెటినో పతి నుంచి హార్ట్ ఫెయిల్యూర్ వరకు, జీర్ణ సమస్యల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు ఎలాంటి అనారోగ్యానికైనా డయాబెటిస్ కారణం కావచ్చు. అలాగే గుండె జబ్బుల వంటి ప్రమాదం ఉంటుందని అందరికి తెలిసిందే. ఇలా డయాబెటిస్ తో బాధ పడే వారిలో అన్ డయాగ్నస్డ్ గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక అధ్యయనం వివరాలు చెబుతోంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడుతున్న ముగ్గురిలో ఒకరు ఎలాంటి లక్షణాలు లేకుండానే ప్రాణాంతక పరిస్థితుల్లో బతుకుతున్నారని యూఎస్ పరిశోధకులు తెలుసుకున్నారు.
డయాబెటిస్ సమస్య లేని వారితో పోలిస్తే డయాబెటిక్స్ రక్తంలో గుండె ఆరోగ్యానికి చెరుపు చేసే స్పెసిఫిక్ ప్రొటీన్ ఒకటి కనిపించిందట. ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె జబ్బుకు కారణం అవుతుందట.
ఈ బయోమార్కర్లు ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారో సూచించ గలవని బాల్టిమోర్ లోని జాన్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్యూల్ ఆప్ పబ్లిక్ హెల్త్ కి చెందిన డాక్టఱ్ ఎలిజబెత్ సెల్విన్ అంటున్నారు. ఎలాంటి గుండె సమస్యలు లేని టైప్ 2 డయాబెటిస్ ఉన్న చాలా మంది వ్యక్తులు గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదంలో ఉన్నారు. అయితే అందరిలో ఇది ఒకేవిధంగా ఉంటుందని చెప్పే వీలు లేదు. ఎవరు ప్రమాదంలో ఉన్నారనేది అన్నింటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ బయోమార్కర్లు ఎలాంటి ప్రమాద సూచికలు లేని వారిలో కూడా కార్డియోవాస్క్యూలార్ ప్రమాదం కలిగించవచ్చట. గడిచిన 15 సంవత్సరాలలో మధుమేహుల సంఖ్య రెట్టింపయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇది ప్రపంచం మీద హెల్త్ బర్డెన్ మాత్రమే కాదు ఎకానమీ బర్డెన్ గా కూడా పరిణమిస్తోంది.
గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం డయాబెటిస్ వల్ల పెరుగుతుందని ఇదివరకు చాలా అధ్యయనాల్లో పేర్కొన్నారు. అయితే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురించిన తాజా అధ్యయనంలో సమస్య అసలు నిర్ధారణ కాని వారిలో ఎలాంటి పరిస్థితి ఉందో పరిశీలించింది. 10,300 మంది లో ఆరోగ్య సమాచారం, రక్త నమూనాలను 1999 నుంచి 2004 వరకు సేకరించి విశ్లేషించారు. అయితే ఈ అధ్యయనం ప్రారంభంలో ఎవరికీ గుండె జబ్బుల ప్రమాదం లేదు. అయితే ప్రొటీన్లు ప్రమాదాన్ని పెంచుతున్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధకులు పరిశోధించారు. 33.4 శాతం మంది మధుమేహులలో గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలను గమనించారు. రెండు ప్రొటీన్ మార్కర్ల స్థాయి పెరిగినట్టు గుర్తించారు.
Also read : డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.