Bold Trend: బ్లౌజ్ లేదు, కానీ ఉన్నట్టే లెక్క... అదే ‘మెహెందీ బ్లౌజ్’
ఫ్యాషన్ లోకం కొత్తపుంతలు తొక్కుతోంది. ఈ మెహెందీ బ్లౌజ్ ను చూస్తే మీకు అది నిజమే అనిపిస్తుంది.
మెహెందీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. వేడుకలు వస్తే చాలు చేతులనిండా మెహెందీతో రెడీ అయిపోతారు ముద్దుగుమ్మలు. కానీ ఓ అందాల భామ మాత్రం మెహెందీతో బ్లౌజ్ డిజైన్ వేయించుకుంది. ఆ బ్లౌజ్ అమెరికాలో ట్రెండవుతోంది. క్లాత్ పై మెహెందీ డిజైన్ వేసి కుట్టించుకుందేమో అనుకుంటున్నారా? కాదు శరీరంపై మెహెందీతోనే బ్లౌజ్ ఆకారంలో డిజైన్ వేయించుకుంది. దూరం నుంచి చూస్తే నిజంగా బ్లౌజే అనిపిస్తుంది కానీ, నిజానికి ఏ ఆచ్చాదన లేదక్కడ.
ఆమె భారతీయ మూలాలున్న అమెరికన్. పేరు మీను గుప్తా. మోడల్ గా పనిచేస్తోంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో హెన్నా బ్లౌజ్, ఆపైన చీరకట్టుతో అందంగా ముస్తాబై ఫోటోలు తీసుకుంది. ఆమె హెన్నాబ్లౌజ్ వీడియో వైరల్ గా మారడంతో వార్తల్లోకెక్కింది. నిజానికి ఈ బోల్డ్ ట్రెండ్ గత ఏడాది నుంచే వాడుకలోకి వచ్చింది. కానీ దీన్ని ఎక్కువ మంది ఫాలో కాలేకపోయారు. కారణం పైట పక్కకి తప్పితే, శరీర అవయవాలు కనిపించే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఎవరూ పెద్దగా ట్రై చేయలేదు. ఇప్పుడు మీను సాహసంతో మరింత మంది ఈ బోల్డ్ ట్రెండ్ ను ఫాలో అవ్వచ్చు.
View this post on Instagram
View this post on Instagram
Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Read Also: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి