News
News
వీడియోలు ఆటలు
X

నా భర్త అతని అక్కలు ఏం చెబితే అదే చేస్తున్నారు, ఇది నాకు నచ్చడం లేదు

తన భర్త అక్కచెల్లెళ్ల చేతిలో కీలుబొమ్మగా మారారని చెబుతున్న ఓ భార్య కథనం ఇది.

FOLLOW US: 
Share:

ప్రశ్న: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్తకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇతనే అందరికన్నా చిన్నవాడు. అక్కల ప్రభావం నా భర్త మీద ఎక్కువగా ఉంది. ఎంతగా అంటే వాళ్ళు ఏం చెబితే అదే చేస్తారు. ఏ రంగు షర్ట్ వేసుకోమంటే, ఆ రంగు షర్ట్ మాత్రమే వేసుకుంటారు.  వారు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరు. వారు ఎన్ని తిట్టినా నిశ్శబ్దంగా ఉండిపోతారు.  పెళ్లయ్యాక వారు నా మీద కూడా ప్రతాపం చూపించడం ప్రారంభించారు. వారు నన్ను తిట్టినా కూడా, నా భర్త నా మీదే కోపం చూపిస్తున్నారు.  వారికి పెళ్లిళ్లు అయిపోయి వేరే కుటుంబాలకు వెళ్లిపోయిన వారే. కానీ వారంతా మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. దీనివల్ల వారి ప్రభావం మా ఇంటి పై ఎక్కువగానే ఉంటుంది. అక్కలు వాళ్ళ ఇళ్ళల్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. వారి వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. కనీసం నా అభిప్రాయాలకు విలువ  ఇవ్వరు. నేను ఇంట్లో ఒక ప్రాణం ఉన్న బొమ్మని మాత్రమే. అతని అక్కలు కూడా నా అభిప్రాయాలకు ఎలాంటి విలువ ఇవ్వరు. నన్ను పట్టించుకోరు. వారు చెప్పింది చేయకపోతే మాత్రం రాద్ధాంతం చేస్తారు. నా భర్తను అతని అక్కల ప్రభావం నుంచి తప్పించడం ఎలా?

జవాబు: భారతదేశంలో పురాతన కాలం నుంచి ఒక విషయాన్ని చెప్పుకుంటారు... అదేంటంటే కుటుంబంలో ఒకరిని వివాహ చేసుకోవడం అంటే వారి మొత్తం కుటుంబాన్ని వివాహం చేసుకొని భరించడమే అని. ఇది మీ జీవితంలో నిజమే అనిపిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మాత్రమే కాదు, వారి కుటుంబంలోని ప్రతి సభ్యులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లయ్యాక అమ్మాయి కొత్త కుటుంబంలో అడుగుపెడుతుంది. అక్కడ ఉన్న ప్రతి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది.అయితే భార్యాభర్తల విషయానికి వస్తే వీరిద్దరికి వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత స్పేస్ అనేది చాలా ముఖ్యం. కానీ కొన్ని కుటుంబాల్లో కొందరు కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని గుర్తించరు. తమ భార్యాభర్తలకు సొంత సమయం ఉన్నట్టే సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు ఉన్నట్టే తమ సోదరుడి కుటుంబానికి కూడా అలాంటివి ఉంటాయని గుర్తించరు.  అలాంటి వారే మీ ఆడపడుచులు. ఈ విషయంలో మీరు మీ అత్తమామల సాయం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మాత్రమే వారి కొడుకుకి భార్యతో ఎలా ఉండాలో చెప్పే అవకాశం ఉంది. 

 మీ విషయంలో వారి అక్కల జోక్యం నిజంగా బాధించేది. ఇంట్లో చిన్నవాడు కావడంతో చిన్నప్పటినుంచి వారికి తమ్ముడు విషయంలో ప్రతిదీ జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు అయి ఉండొచ్చు. అయితే భార్య వచ్చాక వారిద్దరికీ కొంత వ్యక్తిగత సమయాన్ని వదలాలన్న ఆలోచన వారికి ఉండాలి.

ముందుగా మీరు మీ భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ భర్తతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వాములు మొదట స్నేహితులుగా మారితే, ఆ తర్వాత ఆ బంధం మరింత గట్టి పడుతుంది. ఒకరితో ఒకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే విధంగా భార్యాభర్తల బంధం ఉండాలి. అవసరమైతే మీరు మీ ఆడపడుచులతో కూడా ఈ విషయాన్ని మాట్లాడండి. వారు ఎలా తమ భర్తలతో వ్యవహరిస్తున్నారో, మీరు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పండి. గొడవ కన్నా కూర్చుని చర్చించుకోవడం చాలా మంచిది. లేకుంటే అనవసర గొడవల వల్ల దూరాలు పెరుగుతాయి. ఇది మీ భార్య భర్తల బంధం పై కూడా ప్రభావం చూపిస్తుంది. మీ అత్తయ్య మావయ్యలకి మీ పరిస్థితిని వివరించండి. ఒక్కడే కొడుకు అని చెబుతున్నారు కనుక కచ్చితంగా వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరినీ కలిపి ఉంచడానికి సహకరిస్తారు. భార్యాభర్తల బంధం గట్టిగా ఉన్నప్పుడే అది కలకాలం సాగుతుంది.  ముందు మీరు మీ భర్తతో మానసికంగా దగ్గర అవడానికి ప్రయత్నించండి. 

Also read: రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం

Published at : 15 Apr 2023 11:20 AM (IST) Tags: Wife and Husband Relationship Questions Problem with Husband

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి