By: Haritha | Updated at : 30 Jan 2023 08:11 AM (IST)
(Image credit: Youtube)
సాంప్రదాయ పద్ధతుల్లో అన్నం వండడం అనేది పూర్తిగా అంతరించిపోతోంది. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే గంజి వచ్చేలా అన్నాన్ని వండుతున్నారు. అన్నాన్ని ఎక్కువ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గంజి వచ్చేలా చేయవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండడం మొదలుపెట్టాక గంజి అనే పదాన్నే మర్చిపోయారు ప్రజలు. అన్నంతో పోలిస్తే గంజిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అన్నం వండాక మిగిలిన నీటిని గంజి అంటారు. పూర్వం ఆ గంజినీటిని తాగేవారు కాబట్టే అప్పట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేవారని అంటారు. వేసవిలో ఆ గంజినీటిలో కొన్ని ఉల్లిపాయల తరుగు, కాస్త ఉప్పు వేసుకొని తాగితే వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్యలు రావు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. దీన్ని హిందీలో మాండ్ అని పిలుస్తారు. గంజి నీళ్లతో ఎన్ని ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా అలా వండడం మొదలుపెడతారు.
1. చంటి పిల్లలకు గంజినీటితో బేబీ ఫుడ్ ను తయారు చేయొచ్చు. ఇది ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటుంది. శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్సును చేస్తుంది. జీర్ణశక్తిని అందిస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా బియ్యంలో అధికంగా నీళ్లు వేసి ఉండడమే. అన్నం ఉడికాక ఆ మిగిలి నీటిని వార్చేయాలి. అలా వచ్చిన గంజిని పిల్లల కోసం వాడవచ్చు. ఆ గంజిలో కొంచెం అన్నం, చిటికెడు ఉప్పు, కాస్త నెయ్యి వేసి మెత్తగా మెదిపి చంటి పిల్లలకు తినిపించవచ్చు. ఏడెనిమిది నెలల పిల్లలకు కూడా దీన్ని తినిపించవచ్చు.
2. కూరల్లో పోషక విలువలను పెంచేందుకు గంజి ఉపయోగపడుతుంది. అలాగే కూరలు చిక్కగా రావాలన్నా కూడా గంజిని వాడొచ్చు. ముఖ్యంగా పనీర్ చికెన్ ఫిష్ లాంటి కర్రీలకు ఇది అదనపు రుచిని అందిస్తుంది.
3.కాటన్ దుస్తులకు గంజి వాడడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది బియ్యం వండడం వల్ల వచ్చే గంజిని వాడడం మానేసి, మార్కెట్లో రెడీమేడ్ గా దొరుకుతున్న పొడిని వాడుతున్నారు. ఇంట్లో తయారుచేసిన గంజిని వాడడం వల్ల దుస్తులకు ఎలాంటి ముప్పు ఉండదు. ఎక్కువ కాలం మన్నుతాయి కూడా.
4. గంజినీళ్ళతో ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. కొంచెం గంజిలో బేకింగ్ సోడా, ఉప్పు కలిపి స్ప్రే బాటిల్ లో వేసి, వాటిని ఎక్కడ మరకలు ఉంటే అక్కడ స్ప్రే చేయాలి. స్ప్రే చేశాక వస్త్రంతో గట్టిగా రుద్దడం వల్ల ఆ మరకలు పోతాయి. ముఖ్యంగా గాజు వస్తువులపై ఉన్న మరకలను ఇది తొలగిస్తుంది.
5. ఎవరైనా వాంతులు, విరేచనాల బారిన పడి డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఈ గంజిని తాగితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. ఇది శరీరానికి శక్తినిస్తుంది. జీర్ణం అవ్వడం కూడా చాలా సులువు. కాబట్టి అనారోగ్యంగా ఉన్నవారికి ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.
6. గంజి నీళ్లతో జుట్టు తడుపుకొని కాసేపు అయ్యాక స్నానం చేసేయాలి. వెంట్రుకలకు మెరుపును ఇవ్వడంలో గంజి సహాయపడుతుంది. ఈ గంజిని పొడి రూపంలో కూడా మార్చుకోవచ్చు. దీనికి చేయాల్సినదల్లా గంజి నీటిని స్టవ్ మీద పెట్టి, చిన్న మంట మీద ఎక్కువ సేపు ఉడికించాలి. దీనివల్ల చివరికి చిక్కటి పదార్థం మిగిలిపోతుంది. దాన్ని ఎండలో ఎండబెట్టినప్పుడు పొడిగా మారుతుంది. అలాగే గంజిని నేరుగా ఎండలో ఎండబెట్టినా కూడా చివరకు పొడిగా అవుతుంది. ఆ పొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ నూనెను చర్మానికి రాసుకుంటే చాలా మృదువుగా మారుతుంది స్కిన్.
Also read: సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!
ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు
Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్ఫాస్ట్
రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?
Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
PBKS Vs KKR: కోల్కతాకు వర్షం దెబ్బ - డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ లాజిక్ వేరే...