Romance Scam Alert : డేటింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రేమ పేరుతో మోసం చేసేస్తారు
Dating Apps : డేటింగ్ యాప్స్ ఉపయోగించే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చిందట. కాస్త అటూ ఇటూ అయితే మీరు కూడా దానిబారిన పడతారు.

Romance Scam : ఈ రోజుల్లో చాలామంది అనేక స్కామ్‌లకు గురవుతున్నారు. ఉదాహరణకు - డెబిట్ కార్డ్ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, డేటింగ్ స్కామ్ మొదలైనవి. అయితే వీటితో పాటు మరో కొత్త స్కామ్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దాని పేరు రొమాన్స్ స్కామ్. ఈ స్కామ్‌లో భాగంగా బాధితులను భావోద్వేగపరంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా నష్టపరుస్తారు. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఫేక్ లవ్ నటించి.. ప్రేమలో పడేస్తారు. ప్రేమ పేరుతో నాటకాలు ఆడి.. ఆర్థికంగా దోచుకుంటారు. అయితే ఈ తరహా స్కామ్‌లు ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీలో పెరుగుతున్నట్లు గుర్తిచారు. ఈ ట్రెండ్ వల్ల ప్రజలు నిజమైన ప్రేమపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఈ తరహా మోసాలనుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ యుగంలో.. యువత అంతా ప్రేమను డిజిటల్ యాప్స్‌లోనే వెతుక్కుంటున్నారు. దానిలో భాగంగానే.. Tinder, Bumble వంటి పలురకాల డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డేటింగ్ యాప్‌ల ద్వారా చాలా స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్‌లలో మొదట ప్రజలను బురిడీ కొట్టించి.. తర్వాత సానుభూతితో వారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అది నిజమో కాదో తెలుసుకోవడం పక్కన పెట్టి.. ఎమోషనల్ కనెక్షన్ పెంచుకుని చాలామంది ఆ ట్రాప్‌లో చిక్కుటుంటున్నారు. అనంతరం వారు ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు చాలా ఎక్కువ అయ్యాని.. అలాంటి స్కామ్‌ల నుంచి ఎలా సురక్షితంగా భయటపడాలో చూసేద్దాం.
గుర్తించుకోవాల్సిన విషయాలు..
- మీరు ఎవరినైనా డేటింగ్ యాప్‌లో కలిసి.. వెంటనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాని.. లేదా మీపై క్రష్ ఉందని చెప్తే బ్లష్ అయిపోకండి. వారికి మీరు ఎంతవరకు తెలుసు.. వారు మిమ్మల్ని ఇష్టపడటానికి రీజన్స్ ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే ప్రేమ పేరుతో వారు మిమ్మల్ని తమవైపు తెచ్చుకునే యత్నం కావొచ్చు.

- డేటింగ్ యాప్‌లో ఉపయోగించిన ఫోటో అసలైనదా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని తెలుసుకోవడానికి మీరు Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించవచ్చు. లేదా కలవడానికి ముందు వీడియో కాల్లో ఒకసారి మాట్లాడండి.

- డేటింగ్ యాప్‌లో పరిచయమైన వారిని మీరు మొదటిసారి కలవడానికి వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్లే ప్రదేశం మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ ఫ్యామిలీకి చెప్పాలి. అలాగే జనసంచారం కాస్త ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎంచుకుంటే మంచిది. దీనివల్ల మీరు ఎలాంటి మోసాలకు లేదా ముఠాకు చిక్కకుండా ఉంటారు.

- ఆన్లైన్లో లేదా డేటింగ్ యాప్‌లో పరిచయమైన వారికి మీ సమాచారం అంతా ఇచ్చేయవద్దు. ముఖ్యంగా మీ అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, డబ్బులు పంపడం, అడ్రెస్ షేర్ చేయడం వంటివి మానుకుంటే మంచిది. అత్యంత అవసరం అన్నా సరే ఆన్లైన్లో పరిచయమైన వారికి డబ్బులు పంపడం మంచిది కాదు. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
మీరు నిజంగానే డేటింగ్ యాప్ వాడాలనుకుంటే మీరు ఎవరినైతే డేట్ చేయాలనుకుంటున్నారో వారు ఒరిజనలో కాదో తెలుసుకోండి. అలాగే వెంటనే ప్రేమలో పడిపోకండి. సమయం తీసుకోండి. ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయినా కూడా ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నప్పుడు లేదా జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు కాస్త సమయం తీసుకోవడం మంచిది.






















