By: ABP Desam | Updated at : 25 Jan 2022 08:43 PM (IST)
Image Credit: Pixabay
ఓ వ్యక్తి కదల్లేని పరిస్థితుల్లో ఉన్న తన అంకుల్‌ను పోస్టాఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడి సిబ్బందికి అతడిని చూపించి.. ‘‘మా అంకుల్ కదల్లేరు. కాబట్టి.. ఇచ్చేయండి సార్.. ఇచ్చేయండి సార్.. అతడి పింఛన్ నాకు ఇచ్చేయండి’’ అని అన్నాడు. ఈ సందర్భంగా పింఛన్ సిబ్బంది.. బయోమెట్రిక్ ద్వారా అతడి వివరాలను నిర్ధరణ చేసుకోడానికి ఆ పెద్దాయన చేయి పట్టుకున్నారు. అంతే.. ఒకసారే వాళ్ల ఒళ్లు జలదరించింది. చలనం లేకుండా ఉన్న అతడి శరీరాన్ని తాకగానే.. చనిపోయడాని నిర్ధరించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పెద్దాయనను తీసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు చనిపోయాడనే సంగతి తనకు తెలియదని.. ఆయన సాయం చేయడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చానని తెలిపాడు. కానీ, పోలీసులు అతడి మాటలు నమ్మలేదు. స్థానికులు కూడా ఆ వ్యక్తే చంపేసి ఉంటాడని ఆరోపించారు. అయితే.. ఇందుకు ఒక కారణం ఉంది.
అసలు ఏం జరిగింది?: ఐర్లాండ్‌కు చెందిన డెక్లాన్ హగ్నీ అనే 40 ఏళ్ల వ్యక్తి.. పీదర్ డోయ్లే అనే 66 ఏళ్ల వృద్ధుడిని పోస్టాఫీస్‌కు తీసుకెళ్లాడు. అతడు తన అంకుల్ అని చెప్పి.. పింఛన్ తీసుకోబోయాడు. సిబ్బంది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పీదర్ శవాన్ని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం హగ్నీని ప్రశ్నించి వదిలిపెట్టేశారు. అతడు ఆ పెద్దాయనను చంపాడని చెప్పేందుకు తగిన ఆధారలు లేవని పోలీసులు తెలిపారు. పీదర్‌ది సహజ మరణమేనని నిర్ధరించారు.
వెంటాడుతున్న గతం: పోలీసులు పీదర్‌ను హగ్నీ హత్య చేయలేదని చెబుతున్నా.. స్థానికులు మాత్రం అతడే పెద్దాయనను చంపేశాడని ప్రచారం చేస్తున్నారు. అతడి పింఛన్ డబ్బులను కాజేయడానికే పీదర్ శవాన్ని పోస్టాఫీసుకు తీసుకెళ్లాడని ఆరోపిస్తున్నారు. అయితే, హగ్నీ మాత్రం.. ఆయన చనిపోయాడనే సంగతి పోస్టాఫీసుకు తీసుకెళ్లిన తర్వాతే తెలిసిందని, అతడి పెన్షన్‌ను కొట్టేసే ఆలోచన తనకు లేదని అంటున్నాడు.
ఈ సందర్భంగా అతడు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను మా అంకుల్‌ను ఎందుకు దోచుకోవాలని అనుకుంటాను? నేను పిల్లాడిని కాదు, నాకు 40 ఏళ్లు. చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు కొట్టేసేంత ఆలోచన నాకు లేదు. డ్రగ్స్ కేసులో నేను రెండేళ్ల జైల్లో ఉన్నాను. ఆ గతమే ఇప్పుడు నన్ను వెంటాడుతోంది. జనాలు ఇంకా నన్ను నేరగాడిలా చూస్తున్నారు. ఓ సారి నేను మా ఆంటీ బ్యాంక్ కార్డును తీసుకున్నాను. పాస్‌వర్డ్ తెలుసుకుని డబ్బులు తీసుకున్నాను. కానీ, అదంతా 15 ఏళ్ల క్రితం జరిగింది. నేను నా తప్పు తెలుసుకుని సాధారణ జీవితం గడుపుతున్నా. నా లైఫ్ ఇప్పుడు బాగానే ఉంది. నేను అతడిని పోస్టాఫీసుకు తీసుకెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయి ఉంటాడేమో’’ అని తెలిపాడు. అయితే, స్థానికులు మాత్రం అతడి మాటలు నమ్మడం లేదు. ఆ పెద్దాయనను అతడే చంపేసి ఉంటాడని, ఈకేసు విచారించాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. మరి, చివరికి ఏం తేలుతుందో చూడాలి.
రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!
Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!
Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా