డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?
డయాబెటిక్స్ లో కంటి చూపు నుంచి గుండె పనితీరు వరకు ప్రతి ఒక్క అవయవం డయాబెటిస్ ప్రభావానికి గురవుతుంది. వీరిలో కలిగే దృష్టి సమస్యలు త్వరగా రాకుండా నిరోధించేందకు అవసరమయ్యే ఔషధం శాస్త్రవేత్తలు
విల్మర్ ఐ ఇన్ట్సిట్యూట్ కి చెందిన జాన్ హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు డయాబెటిక్ ఐ సమస్యల గురించి ప్రయోగాలు నిర్వహించారు. ఈ అధ్యయన బృందం ఎలుకల రెటీనా, మనుషుల రెటినా రెండింటిని ఉపయోగించి రెండు ముఖ్యమైన డయాబెటిక్ ఐ కండీషన్స్ మీద ప్రయోగాలు చేశారు. మొదటిది ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కాగా రెండోది డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా.
ఈ రెండు కండీషన్లు రెటీనా మీద ప్రభావం చూపుతాయి. రెటినా కాంతిని గుర్తించి మెదడుకు దృష్య సంకేతాలను పంపుతుంది. ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి సమస్యలో రెటినా మీద అదనంగా రక్తనాళాలు ఏర్పడుతాయి. ఫలితంగా చూపు కోల్పోతారు, రక్తస్రావం కావచ్చు, లేదా రెటినాకు మెదడుతో సంబంధాలు తొలగిపోవచ్చు.
కొత్తమందు సురక్షితమేనా?
పైన చెప్పుకున్న కంటి సమస్యలకు ప్రస్తుతం యాంటీ వాస్కలర్ ఎండోథెలియల్ గ్రోత్ ప్యాక్టర్ చికిత్సలను ఉపయోగించి కంటి ఇంజక్షన్ల రూపంలో మేనేజ్ చేస్తున్నారు. వీటి ద్వారా రెటినా మీద పెరిగే అసాధారణ రక్తనాళాల పెరుగుదలను నిరోధించగలవు, లీకేజిని కూడా తగ్గించగలవు. అయితే కొంత మందిలో ఈ మందులు పెద్ద ప్రభావవంతంగా లేవు. కంటి నాడిలో ప్రెషర్ పెరగడం, కణజాలానికి నష్టం జరగడం వంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా కలుగవచ్చు.
ప్రస్తుత పరిశోధనల్లో 32-134D అనే కాంపౌండ్ గురించిన అధ్యయనం జరిపారు. ఇది మౌస్ ట్యూమర్ల పెరుగుదలను తగ్గించ గలిగింది. దీన్ని ఉపయోగించిన వారు హైపోక్సియా ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్ (HIF) ను డెవెలప్ చేశారట. దమనుల గొడల మీద HIF ప్రభావం చూపుతాయి. ఇది కొత్త రక్త నాళాలు పెరగడానికి సహాయ పడే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. HIF స్థాయిలను లక్ష్యంగా చేసుకునే ఇతర మందులతో పోలిస్తే 32-134D సురక్షితమైంది. కొత్త అధ్యయనంలో పరిశీలించిన కొత్త ఔషధం మధుమేహుల్లో కళ్ళలో HIF స్థాయిలను సమర్థవంతంగా తగ్గస్తున్నాయి.
రెండు అడల్ట్ మౌస్ మోడల్స్ మీద డయాబెటిక్ ఐ 32-134D కాంపౌండ్ ను వాడినపుడు HIF స్థాయిలు తక్కువగా ఉండి కొత్త రక్త నాళాలు ఏర్పడడాన్ని నివారించింది. ఫలితంగా వ్యాధి త్వరగా ముదరకుండా నివారించడం సాధ్యపడింది. ఈ ఇంజక్షన్ తర్వాత 5 రోజుల్లో ఫలితం కనిపించింది. తర్వాత పరిశోధనల్లో మానవ రెటినా మీద కూడా ఈ ఔషధాన్ని పరీక్షించారు. మానవుల్లో కూడా ఇది అంతే సమర్థవంతంగా పనిచేసింది. అయితే అందరిలో ఇది ఒకే విదంగా పనిచేస్తుందని చెప్పడం సాధ్యపడకపోవచ్చని ఈ అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద ఈ పరిశోధన ద్వారా డయాబెటిక్ కంటి సమస్యలకు సంబంధించిన 32 – 134D వాడడం వల్ల ఎలుకల రక్త నాళాలు అధికంగా లీకేజిని నిరోధించడం గమనించారు. కనుక సమీప భవిష్యత్తులో మరింత ప్రభావం చూపించే మందులు అందుబాటులోకి రావచ్చనే ఆశాభావాన్ని పరిశోధకులు వెల్లడి చేశారు.
Also read : ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.