Morning Yoga Rituals : ఉదయాన్నే ఈజీగా చేయగలిగే యోగాసనాలు.. ఆరోగ్యానికి కలిగే లాభాలివే
Easy Yoga Poses : యోగాను రెగ్యులర్‌గా చేయాలనుకుంటే సింపుల్‌గా చేయగలిగే ఈ ఆసనలు ట్రై చేయవచ్చు. వీటితో కలిగే లాభాలు ఏంటో.. ఎలా వాటిని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Morning Yoga Benefits : ఉదయాన్నే నిద్ర లేచి యోగా చేస్తే శరీరానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. శరీరం ఫ్లెక్సీబుల్‌గా ఉండాలన్నా.. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలన్నా దీనిని మీ డైలీ రొటీన్లో చేర్చుకోవాలంటున్నారు యోగా నిపుణులు. ఉదయాన్నే.. సింపుల్‌గా చేయగలిగే యోగా ఆసనాలతో రోజును ప్రారంభించాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవేంటో.. వాటిని ఎలా చేయాలో.. వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
తడాసన
తడాసనను చేయడం చాలా సులభం. దీనినే మౌంటైన్ పోజ్ అని కూడా అంటారు. ఇది భంగిమను సరి చేసి స్టెబులిటీ ఇస్తుంది. కాళ్లను స్ట్రాంగ్ చేస్తుంది. నడుము నుంచి కింది భాగాన్ని స్ట్రాంగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
నేలపై నిటారుగా నిల్చొని పాదాలు కలిపి లేదా తక్కువ దూరంలో ఉంచాలి. ఇప్పుడు చేతులు నిటారుగా పైకి ఎత్తి.. పైన దండం పెట్టాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మడమలను పైకి లేపాలి. కాసేపు ఉండి శ్వాస వదులుతూ మామూలు స్థితికి రావాలి.
ఉత్కటాసనం
ఉత్కటాసనాన్ని చైర్ పోజ్ అని కూడా ఉంటారు. ఇది కాళ్లను, పిరుదులను స్ట్రాంగ్ చేసి.. మంచి షేప్ ఇస్తుంది. నడుమును కూడా స్ట్రాంగ్ చేస్తుంది. రక్తప్రసరణ మెరుగవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
నిటారుగా నిలబడి శ్వాస వదులుతూ మోకాళ్లను వంచి.. శరీరాన్ని కుర్చీలో కూర్చున్నట్లు భంగిమ ఉంచాలి. వెన్నును నిటారుగా చేసి.. చేతులు ముందుకు చాచి ఉంచాలి. ఇలా కొన్ని సెకన్లు ఉంటి.. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదలాలి.
అథో ముఖ స్వనాశనం
ఈ ఆసనాన్ని డౌన్వార్డ్ ఫేసింగ్ డాగ్ అని కూడా అంటారు. ఇది మొత్తం శరీరాన్ని స్ట్రెచ్ చేయగలిగే ఆసనం. పైన శరీరం, కోర్, కాళ్లు అన్ని దృఢంగా మారడంలో ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది. వెన్ను నొప్పిని తగ్గించడంలో మేలు చేస్తుంది.
మోకాళ్లపై కూర్చొని చేతులు ముందుకు చాచి నేలపై సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు చేతులపై బరువు ఆన్చుతూ పాదాలు నేలపై ఉంచి మోకాళ్లు లేపాలి. కాళ్లు, చేతులు దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కొన్ని సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి.
భుజంగాసనం
దీనినే కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఇది నడుమును, వీపు భాగాన్ని స్ట్రాంగ్‌గా చేయడంతో పాటు టోన్ చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సాహిస్తుంది.
నేలపై బోర్లా పడుకుని.. చేతులు ఛాతీ దగ్గర నేలపై ఉంచి చేతులపై ప్రెజర్ వేస్తూ .. శరీరం పైభాగాన్ని లేపుతూ ఉండాలి. నడుమును స్ట్రెచ్ చేయాలి. ఇలా కొన్ని నిమిషాలు ఉండి.. తర్వాత యథాస్థితికి రావాలి.
బాలాసనం
చైల్డ్ పోజ్ కూడా రెగ్యులర్‌గా చేస్తే మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి.. టెన్షన్ లేకుండా మానసికంగా హాయిగా ఉండేలా చేస్తుంది. బ్యాక్, హిప్స్ని స్ట్రెచ్ చేస్తుంది. నడుము నొప్పిని కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
మోకాళ్లపై పడుకోని ముందుకు సాగి.. చేతులను చాపి కాసేపు రిలాక్స్ అవ్వాలి. మళ్లీ యథాస్థితికి రావాలి.
వక్రాసనం, వారియర్ పోజ్, పశ్చిమోత్తాసన వంటివి కూడా సింపుల్‌గా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గి.. శరీరానికి మంచి బెనిఫిట్స్ అందుతాయి. వీటిని పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ చేయవచ్చు.






















